< 1 కొరింథీయులకు 5 >

1 మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.
It is actually reported that there is fornication among you, a kind of fornication that is not even named among the Gentiles, for a man has his father's wife.
2 ఇలా ఉండి కూడా మీరు విర్రవీగుతున్నారు. నిజానికి ఈ విషయమై మీరు విలపించాలి గదా. ఇలాటి పని చేసిన వాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి.
And you are puffed up! You should have mourned instead and removed the man who did this from among you.
3 నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను.
For though I am absent in body, I am present in spirit. And I have already judged the man who did this, just as though I were present.
4 ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభు యేసు శక్తి ద్వారా నేను నా ఆత్మలో మీతో ఉండగా,
So when you are gathered together in the name of our Lord Jesus Christ and I am with you in spirit, along with the power of our Lord Jesus Christ,
5 ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.
hand this man over to Satan for the destruction of his flesh, so that his spirit may be saved in the day of the Lord Jesus.
6 మీరు గర్వంతో మిడిసిపడడం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా, అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా!
Your boasting is not good. Do you not know that a little leaven leavens the whole lump?
7 మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది.
Purge out the old leaven so that you may be a new lump of dough, since you really are unleavened. For Christ, our Passover lamb, has been sacrificed for us.
8 కాబట్టి, చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండగ జరుపుకుందాం.
So then, let us celebrate the feast, not with old leaven, nor with the leaven of malice and evil, but with the unleavened bread of sincerity and truth.
9 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను.
I wrote to you in my letter not to associate with fornicators.
10 ౧౦ అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునే వారు, విగ్రహాలను పూజించేవారు ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.
Yet I certainly did not mean the fornicators of this world or the greedy or swindlers or idolaters, since you would then need to go out of the world.
11 ౧౧ ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు.
But now I am writing to you not to associate with anyone who is named as a brother if he is a fornicator or greedy, an idolater or a reviler, a drunkard or a swindler; do not even eat with such a man.
12 ౧౨ సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు.
For what have I to do with judging those who are outside the church? Do you not judge those who are inside the church?
13 ౧౩ లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి.
God will judge those who are outside the church. “Therefore you must remove the evil person from among you.”

< 1 కొరింథీయులకు 5 >