< 1 కొరింథీయులకు 5 >
1 ౧ మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.
Wachore e lela ni nitie terruok e dieru, kendo ni en kit terruok ma kata jopiny ok tim; nikech ngʼato terore gi chi wuon.
2 ౨ ఇలా ఉండి కూడా మీరు విర్రవీగుతున్నారు. నిజానికి ఈ విషయమై మీరు విలపించాలి గదా. ఇలాటి పని చేసిన వాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి.
To bende pod usungoru asunga! Donge onego bed ni upongʼ gi kuyo mondo ugol oko ngʼat matimo kamano e dieru?
3 ౩ నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను.
Kata obedo ni aonge kodu kuno e ringruok, to ngʼeuru ni an kodu kuom chuny. An to asengʼadone ngʼat matimo tim marachno bura, mana ka gima ne an kodu kuno.
4 ౪ ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభు యేసు శక్తి ద్వారా నేను నా ఆత్మలో మీతో ఉండగా,
Ka uchokoru e nying Ruodhwa Yesu, kendo an kodu kuom chuny, kendo teko mar Ruodhwa Yesu bende ni kodu,
5 ౫ ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.
to keturu ngʼatni e lwet Satan mondo ringre mohero richono okethi, to chunye to mondo oresi chiengʼ biro Ruoth.
6 ౬ మీరు గర్వంతో మిడిసిపడడం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా, అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా!
Sungau ok ber. Donge ungʼeyo ni thowi matin kende oromo kuodo mogo modwal duto?
7 ౭ మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది.
Goluru thowi machon-no oko e dieru mondo ubed maler chutho, eka unubed ka mogo modwal manyien ma ok oketie thowi, nimar kamano e kaka uchalo. Kristo, ma en nyarombowa mar Pasaka, osetimgo misango.
8 ౮ కాబట్టి, చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండగ జరుపుకుందాం.
Emomiyo koro watimuru sawo, ok gi thowi machon mar himruok kod timbe maricho, to watime gi makati ma ok oketie thowi, ma en makati mar wuotho e ler kod adiera.
9 ౯ వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను.
Ne asendikonu e barupa motelo ni kik ubedi e kanyakla mar joma terore.
10 ౧౦ అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునే వారు, విగ్రహాలను పూజించేవారు ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.
Ok awuo kuom jopiny mapok oyie ma terore, kata ma jowuoro, kata ma jomecho, kata malamo nyiseche manono, nikech mano to dichunwa ni wadar e pinyni.
11 ౧౧ ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు.
To koro andikonu mondo kik ubedi e kanyakla gi ngʼato angʼata maluongore ni owadu kuom Ruoth, to pod terore, kata ma jawuoro, kata malamo nyiseche manono, kata ma jaketh nying ji, kata ma jamer, kata ma jamecho. Ngʼat ma kamano kata chiemo kik uchiemgo.
12 ౧౨ సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు.
Donge ok en tichna mondo angʼad bura ne joma ok jo-Kristo? Donge joma osebedo e kanyakla mar joma oyie ema onego ungʼadnigi bura?
13 ౧౩ లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి.
Nyasaye biro ngʼado bura ni joma ni oko, omiyo riemburu jarichono oa e dieru.