< 1 కొరింథీయులకు 11 >

1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి.
Tani Kiristoosa milatada iza kaallizayssatho inteka tana milatidi kaallite.
2 మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.
Inte taas wursi qopiza gishshine taape ekkida timirtteza lo7ethi oykida gishshi ta intena galatayss.
3 మీరు తెలుసుకోవలసింది ఏమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు.
Gido attin ta inte erana mala koyzay atumasas wursos hu7ey Kiristoosa gididayssa mala atumasay maccashas wursos hu7ekko. Qasse Xoossi Kiristoosas hu7ekko.
4 తన తల కప్పుకుని ప్రార్థన చేసే పురుషుడు తన తలను అవమానపరచినట్టే.
Be hu7e guluntidi Xoossu woossizadey woykko qaala yootizadey oonikka berka bena kawushes.
5 తన తల కప్పుకోకుండా ప్రార్థన చేసే, లేక ప్రవచించే స్త్రీ తన తల అవమానపరచినట్టే. ఎందుకంటే అది ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం.
Be hu7e goozontta woossiza maccashiya woykko tinbite qaala yootiza ay maccashika berka bena kawushaysu. Hessi iza ba hu7e bulissidadera ginakko.
6 తన తల కప్పుకోని స్త్రీ తన తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకోవడం, లేక పూర్తిగా వెంట్రుకలు తీసివేయడం ఆమెకు అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి.
Maccashi ba hu7e goozontta aggiko meydetu woykko qanxxisu. Izis ba hu7e meydetethi woykko qanxxisethi yeelachizaz gidiko goozu.
7 పురుషుడు దేవుని పోలిక, ఆయన మహిమ. కాబట్టి అతడు తన తల కప్పుకోకూడదు. స్త్రీ పురుషుని మహిమ.
Addey ba hu7e gulunttanas bessena. Atumasi Xoossa lemusone Xoossa bonchokko. Maccashi gidiko addes bonchokko.
8 అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.
Gaasoyka maccashi addefe medhetadusu attin atumas maccashafe medhetibeyna.
9 స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు.
Qasseka maccashi addes medhetadusu attin addey maccashas medhetibeyna.
10 ౧౦ కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి.
Hessa gishshi kiittanchati beyanas naagiza macashas imettida maata bessiza goose ba hu7en goozu.
11 ౧౧ అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.
Goda achchan gidiko maccashay addey bayinda, addeyka maccashay bayinda deyetena.
12 ౧౨ ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవునినుండే కలుగుతాయి.
Maccashay addefe beetidayssatho addeyka maccashafe yelettes. Gido attin nam7ayka Xoossafe bettida.
13 ౧౩ మీరే చెప్పండి. స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరైనదేనా?
Maccashi ba hu7e goozontta Xoossu woossanas bessizakone ane inte piridite.
14 ౧౪ పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా?
Atumasi ba huye adusi dichiko boriso gididayssa intena medhetetha hanotethi erisuwee?
15 ౧౫ దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇచ్చాడు కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత అని మీకు స్వతహాగా తెలుసు కదా!
Maccash gidiko ba hu7e ithike dichiko hessi izis boncho gidenee? Izis adusa hu7e ithikey imettiday izis seelokko.
16 ౧౬ ఈ విషయంలో వేరే వాదనలు చేసేవాడు, మాలో గానీ, దేవుని సంఘంలో గానీ దీనికి వ్యతిరేకంగా వేరొకఅభిప్రాయం లేదని తెలుసుకోవాలి.
Hessa gishshi oonikka hayssa ha yoozan palamistana koyko nuusu gidinkka Xoossa woossa keethas hayssafe hara wogay deena.
17 ౧౭ మీకు ఈ క్రింది ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమౌతున్నది గానీ మేలుకు కాదు.
Inte issi so shiiqetiza wode qohosu attin go7as gidontta gishshi ta hayssa azazoza intes aathizay intena galatashe gidena.
18 ౧౮ మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో తగాదాలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది.
Inte woossa keeththan shiiqiza wode inte garisan shaakotethi dizayssa ta kasista siyadis. Ta siyoyssafe baggay tumu gidanayssa ta ammanayss.
19 ౧౯ మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే.
Inte giddofe tumanchati shaaketi eretana mala hessa mala shaakoy inte giddon daanayssi dossa gidena.
20 ౨౦ మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు.
Inte issife shiiqetidi mizay Goda ka7o gidena.
21 ౨౧ ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు.
Inte shiiqetidi issay issa naagontta dishe kathi meista. Intefe issadey gafan dishin hankoyssi qass mathotes.
22 ౨౨ ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని చిన్నచూపు చూస్తూ? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను.
Histin intes uyanasine maanasoy bayee? Woyko Xoossa keeth leqqidi aykoyka bayindayta yeelachetii? Histin ta intena ay goo? Hayssa ha hanozas intena galatoo? Muleka galatike.
23 ౨౩ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు.
Ta Godape ekkidayssa intes aathadis. Hessika Goda Yesusay adhdhi imettida omaris uketh denthidine Xoossu galati bathidi “[Heyte! miite!] hayssi intes gidiza ta ashokko. Tana qopanas inte hayssa oothite” gides.
24 ౨౪ స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు.
25 ౨౫ భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు.
Hessaththoka Ka7ope guye ushsha denthidi “Hayssi ushshay ta suuthan haniza ooratha caqqoko. Hessa gishshi ushshafe inte uyiza wode hayssa tana qopana mala oothite” gides.
26 ౨౬ మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.
Heyssa ukeetha inte miza wodene hayssa ushshaka uyiza wurso wode Goday yaana gakanas inte iza hayqo yotandista.
27 ౨౭ కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు.
Hessa gishshi oonka bessontta dishin hayssa uketha miiko woykko Goda ushsha uyiko izadey Goda ashone iza suutha kawushida gishshi izi oychistana.
28 ౨౮ కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి.
Oonka hayssa ha uketha manapene ushshafe uyanape kaseti berka bena pacco.
29 ౨౯ ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని, తాగేవాడు తన మీదికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు.
Gaasoyka oonka Goda asho bees gelontta dishin miikone Goda ushsha uykko izadey berika ba bolla pirida ehees.
30 ౩౦ ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా.
Inte garisan daro asay daburidayne saketiday qasseka baggay hayqiday hessa geedonkko.
31 ౩౧ అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు.
Nu nurka nuna paccizako nu bolla piridetenakoshin.
32 ౩౨ మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.
Gido attin Goday pirdiza wode nu hanko ammanontta asara piridetontta mala izi nuna kaseti murees.
33 ౩౩ కాబట్టి నా సోదర సోదరీలారా, మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడి కోసం ఒకడు వేచి ఉండండి.
Hessa gish ta ishato inte maana shiiqiza wode issay issara naagetite.
34 ౩౪ మీరు ఇలా కలుసుకోవడం మీపై తీర్పు రావడానికి కారణం కాకుండేలా, ఆకలి వేసినవాడు తన ఇంట్లోనే భోజనం చేసి రావాలి. మీరు రాసిన మిగతా సంగతులను నేను మీ దగ్గరకి వచ్చినప్పుడు సరిచేస్తాను.
Inte shiiqiza shiiqoy pirdas gidontta mala intafe oonka gafidadey diiko kasetidi ba son mo. Hankko attidayssa hara wode inteko baada woga woththana

< 1 కొరింథీయులకు 11 >