< 1 కొరింథీయులకు 10 >
1 ౧ సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు.
Nem akarom pedig, hogy ne tudjátok, atyámfiai, hogy a mi atyáink mindnyájan a felhő alatt voltak, és mindnyájan a tengeren mentek által;
2 ౨ అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు.
És mindnyájan Mózesre keresztelkedtek meg a felhőben és a tengerben;
3 ౩ వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు.
És mindnyájan egy lelki eledelt ettek;
4 ౪ ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.
És mindnyájan egy lelki italt ittak, mert ittak a lelki kősziklából, a mely követi vala őket, e kőszikla pedig a Krisztus volt.
5 ౫ అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు.
De azoknak többségét nem kedvelé az Isten, mert elhullának a pusztában.
6 ౬ వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి.
Ezek pedig példáink lőnek, hogy mi ne kívánjunk gonosz dolgokat, a miképen azok kívántak.
7 ౭ “ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు.
Se bálványimádók ne legyetek, mint azok közül némelyek, a mint meg van írva: Leüle a nép enni és inni, és felkelének játszani.
8 ౮ వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు.
Se pedig ne paráználkodjunk mint azok közül paráználkodtak némelyek, és elestek egy napon huszonháromezeren.
9 ౯ వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు.
Se a Krisztust ne kísértsük, a mint közülök kísértették némelyek, és elveszének a kígyók miatt.
10 ౧౦ అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు.
Se pedig ne zúgolódjatok, miképen ő közülök zúgolódának némelyek, és elveszének a pusztító által.
11 ౧౧ నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి. (aiōn )
Mindezek pedig példaképen estek rajtok; megírattak pedig a mi tanulságunkra, a kikhez az időknek vége elérkezett. (aiōn )
12 ౧౨ కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.
Azért a ki azt hiszi, hogy áll, meglássa, hogy el ne essék.
13 ౧౩ ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.
Nem egyéb, hanem csak emberi kísértés esett rajtatok: de hű az Isten, a ki nem hágy titeket feljebb kísértetni, mint elszenvedhetitek; sőt a kísértéssel egyetemben a kimenekedést is megadja majd, hogy elszenvedhessétek.
14 ౧౪ కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి.
Azért szerelmeseim, kerüljétek a bálványimádást.
15 ౧౫ తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.
Mint okosokhoz szólok, ítéljétek meg ti, a mit mondok.
16 ౧౬ మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే.
A hálaadásnak pohara, a melyet megáldunk, nem a Krisztus vérével való közösségünk-é? A kenyér, a melyet megszegünk, nem a Krisztus testével való közösségünk-é?
17 ౧౭ మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.
Mert egy a kenyér, egy test vagyunk sokan; mert mindnyájan az egy kenyérből részesedünk.
18 ౧౮ ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా?
Tekintsétek meg a test szerint való Izráelt! A kik az áldozatokat eszik, avagy nincsenek-é közösségben az oltárral?
19 ౧౯ ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు.
Mit mondok tehát? Hogy a bálvány valami, vagy hogy a bálványáldozat valami?
20 ౨౦ యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు.
Sőt, hogy a mit a pogányok áldoznak, ördögöknek áldozzák és nem Istennek; nem akarom pedig, hogy ti az ördögökkel legyetek közösségben.
21 ౨౧ మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.
Nem ihatjátok az Úr poharát és az ördögök poharát; nem lehettek az Úr asztalának és az ördögök asztalának részesei.
22 ౨౨ ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?
Vagy haragra ingereljük az Urat? avagy erősebbek vagyunk-é nálánál?
23 ౨౩ అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.
Minden szabad nékem, de nem minden használ; minden szabad nékem, de nem minden épít.
24 ౨౪ ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి.
Senki ne keresse, a mi az övé, hanem kiki azt, a mi a másé.
25 ౨౫ మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.
Mindent, a mit a mészárszékben árulnak, megegyetek, semmit sem tudakozódván a lelkiismeret miatt.
26 ౨౬ ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.
Mert az Úré a föld és annak teljessége.
27 ౨౭ ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి.
Ha pedig valaki meghív titeket a hitetlenek közül és el akartok menni, mindent, a mit elétek hoznak, megegyetek, semmit sem tudakozódván a lelkiismeret miatt.
28 ౨౮ అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు.
De ha valaki ezt mondja néktek: Ez bálványáldozati hús, ne egyétek meg a miatt, a ki megjelentette, és a lelkiismeretért; mert az Úré a föld és annak teljessége.
29 ౨౯ ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి?
De nem a tulajdon lelkiismeretet értem, hanem a másikét. Mert miért kárhoztassa az én szabadságomat a más lelkiismerete?
30 ౩౦ నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?
Ha pedig én hálaadással veszek részt, miért káromoltatom azért, a miért én hálákat adok?
31 ౩౧ కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.
Azért akár esztek, akár isztok, akármit cselekesztek, mindent az Isten dicsőségére míveljetek.
32 ౩౨ యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి.
Meg ne botránkoztassátok se a zsidókat, se a görögöket, se az Isten gyülekezetét.
33 ౩౩ నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను.
Miképen én is mindenkinek mindenben kedvében járok, nem keresvén a magam hasznát, hanem a sokaságét, hogy megtartassanak.