< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 8 >

1 బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
E Benjamin gerou a Bela, seu primogenito, a Asbel o segundo, e a Ahrah o terceiro,
2 మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
A Noha o quarto, e a Rapha o quinto.
3 వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
E Bela teve estes filhos: Addar, e Gera, e Abihud,
4 అబీషూవ, నయమాను, అహోయహు,
E Abisua, e Naaman, e Ahoah,
5 గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
E Gera, e Sephuphan, e Huram.
6 ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
E estes foram os filhos de Ehud: estes foram chefes dos paes dos moradores de Geba; e os transportaram a Manahath,
7 ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
E a Naaman, e Ahias, e Gera; a estes transportou; e gerou a Uzza e a Ahihud.
8 షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
E Saharaim (depois de os enviar), na terra de Moab, gerou filhos d'Husim e Baara, suas mulheres.
9 అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
E de Hodes, sua mulher, gerou a Jobab, e a Zibia, e a Mesa, e a Malcam,
10 ౧౦ యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
E a Jeus, e a Sachias, e a Mirma: estes foram seus filhos, chefes dos paes.
11 ౧౧ హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
E de Husim gerou a Abitud e a Elpaal.
12 ౧౨ ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
E foram os filhor d'Elpaal: Eber, e Misam, e Semer: este edificou a Ono e a Lod e os logares da sua jurisdicção.
13 ౧౩ ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
E Beria e Sema foram cabeças dos paes dos moradores de Aijalon; estes afugentaram os moradores de Gath.
14 ౧౪ బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
E Ahio, e Sasak, e Jeremoth,
15 ౧౫ జెబద్యా, అరాదు, ఏదెరు,
E Zebadias, e Arad, e Eder,
16 ౧౬ మిఖాయేలు, ఇష్పా, యోహా.
E Michael, e Ispa, e Joha, foram filhos de Beria:
17 ౧౭ ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
E Zebadias, e Mesullam, e Hizki, e Heber,
18 ౧౮ ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
E Ismerai, e Izlias, e Jobab, filhos de Elpaal:
19 ౧౯ షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
E Jakim, e Zichri, e Zabdi,
20 ౨౦ ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
E Elienai, e Zillethai, e Eliel,
21 ౨౧ అదాయా, బెరాయా, షిమ్రాతు.
E Adaias, e Beraias, e Simrath, filhos de Simei:
22 ౨౨ షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
E Ispan, e Eber, e Eliel,
23 ౨౩ అబ్దోను, జిఖ్రీ, హానాను,
E Abdon, e Zichri, e Hanan,
24 ౨౪ హనన్యా, ఏలాము, అంతోతీయా,
E Hananias, e Elam, e Anthothija,
25 ౨౫ ఇపెదయా, పెనూయేలు.
E Iphdias, e Penuel, filhos de Sasak:
26 ౨౬ ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
E Samserai, e Seharias, e Athalias,
27 ౨౭ యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
E Jaaresias, e Elias, e Zichri, filhos de Jeroham.
28 ౨౮ వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.
Estes foram chefes dos paes, segundo as suas gerações, e estes habitaram em Jerusalem.
29 ౨౯ గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
E em Gibeon habitou o pae de Gibeon: e era o nome de sua mulher Maaka;
30 ౩౦ ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
E seu filho primogenito Abdon; depois Zur, e Kis, e Baal, e Nadab,
31 ౩౧ గెదోరు, అహ్యో, జెకెరు.
E Gedor, e Ahio, e Zecher.
32 ౩౨ మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
E Mikloth gerou a Simea: e tambem estes, defronte de seus irmãos, habitaram em Jerusalem com seus irmãos.
33 ౩౩ నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
E Ner gerou a Kis, e Kis gerou a Saul; e Saul gerou a Jonathan, e a Malchi-sua, e a Abinadab, e a Es-baal.
34 ౩౪ యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
E filho de Jonathan foi Merib-baal: e Merib-baal gerou a Micha.
35 ౩౫ మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
E os filhos de Micha foram: Pithon, e Melech, e Tarea, e Achaz.
36 ౩౬ ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.
E Achaz gerou a Joadda, e Joadda gerou a Alemeth, e a Azmaveth, e a Zimri; e Zimri gerou a Mosa,
37 ౩౭ మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
E Mosa gerou a Bina, cujo filho foi Rapha, cujo filho foi Elasa, cujo filho foi Asel.
38 ౩౮ ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
E teve Asel seis filhos, e estes foram os seus nomes: Azrikam, e Boceru, e Ishmael, e Searias, e Obadias, e Hanan: todos estes foram filhos de Asel.
39 ౩౯ ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.
E os filhos de Esek, seu irmão: Ulam, seu primogenito, Jeus o segundo, e Eliphelet o terceiro.
40 ౪౦ ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.
E foram os filhos de Ulam varões heroes, valentes, e frecheiros destros; e tiveram muitos filhos, e filhos de filhos, cento e cincoenta: todos estes foram dos filhos de Benjamin.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 8 >