< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 7 >
1 ౧ ఇశ్శాఖారుకి నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు, తోలా, పువ్వా, యాషూబూ, షిమ్రోనూ అనేవాళ్ళు.
Y-sa-ca có bốn người con là Thô-la, Phu-va, Gia-súp, và Sim-rôn.
2 ౨ తోలాకి ఉజ్జీ, రెఫాయా, యెరీయేలూ, యహ్మయీ, యిబ్శామూ, షెమూయేలూ పుట్టారు. తోలా కొడుకులైన వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. వీళ్ళు బలిష్టులు. ధైర్యవంతులు. దావీదు పరిపాలించిన కాలంలో వీళ్ళ సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు.
Các con Thô-la là U-xi, Rê-pha-gia, Giê-ri-ên, Giác-mai, Díp-sam, và Sa-mu-ên. Thế hệ này gồm những tay anh dũng, và đều trở thành trưởng họ của dòng tộc. Dưới thời Vua Đa-vít, tổng số chiến sĩ thuộc dòng này lên đến 22.600.
3 ౩ ఉజ్జీ కొడుకుల్లో ఒకడి పేరు ఇజ్రహయా. ఇజ్రహయా కొడుకుల పేర్లు, మిఖాయేలు ఓబద్యా, యోవేలూ, ఇష్షీయా అనేవాళ్ళు. వీళ్ళు ఐదు గురూ తమ తెగల నాయకులు.
Con U-xi là Dích-ra-hia. Các con Dích-ra-hia là Mi-ca-ên, Ô-ba-đia, Giô-ên, và Di-si-gia. Cả năm người đều trở thành trưởng họ.
4 ౪ వాళ్ళకి అనేకమంది భార్యలూ, పిల్లలూ ఉన్నారు. అందుచేత వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వాళ్ళ వంశాల నుండి సైన్యంలో ముప్ఫై ఆరు వేల మంది ఉన్నారు.
Các gia đình này có nhiều vợ, đông con, nên số con cháu họ gia nhập binh ngũ lên tới 36.000 người.
5 ౫ ఇశ్శాఖారు వంశాల్లో వాళ్ళ బంధువుల నుండి తమ వంశావళి లెక్కల ప్రకారం యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎనభై ఏడువేలమంది ఉన్నారు.
Tổng số chiến sĩ trong tất cả dòng họ của đại tộc Y-sa-ca, là 87.000. Tất cả người này đều được ghi vào sách gia phả của họ.
6 ౬ బెన్యామీనుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, యెదీయవేలూ అనేవాళ్ళు.
Bên-gia-min có ba người con là Bê-la, Bê-ka, và Giê-đi-a-ên.
7 ౭ బెలకు ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు, ఎస్బోనూ, ఉజ్జీ, ఉజ్జీయేలూ, యెరీమోతూ, ఈరీ అనేవాళ్ళు. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై రెండు వేల ముప్ఫై నల్గురు యుద్ధం చేసే వాళ్ళున్నారు.
Các con Bê-la là Ét-bôn, U-xi, U-xi-ên, Giê-ri-mốt, và Y-ri. Cả năm người này đều là trưởng họ. Tất cả chiến sĩ trong các họ này là 22.034 người, tính theo gia phả của họ.
8 ౮ బేకరు కొడుకులు జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవాళ్ళు. వీళ్ళంతా బేకరు కొడుకులు.
Các con Bê-ka là Xê-mi-ra, Giô-ách, Ê-li-ê-se, Ê-li-ô-ê-nai, Ôm-ri, Giê-rê-mốt, A-bi-gia, A-na-tốt, và A-lê-mết.
9 ౯ తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు. వీళ్ళంతా శూరులు.
Họ đều là trưởng họ, số con cháu họ làm chiến sĩ lên đến 20.200 người theo gia phả.
10 ౧౦ యెదీయవేలు కొడుకుల్లో ఒకడు బిల్హాను. బిల్హాను కొడుకులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
Con Giê-đi-a-ên là Binh-han. Các con Binh-han là Giê-úc, Bên-gia-min, Ê-hút, Kê-na-na, Xê-than, Ta-rê-si, và A-hi-sa-ha.
11 ౧౧ యెదీయవేలు కొడుకులైన వీళ్ళంతా తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వీళ్ళలో యుద్ధానికి వెళ్ళగలిగిన శూరులు పదిహేను వేల రెండు వందలమంది ఉన్నారు.
Họ đều là trưởng họ. Số con cháu họ làm chiến sĩ lên tới 17.200 người.
12 ౧౨ ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు.
Các con Y-rơ là Súp-bim và Hốp-bim. Hu-sim là con A-he.
13 ౧౩ బిల్హా కొడుకు నఫ్తాలీ. నఫ్తాలీ కొడుకులు యహజియేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవాళ్ళు.
Nép-ta-li có bốn con là Gia-si-ên, Gu-ni, Giê-xe, và Sa-lum. Họ là cháu nội của bà Bi-la, vợ lẽ của Gia-cốp.
14 ౧౪ మనష్షే కొడుకుల్లో అశ్రీయేలు అనే వాడున్నాడు. వాడు అతని ఉంపుడుగత్తె వల్ల పుట్టాడు. ఈ ఉంపుడుగత్తె ఒక అరామీయురాలు. ఈమే గిలాదుకి నాయకుడైన మాకీరుకి కూడా జన్మనిచ్చింది.
Ma-na-se có với bà vợ lẽ người A-ram hai con: Ách-ri-ên và Ma-ki. Ma-ki là cha Ga-la-át.
15 ౧౫ మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సోదరి పేరు మయకా. మనష్షే రెండో కొడుకు పేరు సెలోపెహాదు. ఈ సెలోపెహాదుకి కూతుళ్ళు మాత్రమే పుట్టారు.
Ma-ki cưới vợ là Ma-a-ca, em gái của Hốp-bim và Súp-bim. Vợ thứ của ông là Xê-lô-phát chỉ sinh được con gái.
16 ౧౬ మాకీరు భార్య మయకాకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు పెరెషు. ఇతని సోదరుడి పేరు షెరెషు. షెరెషు కొడుకులు ఊలాము, రాకెము.
Ma-a-ca, vợ Ma-ki sinh được một người con, đặt tên là Phê-rết. Em Phê-rết là Sê-rết. Con Phê-rết là U-lam và Rê-kim.
17 ౧౭ ఊలాము కొడుకు బెదాను. వీరంతా మనష్షే కొడుకు మాకీరుకి పుట్టిన గిలాదు సంతానం.
Con U-lam là Bê-đan. Đó là con cháu Ga-la-át, con Ma-ki, cháu Ma-na-se.
18 ౧౮ మాకీరు సోదరి అయిన హమ్మోలెకెతు. ఈ మెకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.
Ha-mô-lê-kết, em gái Ga-la-át sinh Y-sốt, A-bi-ê-xe, và Mách-la.
19 ౧౯ షెమీదా కొడుకులు అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
Các con Sê-mi-đa là A-hi-an, Si-chem, Li-khi, và A-ni-am.
20 ౨౦ ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. ఎఫ్రాయిము కొడుకు షూతలహు. షూతలహు కొడుకు బెరెదు. బెరెదు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఎలాదా. ఎలాదా కొడుకు తాహతు.
Con trai Ép-ra-im là Su-tê-la, Bê-re, Ta-hát, Ê-lê-a-đa, Ta-hát,
21 ౨౧ తాహతు కొడుకు జాబాదు. ఇతనికి షూతలహూ, ఏజెరూ, ఎల్యాదూ అనేవాళ్ళు పుట్టారు. వాళ్ళు అక్కడ స్థానికులైన గాతు ప్రజల పశువులను దొంగతనం చేయడానికి వెళ్ళారు. దాంతో గాతు ప్రజలు వాళ్ళను పట్టుకుని చంపివేశారు.
Xa-bát, Su-tê-la, Ê-xe, và Ê-lê-át. Hai người trong số này bị người địa phương đánh chết khi xuống đất Gát cướp súc vật.
22 ౨౨ వాళ్ళ తండ్రియైన ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అప్పుడు అతని సోదరులు వచ్చి అతణ్ణి పరామర్శించారు.
Cha của họ, Ép-ra-im thương khóc con nhiều ngày, cho đến khi các anh em ông đến an ủi, ông mới nguôi.
23 ౨౩ తరువాత అతడు తన భార్యను కూడగా ఆమె గర్భం ధరించి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. తన ఇంట్లో కలిగిన విషాదాన్నిబట్టి ఎఫ్రాయిము తన కొడుక్కి బెరీయా అనే పేరు పెట్టాడు.
Sau đó, vợ Ép-ra-im thụ thai, sinh một trai. Ép-ra-im đặt tên là Bê-ri-a, để đánh dấu gia biến vừa xảy ra.
24 ౨౪ అతని కుమార్తె పేరు షెయెరా. ఈమె ఉత్తర బేత్ హోరోను, దక్షిణ బేత్ హోరోను, ఉజ్జెన్ షెయెరా పట్టణాలను నిర్మించింది.
Ép-ra-im có một con gái tên Sê-ê-ra, là người xây Bết-hô-rôn Thượng, Bết Hô-rôn Hạ, và U-xên Sê-ê-ra.
25 ౨౫ వాని కొడుకులు రెపహూ, రెషెపులు. రెపహు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను,
Con cháu của Ép-ra-im còn có Rê-pha, Rê-sép, Tê-la, Tha-han,
26 ౨౬ తహను కొడుకు లద్దాను, లద్దాను కొడుకు అమీహూదు, అమీహూదు కొడుకు ఎలీషామా,
La-ê-đan, A-mi-hút, Ê-li-sa-ma,
27 ౨౭ ఎలీషామా కొడుకు నూను, నూను కొడుకు యెహోషువ.
Nun, và Giô-suê.
28 ౨౮ వాళ్ళు స్వాస్థ్యంగా పొందిన వారి నివాస స్థలాలు ఏవంటే, బేతేలూ దాని చుట్టూ ఉన్న గ్రామాలు. ఇంకా తూర్పువైపు ఉన్న నహరానూ, పడమటి వైపు ఉన్న గెజెరు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, షెకెము, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, గాజా, దాని చుట్టూ ఉన్న గ్రామాల వరకూ వారి నివాస స్థలాలు వ్యాపించాయి.
Vùng đất con cháu Ép-ra-im chiếm cứ để sinh sống được giới hạn một mặt bởi Bê-tên và các thôn ấp phụ cận, Na-a-ran ở phía đông, Ghê-xe và các thôn ấp phụ cận ở phía tây, mặt khác bởi Si-chem và các thôn ấp phụ cận, chạy dài cho đến A-đa và các thôn ấp phụ cận.
29 ౨౯ అలాగే మనష్షీయుల సరిహద్దు ప్రాంతాల్లోని బేత్షెయాను, దాని గ్రామాలు, తానాకు, దాని గ్రామాలు, మెగిద్దో, దాని గ్రామాలు, దోరు, దాని గ్రామాలు వాళ్ళకున్నాయి. ఇశ్రాయేలు కొడుకైన యోసేపు వారసులు ఈ ఊళ్ళలోనే నివాసమున్నారు.
Con cháu Ma-na-se ở trong các thành Bết-sê-an, Tha-a-nác, Mê-ghi-đô, và Đô-rơ, kể cả các thôn ấp phụ cận các thành ấy. Đó là nơi con cháu Giô-sép, con của Ít-ra-ên, sống.
30 ౩౦ ఆషేరు కొడుకులు ఎవరంటే ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు శెరహు.
Các con A-se là: Im-na, Dích-va, Ích-vi, và Bê-ri-a. Em gái của họ là Sê-ra.
31 ౩౧ బెరీయా కొడుకులు హెబెరూ, మల్కీయేలూ. మల్కీయేలు కొడుకు బిర్జాయీతు.
Các con Bê-ri-a là: Hê-be và Manh-ki-ên (tổ phụ của Biếc-xa-vít).
32 ౩౨ హెబెరు కొడుకులు యప్లేటు, షోమేరూ, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా.
Con Hê-be gồm có Giáp-phơ-lết, Sô-me, và Hô-tham. Họ có em gái tên Su-a.
33 ౩౩ యప్లేటు కొడుకులు ఎవరంటే పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్ళు యప్లేటు కొడుకులు.
Con Giáp-phơ-lết gồm có Pha-sác, Binh-hanh, và A-vát.
34 ౩౪ అతని సోదరుడైన షోమేరుకు అహీ, రోగా, యెహుబ్బా, అరాము అనే కొడుకులున్నారు.
Con Sô-me gồm có A-hi, Rô-hê-ga, Hu-ba, và A-ram.
35 ౩౫ అతని సోదరుడైన హేలెముకు జోపహు, ఇమ్నా, షెలెశు, ఆమాలు అనే కొడుకులున్నారు.
Con Hê-lem gồm có Xô-pha, Dim-na, Sê-lết, và A-manh.
36 ౩౬ జోపహు కొడుకులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
Con Xô-pha gồm có Su-a, Hạt-nê-phe, Su-anh, Bê-ri, Dim-ra,
37 ౩౭ బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరు అనేవాళ్ళు.
Ba-san, Hốt, Sa-ma, Sinh-sa, Dít-ran, và Bê-ê-ra.
38 ౩౮ ఎతెరు కొడుకులు యెఫున్నె, పిస్పా, అరా.
Con Giê-the gồm có Giê-phu-nê, Phít-ba, và A-ra.
39 ౩౯ ఉల్లా కొడుకులు ఆరహు, హన్నియేలు, రిజెయాలు.
Con U-la gồm có A-ra, Ha-ni-ên, và Ri-xi-a.
40 ౪౦ వీళ్ళంతా ఆషేరు సంతానం. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన శూరులుగానూ, నాయకుల్లో ప్రముఖులుగానూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన వాళ్ళలో ఇరవై ఆరు వేలమంది యుద్ధానికి వెళ్లదగిన వాళ్ళున్నారు.
Các con cháu A-se đều làm trưởng họ. Họ là những chiến sĩ anh dũng, lãnh đạo các quan tướng. Theo gia phả của họ, con cháu A-se có đến 26.000 người phục vụ trong quân đội.