< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 5 >
1 ౧ ఇశ్రాయేలుకు పెద్దకొడుకైన రూబేను సంతానం గూర్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గానీ అతని ప్రథమ సంతానపు జన్మహక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు.
Un Rūbena, Israēla pirmdzimušā dēla, bērni, (jo viņš bija tas pirmdzimušais, bet tāpēc, ka tas bija sagānījis sava tēva gultu, viņa pirmdzimtība tapa dota Jāzepa, Israēla dēla, bērniem, bet to tik neskaitīja (cilts rakstos) par pirmdzimto.
2 ౨ తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది.
Jo Jūda palika varens starp saviem brāļiem, un no viņa bija tas valdnieks, bet Jāzepam palika tā pirmdzimtība).
3 ౩ ఇశ్రాయేలుకు పెద్ద కొడుకుగా పుట్టిన రూబేను కొడుకులు ఎవరంటే హనోకు, పల్లూ, హెస్రోను, కర్మీ అనే వారు.
Rūbena, Israēla pirmdzimušā dēla, bērni bija: Hanoks un Palus, Hecrons un Karmus.
4 ౪ యోవేలు వారసుల వివరాలిలా ఉన్నాయి. యోవేలు కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగు, గోగు కొడుకు షిమీ,
Joēļa bērni bija: Šemajus, tā dēls Gogs, tā dēls Šimejus,
5 ౫ షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బయలు,
Tā dēls Miha, tā dēls Reaja, tā dēls Baāls,
6 ౬ బయలు కొడుకు బెయేర. ఇతడు రూబేనీయులకు నాయకుడు. అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు ఇతణ్ణి బందీగా చేసి తీసుకు వెళ్ళాడు.
Tā dēls Beēra, ko TiglatPilnesers, Asīrijas ķēniņš, aizveda cietumā, - tas bija Rūbena bērnu lielskungs.
7 ౭ వాళ్ళ వంశావళి లెక్కల్లో ఉన్న తమ కుటుంబాల ప్రకారం అతని సోదరులెవరంటే ప్రధాని అయిన యెహీయేలూ, జెకర్యా,
Un viņa brāļi pēc saviem radiem, kā tie savos radu rakstos tapa skaitīti: virsnieks Jejels un Zaharija,
8 ౮ యోవేలు కొడుకైన షెమ మనుమడూ ఆజాజు కొడుకూ అయిన బెల అనే వాళ్ళు. వీళ్ళు అరోయేరు లోనూ, నెబో, బయల్మెయోనుల వరకూ నివాసం ఏర్పరచుకున్నారు.
Un Belus, Asasa dēls, tas bija Zemas, tas Joēļa dēls, tas dzīvoja Aroērā un līdz Nebum un BaālMeonam;
9 ౯ వాళ్ళ పశువులు గిలాదు దేశంలో అతి విస్తారమయ్యాయి. కాబట్టి వాళ్ళు తూర్పున యూఫ్రటీసు నది దగ్గరనుండి అరణ్యపు సరిహద్దుల వరకూ నివాసాలు ఏర్పరచుకున్నారు.
Un pret rītiem viņš dzīvoja, līdz kamēr nāk tuksnesī pie Eifrat upes, jo viņu ganāmie pulki bija vairojušies Gileādas zemē.
10 ౧౦ సౌలు పరిపాలనా కాలంలో వాళ్ళు హగ్రీ జాతి వారితో యుద్ధం చేసి వాళ్ళను హతమార్చారు. గిలాదు తూర్పు వైపు వరకూ ఉన్న ప్రాంతమంతా నివాసమున్నారు.
Un Saula laikā tie karoja pret Agariem; un šie krita caur viņu rokām, un tie dzīvoja viņu teltīs visā Gileādas rīta pusē.
11 ౧౧ వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు.
Un Gada bērni dzīvoja tiem pretī Basanas zemē līdz Zalkai.
12 ౧౨ వాళ్ళ నాయకులు యోవేలు, షాపాము అనేవాళ్ళు. వీళ్ళు తమ తమ కుటుంబాల నాయకులు. వీళ్ళ తరువాత షాపాతు, యహనై అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బాషానులో నివసించారు.
Joēls tas pirmais un Safans tas otrais un Jaēnajus un Šafats Basanā.
13 ౧౩ వీళ్ళ తండ్రుల వైపు కుటుంబాల బంధువులు మొత్తం ఏడుగురున్నారు. వాళ్ళు మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబెరు అనే వాళ్ళు.
Un viņu brāļi pēc viņu tēvu namiem bija: Mikaēls un Mešulams un Zebus un Jorajus un Jaēkans un Zija un Hebers, septiņi.
14 ౧౪ వీళ్ళు హూరీ అనే వాడికి పుట్టిన అబీహాయిలు కొడుకులు. ఈ హూరీ యరోయకీ, యారోయ గిలాదుకీ, గిలాదు మిఖాయేలుకీ, మిఖాయేలు యెషీషైకీ, యెషీషై యహదోకీ, యహదో బూజుకీ పుట్టారు.
Šie bija Abikaīļa bērni, tas bija Ura, tas Jarvas, tas Gileāda, tas Mikaēļa, tas Jezizajus, tas Jādas, tas Busa dēls.
15 ౧౫ గూనీకి పుట్టిన అబ్దీయేలు కుమారుడు అహీ వాళ్ళ తండ్రుల కుటుంబాలకు నాయకుడు.
Akus, Abdiēļa dēls, Gunas dēla dēls, bija virsnieks pār viņu tēvu namu.
16 ౧౬ వారు బాషానులోని గిలాదులోనూ, మిగిలిన ఊళ్లలోనూ, షారోను సరిహద్దుల వరకూ ఉన్న పచ్చని భూముల్లోనూ నివాసమున్నారు.
Un tie dzīvoja Gileādā un Basanā un viņu piederīgās vietās un visā Šarona apgabalā līdz viņu galiem.
17 ౧౭ యూదా రాజు యోతాము కాలంలోనూ ఇశ్రాయేలు రాజు యరొబాము కాలంలోనూ వీళ్ళను వాళ్ళ వంశావళి లెక్కల్లో నమోదు చేశారు.
Visi šie tapa sazīmēti radu rakstos Jotama, Jūda ķēniņa, laikā, un Jerobeama, Israēla ķēniņa, laikā.
18 ౧౮ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థ గోత్రం వాళ్ళల్లో బల్లెం, కత్తి పట్టగలిగిన వాళ్ళూ, బాణాలు వేయడంలో నేర్పరులూ, యుద్ధం చేయడానికి సన్నద్ధమైన వాళ్ళూ మొత్తం నలభై నాలుగు వేల ఏడు వందల అరవైమంది ఉన్నారు.
Rūbena bērnu un Gada bērnu un Manasus puscilts, kas bija sirdīgi vīri un bruņas un zobenu nesa un stopu uzvilka un uz karu mācīti, to bija četrdesmit četri tūkstoši septiņsimt sešdesmit, kas gāja karā.
19 ౧౯ వీళ్ళు హగ్రీ జాతి వాళ్ళ పైనా, యెతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేసారు.
Un tie karoja pret Agariem un Jeturu un Navesu un Nodabu.
20 ౨౦ యుద్ధంలో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రీ జాతి వాళ్ళూ, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తన పైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు.
Bet tiem nāca palīgs pret šiem, un Agari tapa doti viņu rokā un visi, kas ar tiem bija. Jo tie piesauca Dievu kaujā, un viņš no tiem likās pielūgties, tāpēc ka tie uz viņu cerēja.
21 ౨౧ కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు.
Un tie noveda lopus, piecdesmit tūkstoš kamieļus, divsimt piecdesmit tūkstoš avis un divtūkstoš ēzeļus un simt tūkstoš cilvēkus.
22 ౨౨ దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్ళేంత వరకూ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళంతా హగ్రీ జాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు.
Jo daudz krita ievainoti, tāpēc ka tā kauja bija no Dieva. Un tie dzīvoja viņu vietā līdz cietuma laikam.
23 ౨౩ మనష్షే అర్థగోత్రం వాళ్ళు ఆ బాషాను దేశంలో నివసించి అభివృద్ధి చెందారు. బాషాను నుండి బయల్హెర్మోను వరకూ ఇంకా హెర్మోను పర్వతం అయిన శెనీరు వరకూ వ్యాపించారు.
Un Manasus puscilts bērni dzīvoja tai zemē un vairojās no Basanas līdz Baāl Hermonam un Senirai un Hermona kalnam.
24 ౨౪ వాళ్ళ కుటుంబాలకు నాయకులు ఎవరంటే ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు అనే వాళ్లు. వీళ్ళు ధైర్యవంతులు, బలవంతులు, ప్రసిద్ధులైన వాళ్ళు. తమ తమ కుటుంబాలకు నాయకులు.
Un šie bija viņu tēva namu virsnieki: Hefers un Jezejus un Eliēls un Asriēls un Jeremija un Odavija un Jakdiēls, stipri varoņi, slaveni vīri, savu tēvu nama virsnieki.
25 ౨౫ కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుట ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు.
Bet kad tie apgrēkojās pret savu tēvu Dievu un maukoja pakaļ to zemes ļaužu dieviem, ko Dievs viņu priekšā bija izdeldējis,
26 ౨౬ కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీ బందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు.
Tad Israēla Dievs pamodināja Pūla, Asīrijas ķēniņa, garu un Tiglat-Pilnesera, Asīrijas ķēniņa, garu un aizveda cietumā Rūbena bērnus un Gada bērnus un Manasus puscilti un tos noveda uz Alu un Aboru un Aru un pie Gozanas upes līdz šai dienai.