< 1 కొరింథీయులకు 7 >

1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి.
A za ono što mi pisaste: dobro je èovjeku da se ne dohvata do žene:
2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.
Ali zbog kurvarstva svaki da ima svoju ženu, i svaka žena da ima svojega muža;
3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి.
Muž da èini ženi dužnu ljubav, tako i žena mužu.
4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.
Žena nije gospodar od svojega tijela, nego muž; tako i muž nije gospodar od svojega tijela, nego žena.
5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.
Ne zabranjujte se jedno od drugoga, veæ ako u dogovoru za vrijeme, da se postite i molite Bogu; i opet da se sastanete, da vas sotona ne iskuša vašijem neuzdržanjem.
6 ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.
Ali ovo govorim po svjetu a ne po zapovijesti;
7 ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.
Jer hoæu da svi ljudi budu kao i ja; ali svaki ima svoj dar od Boga: ovaj dakle ovako a onaj onako.
8 నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను.
A neoženjenijem i udovicama velim: dobro im je ako ostanu kao i ja što sam.
9 అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.
Ako li se ne uzdrže, neka se žene i udaju; jer je bolje ženiti se negoli upaljivati se.
10 ౧౦ ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు.
A oženjenijem zapovijedam, ne ja nego Gospod, da se žena od muža ne razdvaja
11 ౧౧ ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
Ako li se pak i razdvoji, da se više ne udaje, ili da se pomiri sa svojijem mužem i muž da ne pušæa žene.
12 ౧౨ మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.
A ostalima govorim ja a ne Gospod: ako koji brat ima ženu nekrštenu i ona se privoli življeti s njim, da je ne ostavlja.
13 ౧౩ అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు.
I žena ako ima muža nekrštena i on se privoli življeti s njom, da ga ne ostavlja.
14 ౧౪ అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.
Jer se posveti muž nekršten ženom krštenom, i posveti se žena nekrštena od muža krštenoga; jer inaèe djeca vaša bila bi neèista, a sad su sveta.
15 ౧౫ అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు.
Ako li se nekršteni razdvaja, neka se razdvoji; jer se brat ili sestra u takovom dogaðaju ne zarobi; jer nas na mir dozva Gospod Bog.
16 ౧౬ మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?
Jer šta znaš, ženo, da ako muža spaseš? ili šta znaš, mužu, da ako ženu spaseš?
17 ౧౭ అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.
Samo kao što je Bog razdijelio svakome, i kao što je svakoga pozvao Gospod onako neka živi. I tako zapovijedam po svijem crkvama.
18 ౧౮ ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు.
Je li ko pozvat obrezan, neka se ne gradi neobrezan; ako li je ko pozvat neobrezan, neka se ne obrezuje.
19 ౧౯ దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,
Obrezanje je ništa, i neobrezanje je ništa; nego držanje zapovijesti Božijeh.
20 ౨౦ ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి.
Svaki neka ostane u onome zvanju u kome je pozvan.
21 ౨౧ దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది.
Jesi li pozvan rob, ne brini se; nego ako i možeš svoj biti, još radije budi.
22 ౨౨ ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస.
Jer koji je pozvan u Gospodu rob, slobodnjak je Gospodnji, tako i koji je pozvan slobodnjak, rob je Hristov.
23 ౨౩ ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు.
Kupljeni ste skupo, ne budite robovi ljudima.
24 ౨౪ సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.
Svaki, braæo, u èemu je ko pozvan u onome neka ostane pred Gospodom.
25 ౨౫ పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గానీ ప్రభువు కృప చేత నమ్మదగిన వాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను.
A za djevojke nemam zapovijesti Gospodnje, nego dajem svjet, kao koji sam pomilovan od Gospoda, da budem vjeran.
26 ౨౬ కాబట్టి ఇప్పుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడం మేలని నా ఉద్దేశం.
Mislim dakle ovo da æe biti dobro za sadašnju nevolju da je èovjeku dobro tako biti.
27 ౨౭ వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా స్వేచ్ఛగా, లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు.
Jesi li se privezao za ženu, ne traži da se razdriješiš; jesi li se odriješio od žene, ne traži žene.
28 ౨౮ ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్ళి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
A ako li se i oženiš, nijesi sagriješio; i djevojka ako se uda, nije sagriješila: ali æe imati takovi nevolje tjelesne; a ja vas žalim.
29 ౨౯ సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.
A ovo govorim, braæo, jer je ostalo vrijeme prekraæeno, da æe i oni koji imaju žene biti kao oni koji nemaju;
30 ౩౦ ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి.
I koji plaèu kao koji ne plaèu; i koji se raduju kao koji se ne raduju; i koji kupuju kao koji nemaju;
31 ౩౧ ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.
I koji ovaj svijet upotrebljavaju kao da ga ne upotrebljavaju: jer prolazi oblièje ovoga svijeta.
32 ౩౨ మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు.
A ja hoæu da ste vi bezbrižni. Ko je neoženjen brine se za Gospodnje, kako æe ugoditi Gospodu;
33 ౩౩ పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు.
A koji je oženjen brine se za svjetsko, kako æe ugoditi ženi. Drugo je žena, a drugo je djevojka.
34 ౩౪ అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.
Koja je neudata brine se za Gospodnje, kako æe ugoditi Gospodu, da bude sveta i tijelom i duhom; a koja je udata brine se za svjetsko, kako æe ugoditi mužu.
35 ౩౫ మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.
A ovo govorim na korist vama samijem, ne da vam nametnem zamku na vrat, nego za lijepu i pristojnu službu Gospodu bez smetnje.
36 ౩౬ ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు.
Ako li pak ko misli da je sramota za njegovu djevojku kad ostane usidjelica, i ne može drukèije biti, neka èini šta hoæe, ne griješi ako se uda.
37 ౩౭ అయితే ఎవరైనా పెళ్ళి చేసుకోనని హృదయంలో నిశ్చయించుకుని, దానికి తగిన మనోబలం ఉండి, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే అతడు చేసేది మంచి పని.
A koji stoji tvrdo u srcu, i nema nevolje, a ima vlast nad svojom voljom, i ovo je rasudio u srcu svojemu da zadrži djevojku, dobro èini.
38 ౩౮ కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
Tako i onaj koji udaje svoju djevojku dobro èini; ali koji ne udaje bolje èini.
39 ౩౯ భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.
Žena je privezana zakonom dokle joj god živi muž; a ako joj umre muž, slobodna je za koga hoæe da se uda, samo u Gospodu.
40 ౪౦ అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్ఠమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.
Ali je blaženija ako ostane tako po mojemu svjetu; jer mislim da i ja imam Duha Božijega.

< 1 కొరింథీయులకు 7 >