< 1 కొరింథీయులకు 12 >

1 సోదరీ సోదరులారా, ఆత్మవరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.
Про духовне ж браттє, не хочу, щоб ви не знали.
2 పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగవిగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు.
Ви знаєте, що як були ви поганами, то до ідолів безголосих воджено вас, мов ведених.
3 అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ, “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ, “యేసే ప్రభువు” అని చెప్పలేరు.
Тим кажу вам, що нїхто, Духом Божим глаголючи, не проклинає Ісуса, і нїхто не може назвати Господа Ісуса, як тільки Духом сьвятим.
4 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు.
Між даруваннями в ріжниця, Дух же той самий.
5 అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు.
І ріжниця між служеннями, а той самий Господь.
6 వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే.
І ріжниця між роботами, один же Бог, що робить усе у всіх.
7 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు.
Кожному ж дасть ся явленнє Духа на користь.
8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు,
Тому бо Духом дасть ся слово премудрости, другому слово знання тим же Духом;
9 మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు.
иншому ж віра тим же Духом; иншому ж дарування сцїлення тим же Духом;
10 ౧౦ ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు.
иншому ж робленнє чудес; иншому ж пророкуваннє; иншому розпізнаваннє духів; иншому ж усякі мови; иншому виклади мів (язиків).
11 ౧౧ ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
Все ж се дїйствує один і той же Дух, уділяючи кожному, яко ж хоче.
12 ౧౨ శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు.
Як бо тіло одно, а членів має багато, всі ж члени одного тїла, хоч багато їх, а одно тїло, так і Христос.
13 ౧౩ ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం.
Бо одним Дихом усї ми в одно тїло хрестились, чи то Жиди, чи Греки, чи невільники, чи вільні, і всі одним Духом напоєнї.
14 ౧౪ శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది.
Бо тїло не єсть один член, а многі.
15 ౧౫ పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.
Коли скаже нога: я не рука, от же я не від тїла, то хиба через се не єсть від тїла?
16 ౧౬ అలాగే చెవి ‘నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.
І коли скаже ухо: я не око, то ж я не від тїла, то хиба через те не єсть від тїла?
17 ౧౭ శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక్క చెవే అయితే వాసన ఎలా చూడాలి?
Коли б усе тїло (було) око, де ж (був би) слух? Коли б усе слух, де понюх?
18 ౧౮ అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు.
Та Бог розложив члени кожного по одному з них в тїлї, яко ж схотів.
19 ౧౯ అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది?
Коли ж би все (було) один член, то де (було б) тїло?
20 ౨౦ అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే.
Тепер же багато членів, а тїло одно.
21 ౨౧ కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు.
Не може ж око сказати руці: Не треба мені тебе; або знов голова ногам: Не треба мені вас.
22 ౨౨ అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి.
Нї, которі члени тїла здають ся слабшими, ті тим більше потрібні;
23 ౨౩ శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం.
і которі здають ся нам неповажнїшими в тїлї, тим більше чести додаємо, і менше чесні наші (члени) більшу окрасу приймають.
24 ౨౪ అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు.
Звичайним бо нашим того не треба. Та Бог зложив тїло, давши більшу честь послїднїйшому,
25 ౨౫
щоб не було розділення в тїлї, а щоб члени однаково один про одного дбали.
26 ౨౬ కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.
І коли терпить один член, терплять з ним усі члени; а коли славить ся один член, радують ся з ним усї члени.
27 ౨౭ మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.
Ви ж тїло Христове і члени від части (з особна).
28 ౨౮ దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు.
І инших поставив Бог у церкві найперш апостолів, вдруге пророків, втретє учителів, потім сили, а там даровання, сцїлення, помагання, порядкування, всякі мови.
29 ౨౯ అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు.
Хиба всї апостоли? хиба всі пророки? хиба всї учителі? хиба всї сили?
30 ౩౦ అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు.
хиба всї мають дарованнє сцїлення? хиба вони всї глаголють мовами? хиба всї викладають?
31 ౩౧ కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.
Жадайте ж дарувань луччих, і я покажу вам ще кращу дорогу.

< 1 కొరింథీయులకు 12 >