< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 6 >

1 లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.
レビの子らはゲルション、コハテ、メラリ。
2 కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనే వాళ్ళు.
コハテの子らはアムラム、イヅハル、ヘブロン、ウジエル。
3 అమ్రాము కొడుకులు అహరోను, మోషే. కూతురు పేరు మిర్యాము. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
アムラムの子らはアロン、モーセ、ミリアム。アロンの子らはナダブ、アビウ、エレアザル、イタマル。
4 ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.
エレアザルはピネハスを生み、ピネハスはアビシュアを生み、
5 అబీషూవకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు.
アビシュアはブッキを生み、ブッキはウジを生み、
6 ఉజ్జీకి జెరహ్యా పుట్టాడు. జెరహ్యాకి మెరాయోతు పుట్టాడు.
ウジはゼラヒヤを生み、ゼラヒヤはメラヨテを生み、
7 మెరాయోతుకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
メラヨテはアマリヤを生み、アマリヤはアヒトブを生み、
8 అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి అహిమయస్సు పుట్టాడు.
アヒトブはザドクを生み、ザドクはアヒマアズを生み、
9 అహిమయస్సుకి అజర్యా పుట్టాడు. అజర్యాకి యోహానాను పుట్టాడు.
アヒマアズはアザリヤを生み、アザリヤはヨナハンを生み、
10 ౧౦ యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.
ヨナハンはアザリヤを生んだ。このアザリヤはソロモンがエルサレムに建てた宮で祭司の務をした者である。
11 ౧౧ అజర్యాకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
アザリヤはアマリヤを生み、アマリヤはアヒトブを生み、
12 ౧౨ అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి షల్లూము పుట్టాడు.
アヒトブはザトクを生み、ザトクはシャルムを生み、
13 ౧౩ షల్లూముకి హిల్కీయా పుట్టాడు. హిల్కీయాకి అజర్యా పుట్టాడు.
シャルムはヒルキヤを生み、ヒルキヤはアザリヤを生み、
14 ౧౪ అజర్యాకి శెరాయా పుట్టాడు. శెరాయాకి యెహోజాదాకు పుట్టాడు.
アザリヤはセラヤを生み、セラヤはヨザダクを生んだ。
15 ౧౫ యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్ళనూ యెరూషలేము వాళ్ళనూ చెరలోకి బందీలుగా తీసుకు వెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు కూడా చెరలోకి వెళ్ళాడు.
ヨザダクは主がネブカデネザルの手によってユダとエルサレムの人を捕え移された時に捕えられて行った。
16 ౧౬ లేవి కుమారులు గెర్షోను, కహాతూ, మెరారీలు.
レビの子らはゲルション、コハテおよびメラリ。
17 ౧౭ గెర్షోను కొడుకులు లిబ్నీ, షిమీలు.
ゲルションの子らの名はリブニとシメイ。
18 ౧౮ కహాతు కొడుకులు అమ్రామూ, ఇస్హారూ, హెబ్రోనూ, ఉజ్జీయేలూ అనేవాళ్ళు.
コハテの子らはアムラム、イヅハル、ヘブロン、ウジエルである。
19 ౧౯ మెరారి కొడుకులు మహలీ, మూషి. పూర్వీకుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఏవంటే,
メラリの子らはマヘリとムシ。これらはレビびとのその家筋による氏族である。
20 ౨౦ గెర్షోను కొడుకు లిబ్నీ, లిబ్నీ కొడుకు యహతు, యహతు కొడుకు జిమ్మా.
ゲルションの子はリブニ、その子はヤハテ、その子はジンマ、
21 ౨౧ జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఇద్దో, ఇద్దో కొడుకు జెరహు, జెరహు కొడుకు యెయతిరయి.
その子はヨア、その子はイド、その子はゼラ、その子はヤテライ。
22 ౨౨ కహాతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు. ఇతని కొడుకు కోరహు, కోరహు కొడుకు అస్సీరు,
コハテの子はアミナダブ、その子はコラ、その子はアシル、
23 ౨౩ అస్సీరు కొడుకు ఎల్కానా, ఎల్కానా కొడుకు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కొడుకు అస్సీరు,
その子はエルカナ、その子はエビアサフ、その子はアシル、
24 ౨౪ అస్సీరు కొడుకు తాహెతు, తాహెతు కొడుకు ఊరియేలు, ఊరియేలు కొడుకు ఉజ్జియా, ఉజ్జియా కొడుకు షావూలు.
その子はタハテ、その子はウリエル、その子はウジヤ、その子はシャウル。
25 ౨౫ ఎల్కానా కొడుకులు అమాశై, అహీమోతు.
エルカナの子らはアマサイとアヒモテ、
26 ౨౬ ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై. జోపై కొడుకు నహతు,
その子はエルカナ、その子はゾパイ、その子はナハテ、
27 ౨౭ నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.
その子はエリアブ、その子はエロハム、その子はエルカナ。
28 ౨౮ సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు, మరొకడు అబీయాయు.
サムエルの子らは、長子はヨエル、次はアビヤ。
29 ౨౯ మెరారి కొడుకుల్లో ఒకడు మహలి. మహలి కొడుకు లిబ్నీ. లిబ్నీ కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా.
メラリの子はマヘリ、その子はリブニ、その子はシメイ、その子はウザ、
30 ౩౦ ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గీయా. హగ్గీయా కొడుకు అశాయా.
その子はシメア、その子はハギヤ、その子はアサヤである。
31 ౩౧ నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే.
契約の箱を安置したのち、ダビデが主の宮で歌をうたう事をつかさどらせた人々は次のとおりである。
32 ౩౨ సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించే సమయంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఆవరణలో సంగీత సేవ చేస్తూ ఉన్నారు.
彼らは会見の幕屋の前で歌をもって仕えたが、ソロモンがエルサレムに主の宮を建ててからは、一定の秩序に従って務を行った。
33 ౩౩ ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు. కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.
その務をしたもの、およびその子らは次のとおりである。コハテびとの子らのうちヘマンは歌をうたう者、ヘマンはヨエルの子、ヨエルはサムエルの子、
34 ౩౪ సమూయేలు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యెరోహాముకి పుట్టాడు. యెరోహాము ఎలీయేలుకి పుట్టాడు. ఎలీయేలు తోయహుకి పుట్టాడు.
サムエルはエルカナの子、エルカナはエロハムの子、エロハムはエリエルの子、エリエルはトアの子、
35 ౩౫ తోయహు సూపుకి పుట్టాడు. సూపు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా మహతుకి పుట్టాడు. మహతు అమాశైకి పుట్టాడు.
トアはヅフの子、ヅフはエルカナの子、エルカナはマハテの子、マハテはアマサイの子、
36 ౩౬ అమాశై ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యోవేలుకి పుట్టాడు. యోవేలు అజర్యాకి పుట్టాడు. అజర్యా జెఫన్యాకి పుట్టాడు.
アマサイはエルカナの子、エルカナはヨエルの子、ヨエルはアザリヤの子、アザリヤはゼパニヤの子、
37 ౩౭ జెఫన్యా తాహతుకి పుట్టాడు. తాహతు అస్సీరుకి పుట్టాడు. అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు. ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు.
ゼパニヤはタハテの子、タハテはアシルの子、アシルはエビアサフの子、エビアサフはコラの子、
38 ౩౮ కోరహు ఇస్హారుకి పుట్టాడు. ఇస్హారు కహాతుకి పుట్టాడు. కహాతు లేవికి పుట్టాడు. లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు.
コラはイヅハルの子、イヅハルはコハテの子、コハテはレビの子、レビはイスラエルの子である。
39 ౩౯ హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు. బెరక్యా షిమ్యా కొడుకు.
ヘマンの兄弟アサフはヘマンの右に立った。アサフはベレキヤの子、ベレキヤはシメアの子、
40 ౪౦ షిమ్యా మిఖాయేలు కొడుకు. మిఖాయేలు బయశేయా కొడుకు. బయశేయా మల్కీయా కొడుకు.
シメアはミカエルの子、ミカエルはバアセヤの子、バアセヤはマルキヤの子、
41 ౪౧ మల్కీయా యెత్నీ కొడుకు. యెత్నీ జెరహు కొడుకు. జెరహు అదాయా కొడుకు.
マルキヤはエテニの子、エテニはゼラの子、ゼラはアダヤの子、
42 ౪౨ అదాయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు.
アダヤはエタンの子、エタンはジンマの子、ジンマはシメイの子、
43 ౪౩ షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవి కొడుకు.
シメイはヤハテの子、ヤハテはゲルションの子、ゲルションはレビの子である。
44 ౪౪ హేమానుకి ఎడమవైపున మెరారీయులు నిలుచుని ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏతాను కీషీ కొడుకు. కీషీ అబ్దీ కొడుకు. అబ్దీ మల్లూకు కొడుకు. మల్లూకు హషబ్యా కొడుకు.
また彼らの兄弟であるメラリの子らが左に立った。そのうちのエタンはキシの子、キシはアブデの子、アブデはマルクの子、
45 ౪౫ హషబ్యా అమజ్యా కొడుకు. అమజ్యా హిల్కీయా కొడుకు.
マルクはハシャビヤの子、ハシャビヤはアマジヤの子、アマジヤはヒルキヤの子、
46 ౪౬ హిల్కీయా అమ్జీ కొడుకు. అమ్జీ బానీ కొడుకు. బానీ షమెరు కొడుకు.
ヒルキヤはアムジの子、アムジはバニの子、バニはセメルの子、
47 ౪౭ షమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు. మూషి మెరారి కొడుకు. మెరారి లేవి కొడుకు.
セメルはマヘリの子、マヘリはムシの子、ムシはメラリの子、メラリはレビの子である。
48 ౪౮ వీళ్ళ సోదరులైన ఇతర లేవీయులను దేవుని మందిరానికి సంబంధించిన అన్ని పనులకు నియమించారు.
彼らの兄弟であるレビびとたちは、神の宮の幕屋のもろもろの務に任じられた。
49 ౪౯ అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులూ అహరోనూ, అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహన బలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది.
アロンとその子らは燔祭の壇と香の祭壇の上にささげることをなし、また至聖所のすべてのわざをなし、かつイスラエルのためにあがないをなした。すべて神のしもべモーセの命じたとおりである。
50 ౫౦ అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు ఫీనెహాసు. ఫీనెహాసు కొడుకు అబీషూవ.
アロンの子孫は次のとおりである。アロンの子はエレアザル、その子はピネハス、その子はアビシュア、
51 ౫౧ అబీషూవ కొడుకు బుక్కీ. బుక్కీ కొడుకు ఉజ్జీ. ఉజ్జీ కొడుకు జెరహ్య.
その子はブッキ、その子はウジ、その子はゼラヒヤ、
52 ౫౨ జెరహ్య కొడుకు మెరాయోతు. మెరాయోతు కొడుకు అమర్యా. అమర్యా కొడుకు అహీటూబు.
その子はメラヨテ、その子はアマリヤ、その子はアヒトブ、
53 ౫౩ అహీటూబు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు అహిమయస్సు.
その子はザドク、その子はアヒマアズである。
54 ౫౪ అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహాతీయుల కుటుంబాల పైన పడింది.
アロンの子孫の住む所はその境のうちにある宿営によっていえば次のとおりである。まずコハテびとの氏族がくじによって得たところ、
55 ౫౫ దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది.
すなわち彼らが与えられたところは、ユダの地にあるヘブロンとその周囲の放牧地である。
56 ౫౬ అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలనూ దాని చుట్టుపక్కల గ్రామాలనూ యెఫున్నె కొడుకు కాలేబుకి ఇచ్చారు.
ただし、その町の田畑とその村々は、エフンネの子カレブに与えられた。
57 ౫౭ అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే, ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలూ, యత్తీరూ, ఎష్టేమో దాని పచ్చిక మైదానాలూ,
そしてアロンの子孫に与えられたものは、のがれの町であるヘブロンおよびリブナとその放牧地、ヤッテルおよびエシテモアとその放牧地、
58 ౫౮ హీలేనూ, దాని పచ్చిక మైదానాలూ, దెబీరూ దాని పచ్చిక మైదానాలూ.
ヒレンとその放牧地、デビルとその放牧地、
59 ౫౯ అహరోను వారసులకు వీటితో పాటు ఆషానూ దాని పచ్చిక మైదానాలూ, బేత్షెమెషూ దాని పచ్చిక మైదానాలూ కూడా దక్కాయి.
アシャンとその放牧地、ベテシメシとその放牧地である。
60 ౬౦ ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి.
またベニヤミンの部族のうちからはゲバとその放牧地、アレメテとその放牧地、アナトテとその放牧地を与えられた。彼らの町は、すべてその氏族のうちに十三あった。
61 ౬౧ కహాతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనష్షే అర్థగోత్ర ప్రదేశాల్లో నుండి పది పట్టణాలు వచ్చాయి.
またコハテの子孫の残りの者は部族の氏族のうちからと、半部族すなわちマナセの半部族のうちからくじによって十の町を与えられた。
62 ౬౨ గెర్షోను వారసులకు వాళ్ళ వివిధ తెగల ప్రకారం పదమూడు పట్టణాలు వచ్చాయి. ఇవి ఇశ్శాఖారూ, ఆషేరూ, నఫ్తాలీ, గోత్రాల ప్రదేశాల నుండీ బాషానులో ఉన్న మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండీ ఇవ్వడం జరిగింది.
またゲルションの子孫はその氏族によってイッサカルの部族、アセルの部族、ナフタリの部族、およびバシャンのマナセの部族のうちから十三の町が与えられた。
63 ౬౩ మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ళ తెగలకు పన్నెండు పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేనూ, గాదూ, జెబూలూనూ గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది.
メラリの子孫はその氏族によってルベンの部族、ガドの部族、およびゼブルンの部族のうちからくじによって十二の町が与えられた。
64 ౬౪ ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలనూ వాటి పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
このようにイスラエルの人々はレビびとに町々とその放牧地とを与えた。
65 ౬౫ వాళ్ళు చీటీ వేసి, ముందు పేర్కొన్న పట్టణాలను యూదా, షిమ్యోనూ, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు.
すなわちユダの子孫の部族とシメオンの部族の子孫と、ベニヤミンの子孫の部族のうちからここに名をあげたこれらの町をくじによって与えた。
66 ౬౬ కహాతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు.
コハテの子孫の氏族はまたエフライムの部族のうちからも町々を獲てその領地とした。
67 ౬౭ ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన షెకెము, దాని పచ్చిక మైదానాలనూ, గెజెరున దాని పచ్చిక మైదానాలనూ,
すなわち彼らが与えられた、のがれの町はエフライムの山地にあるシケムとその放牧地、ゲゼルとその放牧地、
68 ౬౮ యొక్మెయాము దాని పచ్చిక మైదానాలనూ, బేత్‌హోరోను దాని పచ్చిక మైదానాలనూ,
ヨクメアムとその放牧地、ベテホロンとその放牧地、
69 ౬౯ అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు.
アヤロンとその放牧地、ガテリンモンとその放牧地である。
70 ౭౦ అలాగే మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలనూ బిలియాము దాని పచ్చిక మైదానాలనూ, కహాతీయులకు ఇచ్చారు.
またマナセの半部族のうちからは、アネルとその放牧地およびビレアムとその放牧地を、コハテの子孫の氏族の残りのものに与えた。
71 ౭౧ అలాగే మనష్షే అర్థగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గోలాను ప్రాంతం, దాని పచ్చిక మైదానాలూ, అష్తారోతూ దాని పచ్చిక మైదానాలూ,
ゲルションの子孫に与えられたものはマナセの半部族のうちからはバシャンのゴランとその放牧地、アシタロテとその放牧地。
72 ౭౨ ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ,
イッサカルの部族のうちからはケデシとその放牧地、ダベラテとその放牧地、
73 ౭౩ రామోతూ దాని పచ్చిక మైదానాలూ, ఆనేమూ దాని పచ్చిక మైదానాలూ,
ラモテとその放牧地、アネムとその放牧地。
74 ౭౪ ఆషేరుగోత్రం నుండి మాషాలూ దాని పచ్చిక మైదానాలూ, అబ్దోనూ దాని పచ్చిక మైదానాలూ,
アセルの部族のうちからはマシャルとその放牧地、アブドンとその放牧地、
75 ౭౫ హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ,
ホコクとその放牧地、レホブとその放牧地。
76 ౭౬ నఫ్తాలి గోత్రం నుండి గలిలయలో ఉన్న కెదెషు దాని పచ్చిక మైదానాలూ, హమ్మోనూ దాని పచ్చిక మైదానాలూ, కిర్యతాయిమూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
ナフタリの部族のうちからはガリラヤのケデシとその放牧地、ハンモンとその放牧地、キリアタイムとその放牧地である。
77 ౭౭ ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారీ వారసులకు జెబూలూను గోత్రం నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలూ, తాబోరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
このほかのもの、すなわちメラリの子孫に与えられたものはゼブルンの部族のうちからリンモンとその放牧地、タボルとその放牧地、
78 ౭౮ ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యొర్దానుకి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బేసెరు దాని పచ్చిక మైదానాలూ, యహజా దాని పచ్చిక మైదానాలూ,
エリコに近いヨルダンのかなた、すなわちヨルダンの東ではルベンの部族のうちからは荒野のベゼルとその放牧地、ヤザとその放牧地、
79 ౭౯ కెదేమోతూ దాని పచ్చిక మైదానాలూ, మేఫాతూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
ケデモテとその放牧地、メパアテとその放牧地。
80 ౮౦ అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతూ దాని పచ్చిక మైదానాలూ, మహనయీము దాని పచ్చిక మైదానాలూ,
ガドの部族のうちからはギレアデのラモテとその放牧地、マハナイムとその放牧地、
81 ౮౧ హెష్బోనూ దాని పచ్చిక మైదానాలూ, యాజెరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
ヘシボンとその放牧地、ヤゼルとその放牧地である。

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 6 >