< 1 కొరింథీయులకు 16 >

1 పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.
Про милостиню ж для сьвятих, як я розпорядив у церквах Галатийських, так і ви робіть.
2 నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.
Первого дня в тижні нехай кожен з вас у себе складає, скарбуючи, як йому ведеть ся, щоб не тоді, як прийду, складку робити.
3 నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.
Як же прийду, то которих ви ухвалите, тих пішлю з листами віднести дар ваш у Єрусалим.
4 నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
Коли ж буде достойно, щоб і мені йти, зо мною пійдуть.
5 నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను.
Прийду ж до вас, як Македонию перейду (Македонию бо проходжу).
6 అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
У вас же може загаюсь, або й зазимую, щоб ви провели мене, куди я дійду.
7 ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.
Не хочу бо вас тепер переходом бачити; маю ж надію, якийсь час пробути в вас, коли Господь дозволить.
8 కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను.
Пробуду ж у Єфесї до пятидесятницї.
9 ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
Двері бо великі й широкі відчинились мені, і багато (в мене) противників.
10 ౧౦ తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
Як же прийде Тимотей, гледїть, щоб без страху був у вас; дїло бо Господнє робить, яко ж і я.
11 ౧౧ కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
То нехай нїхто ним не гордує, а випроводіть його з упокоєм, щоб прийшов до мене; жду бо його з браттєм.
12 ౧౨ సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
Що ж до Аполоса брата, то вельми просив я його, щоб прийшов до вас з браттєм; та зовсім не було волї в него, щоб прийти тепер, прийде ж, як мати ме догідний час.
13 ౧౩ మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.
Пильнуйте, стійте в вірі, мужайтесь і утверджуйтесь.
14 ౧౪ మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
Все вам нехай в любові дїєть ся.
15 ౧౫ స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.
Благаю ж вас, браттє (ви знаєте семю Стефанову, що вона первоплід Ахайський, і що на служеннє сьвятим оддали себе),
16 ౧౬ కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
щоб і ви корились таким і кожному, хто помагає нам і працює.
17 ౧౭ స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది.
Зрадів же я приходом Стефановим і Фортунатовим і Ахаїковим; бо недостачу вашу вони сповнили.
18 ౧౮ నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
Заспокоїли бо мій дух й ваш; пізнавайте ж оце таких.
19 ౧౯ ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.
Витають вас Церкви Азийські. Витають вас у Господі много Аквила і Прискила з домашньою їх церквою.
20 ౨౦ ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
Витають вас усї брати. Витайте один одного цїлуваннєм сьвятим.
21 ౨౧ పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను.
Витаннє моєю рукою Павловою.
22 ౨౨ ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
Коли хто не любить Господа Ісуса Христа, нехай буде проклят, маран ата!
23 ౨౩ ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
Благодать Господа Ісуса Христа з вами.
24 ౨౪ క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్‌.
Любов моя з усіма вами у Христї Ісусї. Амінь.

< 1 కొరింథీయులకు 16 >