< 1 కొరింథీయులకు 9 >

1 నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా?
Vai es neesmu svabads? Vai es neesmu apustulis? Vai es Kristu, mūsu Kungu, neesmu redzējis? Vai jūs neesat mans darbs iekš Tā Kunga?
2 నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు.
Ja es citiem neesmu apustulis, tomēr jums es esmu; jo mana apustuļa amata zieģelis jūs esat iekš Tā Kunga.
3 నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే.
Mana atbildēšana tiem, kas mani tiesā, ir šī:
4 తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా?
Vai mums nav brīv, ēst un dzert?
5 మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా?
Vai mums nav brīv kādu māsu vest līdz par sievu, tā kā arī tie citi apustuļi un Tā Kunga brāļi un Kefas?
6 బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా?
Jeb vai man un Barnabam vien nav brīv, nestrādāt?
7 ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు?
Kas jel iet karā ar savu maizi? Kas vīna kalnu dēsta un neēd no viņa augļiem? Jeb kas lopus gana un neēd no tā piena?
8 ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా?
Vai es to runāju pēc cilvēku prāta? Jeb vai to nesaka arī pati bauslība?
9 “ధాన్యపు కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది?
Jo Mozus bauslībā ir rakstīts: Tev nebūs vērsim, kas labību min, purnu apsiet: vai tad Dievam rūp par vēršiem?
10 ౧౦ నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి.
Jeb vai viņš to visu nesaka mūsu labad? Jo mūsu labad ir rakstīts, ka arājam vajag art uz cerību un kūlējam kult uz cerību, ka viņam būs sava daļa.
11 ౧౧ మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు.
Ja mēs jums to garīgo mantu esam sējuši, vai tad tā liela lieta, ja jūsu miesīgo pļaujam?
12 ౧౨ వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం.
Ja tad citiem tāda vaļa ir par jums, kāpēc ne jo vairāk mums? Bet mēs šo vaļu neesam lietojuši, bet visu panesam, lai Kristus evaņģēliju neaizkavējam.
13 ౧౩ దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్తులు అని మీకు తెలియదా?
Vai nezināt, ka tie, kas pie svētuma kalpo, no tā svētuma ēd? Un ka tiem, kam darbs ir pie altāra, daļa ir no tā altāra?
14 ౧౪ అదే విధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు.
Tāpat arī Tas Kungs ir iestādījis, ka tie, kas evaņģēliju sludina, no evaņģēlija pārtiek.
15 ౧౫ అయితే వీటిలో దేనినీ నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే, అంతకంటే నాకు మరణమే మేలు.
Bet no tā es nekā neesmu lietojis. Un es to neesmu rakstījis, lai pie manis tā notiek; jo man būtu labāki mirt, nekā ja kāds manu slavu nīcinātu.
16 ౧౬ నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.
Jo kad es evaņģēliju sludināju, tad man nav ko lielīties; jo tas man jādara; un vai man, ja es evaņģēliju nesludināju!
17 ౧౭ దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు.
Jo ja es to labprāt daru, tad man ir alga; ja ne labprāt, tad tomēr nama turēšana man ir uzticēta.
18 ౧౮ అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం.
Kāda alga tad nu man ir? Ka evaņģēliju sludinādams Kristus evaņģēliju mācu bez maksas, lai neizlietoju savu vaļu pie evaņģēlija.
19 ౧౯ నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను.
Jo no visiem svabads būdams es sevi pašu esmu darījis visiem par kalpu, ka jo vairāk dvēseļu mantotu.
20 ౨౦ యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను.
Un Jūdiem es esmu tapis par Jūdu, ka Jūdus mantotu; tiem, kas apakš bauslības es esmu tapis kā apakš bauslības, (pats nebūdams apakš bauslības, ) ka mantotu tos, kas apakš bauslības.
21 ౨౧ దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను.
Tiem, kas bez bauslības, esmu tapis tā kā bez bauslības, (pats nebūdams bez bauslības Dieva priekšā, bet stāvēdams iekš bauslības caur Kristu), ka es tos mantotu, kas bez bauslības.
22 ౨౨ బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను.
Vājiem es esmu tapis tā kā vājš, ka mantotu vājos; visiem esmu palicis viss, ka visādi kādus glābtu.
23 ౨౩ సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
Un to es daru evaņģēlija dēļ, ka man arī kāda daļa pie tā būtu.
24 ౨౪ పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి.
Vai nezināt, ka tie, kas iet skrieties, gan visi skrien, bet viens dabū to goda maksu? Skrieniet tā, ka jūs to dabūjiet.
25 ౨౫ అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.
Bet ikviens, kas cīkstas, savaldās visās lietās, - viņi tāpēc, ka dabūtu iznīcīgu kroni, bet mēs neiznīcīgu.
26 ౨౬ కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు.
Es tad skrienu, ne tā kā uz ko nezināmu, - es cīnos, ne tā kā gaisu sizdams;
27 ౨౭ ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
Bet es savu miesu mērdēju un viņu kalpināju, lai citiem sludinādams pats nekļūstu atmetams.

< 1 కొరింథీయులకు 9 >