< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 3 >

1 దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం. రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం.
וְאֵלֶּה הָיוּ בְּנֵי דָויִד אֲשֶׁר נֽוֹלַד־לוֹ בְּחֶבְרוֹן הַבְּכוֹר ׀ אַמְנֹן לַאֲחִינֹעַם הַיִּזְרְעֵאלִית שֵׁנִי דָּנִיֵּאל לַאֲבִיגַיִל הַֽכַּרְמְלִֽית׃
2 మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు. నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు.
הַשְּׁלִשִׁי לְאַבְשָׁלוֹם בֶּֽן־מַעֲכָה בַּת־תַּלְמַי מֶלֶךְ גְּשׁוּר הָרְבִיעִי אֲדֹנִיָּה בֶן־חַגִּֽית׃
3 అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు. ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.
הַחֲמִישִׁי שְׁפַטְיָה לַאֲבִיטָל הַשִּׁשִּׁי יִתְרְעָם לְעֶגְלָה אִשְׁתּֽוֹ׃
4 ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు. యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
שִׁשָּׁה נֽוֹלַד־לוֹ בְחֶבְרוֹן וַיִּמְלָךְ־שָׁם שֶׁבַע שָׁנִים וְשִׁשָּׁה חֳדָשִׁים וּשְׁלֹשִׁים וְשָׁלוֹשׁ שָׁנָה מָלַךְ בִּירוּשָׁלָֽ͏ִם׃
5 యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు.
וְאֵלֶּה נוּלְּדוּ־לוֹ בִּירוּשָׁלָיִם שִׁמְעָא וְשׁוֹבָב וְנָתָן וּשְׁלֹמֹה אַרְבָּעָה לְבַת־שׁוּעַ בַּת־עַמִּיאֵֽל׃
6 దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,
וְיִבְחָר וֶאֱלִישָׁמָע וֶאֱלִיפָֽלֶט׃
7 నోగహు, నెపెగు, యాఫీయ,
וְנֹגַהּ וְנֶפֶג וְיָפִֽיעַ׃
8 ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు.
וֶאֱלִישָׁמָע וְאֶלְיָדָע וֶאֱלִיפֶלֶט תִּשְׁעָֽה׃
9 వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు.
כֹּל בְּנֵי דָוִיד מִלְּבַד בְּֽנֵי־פִֽילַגְשִׁים וְתָמָר אֲחוֹתָֽם׃
10 ౧౦ సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.
וּבֶן־שְׁלֹמֹה רְחַבְעָם אֲבִיָּה בְנוֹ אָסָא בְנוֹ יְהוֹשָׁפָט בְּנֽוֹ׃
11 ౧౧ యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు.
יוֹרָם בְּנוֹ אֲחַזְיָהוּ בְנוֹ יוֹאָשׁ בְּנֽוֹ׃
12 ౧౨ యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము.
אֲמַצְיָהוּ בְנוֹ עֲזַרְיָה בְנוֹ יוֹתָם בְּנֽוֹ׃
13 ౧౩ యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.
אָחָז בְּנוֹ חִזְקִיָּהוּ בְנוֹ מְנַשֶּׁה בְנֽוֹ׃
14 ౧౪ మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
אָמוֹן בְּנוֹ יֹאשִׁיָּהוּ בְנֽוֹ׃
15 ౧౫ యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.
וּבְנֵי יֹאשִׁיָּהוּ הַבְּכוֹר יוֹחָנָן הַשֵּׁנִי יְהוֹיָקִים הַשְּׁלִשִׁי צִדְקִיָּהוּ הָרְבִיעִי שַׁלּֽוּם׃
16 ౧౬ యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు.
וּבְנֵי יְהוֹיָקִים יְכָנְיָה בְנוֹ צִדְקִיָּה בְנֽוֹ׃
17 ౧౭ యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,
וּבְנֵי יְכָנְיָה אַסִּר שְׁאַלְתִּיאֵל בְּנֽוֹ׃
18 ౧౮ మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.
וּמַלְכִּירָם וּפְדָיָה וְשֶׁנְאַצַּר יְקַמְיָה הוֹשָׁמָע וּנְדַבְיָֽה׃
19 ౧౯ పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు.
וּבְנֵי פְדָיָה זְרֻבָּבֶל וְשִׁמְעִי וּבֶן־זְרֻבָּבֶל מְשֻׁלָּם וַחֲנַנְיָה וּשְׁלֹמִית אֲחוֹתָֽם׃
20 ౨౦ అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్.
וַחֲשֻׁבָה וָאֹהֶל וּבֶרֶכְיָה וֽ͏ַחֲסַדְיָה יוּשַׁב חֶסֶד חָמֵֽשׁ׃
21 ౨౧ హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు.
וּבֶן־חֲנַנְיָה פְּלַטְיָה וִישַֽׁעְיָה בְּנֵי רְפָיָה בְּנֵי אַרְנָן בְּנֵי עֹבַדְיָה בְּנֵי שְׁכַנְיָֽה׃
22 ౨౨ షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు.
וּבְנֵי שְׁכַנְיָה שְׁמַעְיָה וּבְנֵי שְׁמַעְיָה חַטּוּשׁ וְיִגְאָל וּבָרִיחַ וּנְעַרְיָה וְשָׁפָט שִׁשָּֽׁה׃
23 ౨౩ నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.
וּבֶן־נְעַרְיָה אֶלְיוֹעֵינַי וְחִזְקִיָּה וְעַזְרִיקָם שְׁלֹשָֽׁה׃
24 ౨౪ ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ.
וּבְנֵי אֶלְיוֹעֵינַי הדיוהו הוֹדַוְיָהוּ וְאֶלְיָשִׁיב וּפְלָיָה וְעַקּוּב וְיוֹחָנָן וּדְלָיָה וַעֲנָנִי שִׁבְעָֽה׃

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 3 >