< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 1 >

1 ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
Adam, Seth, Enos,
2 ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
and Cainan, Maleleel, Jared,
3 యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
Enoch, Mathusala, Lamech,
4 లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
Noe: the sons of Noe, Sem, Cham, Japheth.
5 యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
The sons of Japheth, Gamer, Magog, Madaim, Jovan, Helisa, Thobel, Mosoch, and Thiras.
6 గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
And the sons of Gamer, Aschanaz, and Riphath, and Thorgama.
7 యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
And the sons of Jovan, Helisa, and Tharsis, the Citians, and Rhodians.
8 హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.
And the sons of Cham, Chus, and Mesraim, Phud and Chanaan.
9 కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.
And the sons of Chus, Saba, and Evila, and Sabatha, and Regma, and Sebethaca: and the sons of Regma, Saba, and Dadan.
10 ౧౦ కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
And Chus begot Nebrod: he began to be a mighty hunter on the earth.
11 ౧౧ ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,
12 ౧౨ పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
13 ౧౩ కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.
14 ౧౪ ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
15 ౧౫ హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు
16 ౧౬ అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
17 ౧౭ షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.
The sons of Sem, Aelam, and Assur,
18 ౧౮ అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
and Arphaxad, Sala,
19 ౧౯ ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
20 ౨౦ యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21 ౨౧ హదోరము, ఊజాలు, దిక్లాను,
22 ౨౨ ఏబాలు, అబీమాయేలు, షేబా,
23 ౨౩ ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
24 ౨౪ షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,
25 ౨౫ ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,
Eber, Pheleg, Ragan,
26 ౨౬ రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
Seruch, Nachor, Tharrha,
27 ౨౭ తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
Abraam.
28 ౨౮ అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
And the sons of Abraam, Isaac, and Ismael.
29 ౨౯ వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,
And these [are] their generations: the first-born of Ismael, Nabaeoth, and Kedar, Nabdeel, Massam,
30 ౩౦ మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
Masma, Iduma, Masse, Chondan, Thaeman,
31 ౩౧ యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
Jettur, Naphes, Kedma: these [are] the sons of Ismael.
32 ౩౨ అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
And the sons of Chettura Abraam's concubine: —and she bore him Zembram, Jexan, Madiam, Madam, Sobac, Soe: and the sons of Jexan; Daedan, and Sabai;
33 ౩౩ మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
and the sons of Madiam; Gephar, and Opher, and Enoch, and Abida, and Eldada; all these [were] the sons of Chettura.
34 ౩౪ అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.
And Abraam begot Isaac: and the sons of Isaac [were] Jacob, and Esau.
35 ౩౫ ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.
The sons of Esau, Eliphaz, and Raguel, and Jeul, and Jeglom, and Core.
36 ౩౬ వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.
The sons of Eliphaz: Thaeman, and Omar, Sophar, and Gootham, and Kenez, and Thamna, and Amalec.
37 ౩౭ రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
And the sons of Raguel, Naches, Zare, Some, and Moze.
38 ౩౮ శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
The sons of Seir, Lotan, Sobal, Sebegon, Ana, Deson, Osar, and Disan.
39 ౩౯ లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
And the sons of Lotan, Chorri, and Aeman; and the sister of Lotan [was] Thamna.
40 ౪౦ శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
The sons of Sobal; Alon, Machanath, Taebel, Sophi, and Onan: and the sons of Sebegon; Aeth, and Sonan.
41 ౪౧ అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
The sons of Sonan, Daeson: and the sons of Daeson; Emeron, and Asebon, and Jethram, and Charran.
42 ౪౨ ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
And the sons of Hosar, Balaam, and Zucam, and Acan: the sons of Disan, Os, and Aran.
43 ౪౩ ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
And these [are] their kings, Balac the son of Beor; and the name of his city [was] Dennaba.
44 ౪౪ బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
And Balac died, and Jobab the son of Zara of Bosorrha reigned in his stead.
45 ౪౫ యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
And Jobab died, and Asom of the land of the Thaemanites reigned in his stead.
46 ౪౬ హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.
And Asom died, and Adad the son of Barad reigned in his stead, who smote Madiam in the plain of Moab: and the name of his city [was] Gethaim.
47 ౪౭ హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.
And Adad died, and Sebla of Masecca reigned in his stead.
48 ౪౮ శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
And Sebla died, and Saul of Rhoboth by the river reigned in his stead.
49 ౪౯ షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.
And Saul died, and Balaennor son of Achobor reigned in his stead.
50 ౫౦ బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
And Balaennor died, and Adad son of Barad reigned in his stead; and the name of his city [was] Phogor.
51 ౫౧ హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,
The princes of Edom: prince Thamna, prince Golada, prince Jether,
52 ౫౨ అహలీబామా, ఏలా, పీనోను,
prince Elibamas, prince Elas, prince Phinon,
53 ౫౩ కనజు, తేమాను, మిబ్సారు,
prince Kenez, prince Thaeman, prince Babsar, prince Magediel,
54 ౫౪ మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.
prince Zaphoin. These [are] the princes of Edom.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 1 >