< 1 కొరింథీయులకు 1 >
1 ౧ దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, మన సోదరుడు సొస్తెనేసు,
১যাৱন্তঃ পৱিত্ৰা লোকাঃ স্ৱেষাম্ অস্মাকঞ্চ ৱসতিস্থানেষ্ৱস্মাকং প্ৰভো ৰ্যীশোঃ খ্ৰীষ্টস্য নাম্না প্ৰাৰ্থযন্তে তৈঃ সহাহূতানাং খ্ৰীষ্টেন যীশুনা পৱিত্ৰীকৃতানাং লোকানাং য ঈশ্ৱৰীযধৰ্ম্মসমাজঃ কৰিন্থনগৰে ৱিদ্যতে
2 ౨ కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికీ, మనకూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రతి చోటా ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది.
২তং প্ৰতীশ্ৱৰস্যেচ্ছযাহূতো যীশুখ্ৰীষ্টস্য প্ৰেৰিতঃ পৌলঃ সোস্থিনিনামা ভ্ৰাতা চ পত্ৰং লিখতি|
3 ౩ మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక.
৩অস্মাকং পিত্ৰেশ্ৱৰেণ প্ৰভুনা যীশুখ্ৰীষ্টেন চ প্ৰসাদঃ শান্তিশ্চ যুষ্মভ্যং দীযতাং|
4 ౪ క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
৪ঈশ্ৱৰো যীশুখ্ৰীষ্টেন যুষ্মান্ প্ৰতি প্ৰসাদং প্ৰকাশিতৱান্, তস্মাদহং যুষ্মন্নিমিত্তং সৰ্ৱ্ৱদা মদীযেশ্ৱৰং ধন্যং ৱদামি|
5 ౫ క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది.
৫খ্ৰীষ্টসম্বন্ধীযং সাক্ষ্যং যুষ্মাকং মধ্যে যেন প্ৰকাৰেণ সপ্ৰমাণম্ অভৱৎ
6 ౬ అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు.
৬তেন যূযং খ্ৰীষ্টাৎ সৰ্ৱ্ৱৱিধৱক্তৃতাজ্ঞানাদীনি সৰ্ৱ্ৱধনানি লব্ধৱন্তঃ|
7 ౭ కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు.
৭ততোঽস্মৎপ্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্য পুনৰাগমনং প্ৰতীক্ষমাণানাং যুষ্মাকং কস্যাপি ৱৰস্যাভাৱো ন ভৱতি|
8 ౮ మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకూ ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు.
৮অপৰম্ অস্মাকং প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্য দিৱসে যূযং যন্নিৰ্দ্দোষা ভৱেত তদৰ্থং সএৱ যাৱদন্তং যুষ্মান্ সুস্থিৰান্ কৰিষ্যতি|
9 ౯ మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
৯য ঈশ্ৱৰঃ স্ৱপুত্ৰস্যাস্মৎপ্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্যাংশিনঃ কৰ্ত্তুং যুষ্মান্ আহূতৱান্ স ৱিশ্ৱসনীযঃ|
10 ౧౦ సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.
১০হে ভ্ৰাতৰঃ, অস্মাকং প্ৰভুযীশুখ্ৰীষ্টস্য নাম্না যুষ্মান্ ৱিনযেঽহং সৰ্ৱ্ৱৈ ৰ্যুষ্মাভিৰেকৰূপাণি ৱাক্যানি কথ্যন্তাং যুষ্মন্মধ্যে ভিন্নসঙ্ঘাতা ন ভৱন্তু মনোৱিচাৰযোৰৈক্যেন যুষ্মাকং সিদ্ধৎৱং ভৱতু|
11 ౧౧ సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది.
১১হে মম ভ্ৰাতৰো যুষ্মন্মধ্যে ৱিৱাদা জাতা ইতি ৱাৰ্ত্তামহং ক্লোয্যাঃ পৰিজনৈ ৰ্জ্ঞাপিতঃ|
12 ౧౨ మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.
১২মমাভিপ্ৰেতমিদং যুষ্মাকং কশ্চিৎ কশ্চিদ্ ৱদতি পৌলস্য শিষ্যোঽহম্ আপল্লোঃ শিষ্যোঽহং কৈফাঃ শিষ্যোঽহং খ্ৰীষ্টস্য শিষ্যোঽহমিতি চ|
13 ౧౩ క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా?
১৩খ্ৰীষ্টস্য কিং ৱিভেদঃ কৃতঃ? পৌলঃ কিং যুষ্মৎকৃতে ক্ৰুশে হতঃ? পৌলস্য নাম্না ৱা যূযং কিং মজ্জিতাঃ?
14 ౧౪ నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
১৪ক্ৰিষ্পগাযৌ ৱিনা যুষ্মাকং মধ্যেঽন্যঃ কোঽপি মযা ন মজ্জিত ইতি হেতোৰহম্ ঈশ্ৱৰং ধন্যং ৱদামি|
15 ౧౫ ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు.
১৫এতেন মম নাম্না মানৱা মযা মজ্জিতা ইতি ৱক্তুং কেনাপি ন শক্যতে|
16 ౧౬ స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు.
১৬অপৰং স্তিফানস্য পৰিজনা মযা মজ্জিতাস্তদন্যঃ কশ্চিদ্ যন্মযা মজ্জিতস্তদহং ন ৱেদ্মি|
17 ౧౭ క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.
১৭খ্ৰীষ্টেনাহং মজ্জনাৰ্থং ন প্ৰেৰিতঃ কিন্তু সুসংৱাদস্য প্ৰচাৰাৰ্থমেৱ; সোঽপি ৱাক্পটুতযা মযা ন প্ৰচাৰিতৱ্যঃ, যতস্তথা প্ৰচাৰিতে খ্ৰীষ্টস্য ক্ৰুশে মৃত্যুঃ ফলহীনো ভৱিষ্যতি|
18 ౧౮ సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.
১৮যতো হেতো ৰ্যে ৱিনশ্যন্তি তে তাং ক্ৰুশস্য ৱাৰ্ত্তাং প্ৰলাপমিৱ মন্যন্তে কিঞ্চ পৰিত্ৰাণং লভমানেষ্ৱস্মাসু সা ঈশ্ৱৰীযশক্তিস্ৱৰূপা|
19 ౧౯ దీని గురించే ‘జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను’ అని రాసి ఉంది.
১৯তস্মাদিত্থং লিখিতমাস্তে, জ্ঞানৱতান্তু যৎ জ্ঞানং তন্মযা নাশযিষ্যতে| ৱিলোপযিষ্যতে তদ্ৱদ্ বুদ্ধি ৰ্বদ্ধিমতাং মযা||
20 ౨౦ జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? (aiōn )
২০জ্ঞানী কুত্ৰ? শাস্ত্ৰী ৱা কুত্ৰ? ইহলোকস্য ৱিচাৰতৎপৰো ৱা কুত্ৰ? ইহলোকস্য জ্ঞানং কিমীশ্ৱৰেণ মোহীকৃতং নহি? (aiōn )
21 ౨౧ లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.
২১ঈশ্ৱৰস্য জ্ঞানাদ্ ইহলোকস্য মানৱাঃ স্ৱজ্ঞানেনেশ্ৱৰস্য তত্ত্ৱবোধং ন প্ৰাপ্তৱন্তস্তস্মাদ্ ঈশ্ৱৰঃ প্ৰচাৰৰূপিণা প্ৰলাপেন ৱিশ্ৱাসিনঃ পৰিত্ৰাতুং ৰোচিতৱান্|
22 ౨౨ యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు.
২২যিহূদীযলোকা লক্ষণানি দিদৃক্ষন্তি ভিন্নদেশীযলোকাস্তু ৱিদ্যাং মৃগযন্তে,
23 ౨౩ అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు.
২৩ৱযঞ্চ ক্ৰুশে হতং খ্ৰীষ্টং প্ৰচাৰযামঃ| তস্য প্ৰচাৰো যিহূদীযৈ ৰ্ৱিঘ্ন ইৱ ভিন্নদেশীযৈশ্চ প্ৰলাপ ইৱ মন্যতে,
24 ౨౪ అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు.
২৪কিন্তু যিহূদীযানাং ভিন্নদেশীযানাঞ্চ মধ্যে যে আহূতাস্তেষু স খ্ৰীষ্ট ঈশ্ৱৰীযশক্তিৰিৱেশ্ৱৰীযজ্ঞানমিৱ চ প্ৰকাশতে|
25 ౨౫ ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.
২৫যত ঈশ্ৱৰে যঃ প্ৰলাপ আৰোপ্যতে স মানৱাতিৰিক্তং জ্ঞানমেৱ যচ্চ দৌৰ্ব্বল্যম্ ঈশ্ৱৰ আৰোপ্যতে তৎ মানৱাতিৰিক্তং বলমেৱ|
26 ౨౬ సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా.
২৬হে ভ্ৰাতৰঃ, আহূতযুষ্মদ্গণো যষ্মাভিৰালোক্যতাং তন্মধ্যে সাংসাৰিকজ্ঞানেন জ্ঞানৱন্তঃ পৰাক্ৰমিণো ৱা কুলীনা ৱা বহৱো ন ৱিদ্যন্তে|
27 ౨౭ దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు.
২৭যত ঈশ্ৱৰো জ্ঞানৱতস্ত্ৰপযিতুং মূৰ্খলোকান্ ৰোচিতৱান্ বলানি চ ত্ৰপযিতুম্ ঈশ্ৱৰো দুৰ্ব্বলান্ ৰোচিতৱান্|
28 ౨౮ గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు.
২৮তথা ৱৰ্ত্তমানলোকান্ সংস্থিতিভ্ৰষ্টান্ কৰ্ত্তুম্ ঈশ্ৱৰো জগতোঽপকৃষ্টান্ হেযান্ অৱৰ্ত্তমানাংশ্চাভিৰোচিতৱান্|
29 ౨౯ ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.
২৯তত ঈশ্ৱৰস্য সাক্ষাৎ কেনাপ্যাত্মশ্লাঘা ন কৰ্ত্তৱ্যা|
30 ౩౦ అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు.
৩০যূযঞ্চ তস্মাৎ খ্ৰীষ্টে যীশৌ সংস্থিতিং প্ৰাপ্তৱন্তঃ স ঈশ্ৱৰাদ্ যুষ্মাকং জ্ঞানং পুণ্যং পৱিত্ৰৎৱং মুক্তিশ্চ জাতা|
31 ౩౧ “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.
৩১অতএৱ যদ্ৱদ্ লিখিতমাস্তে তদ্ৱৎ, যঃ কশ্চিৎ শ্লাঘমানঃ স্যাৎ শ্লাঘতাং প্ৰভুনা স হি|