< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 28 >

1 గోత్రాల పెద్దలనూ, వంతుల చొప్పున రాజుకు సేవ చేసే అధిపతులనూ సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ, రాజుకూ, రాకుమారులకూ ఉన్న యావత్తు స్థిర చరాస్తుల మీదా ఉన్న అధిపతులను అంటే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ, రాజు దగ్గరున్న పరివారాన్నీ, పరాక్రమశాలురనూ, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజైన దావీదు యెరూషలేములో సమావేశపరిచాడు.
Dawid frɛɛ ne mpanyimfo nyinaa kɔɔ Yerusalem. Saa mpanyimfo no ne mmusuakuw no ntuanofo, asahene a wɔdeda asraafodɔm akuw dumien no ano, asraafo mpanyimfo a wɔaka no, wɔn a wɔhwɛ ɔhene agyapade ne ne mmoa so, ahemfi nhenkwaa, akofo akɛse ne akofo a wɔaka wɔ ahenni no mu no.
2 అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి “నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసానికీ, మన దేవుని పాదపీఠంగా ఉండడానికీ, ఒక మందిరం కట్టించాలని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుని సమస్తం సిద్ధపరచాను.”
Dawid sɔre gyinaa wɔn anim, kasa kyerɛɛ wɔn se, “Me nuanom ne me nkurɔfo, anka mepɛɛ sɛ misi asɔredan a wɔde Awurade Apam Adaka, Onyankopɔn anan ntiaso no besi afebɔɔ. Meyɛɛ ho ahoboa nyinaa sɛ mede rebesi,
3 అయితే “నువ్వు యుద్ధాలు జరిగించి రక్తం ఒలికించిన వాడవు గనుక నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు” అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
nanso Onyankopɔn ka kyerɛɛ me se, ‘Ɛnsɛ sɛ wusi asɔredan de hyɛ me din anuonyam, efisɛ woyɛ ɔkofo a woahwie mogya bebree agu.’
4 ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వాళ్ళందర్లో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రానికి, యూదా గోత్రం వాళ్ళలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటినీ, నా తండ్రి ఇంట్లో నన్నూ ఏర్పరచుకుని, నా మీద దయ చూపించి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
“Nanso Awurade, Israel Nyankopɔn, ayi me wɔ mʼagya abusua mu sɛ, minni ɔhene wɔ Israel so daa. Na wayi Yuda abusuakuw sɛ wonni hene na Yuda mmusua mu nso, oyii mʼagya abusua. Na mʼagya mma mu no nso, ɛyɛɛ Awurade fɛ sɛ osii me Israel nyinaa so hene.
5 యెహోవా నాకు చాలా మంది కొడుకులను దయ చేశాడు. అయితే ఇశ్రాయేలీయుల మీద, యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కొడుకులందరిలో సొలొమోనును కోరుకున్నాడు. ఆయన నాతో,
Na me mmabarima pii a Awurade de wɔn maa me no mu nso, oyii Salomo sɛ ɔntena Awurade ahenni agua no so nni Israel so.
6 “నేను నీ కొడుకు సొలొమోనును నాకు కొడుకుగా ఏర్పరచుకొన్నాను. నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నా మందిరాన్నీ, నా ఆవరణాలూ కట్టిస్తాడు.
Ɔka kyerɛɛ me se, ‘Wo babarima Salomo na obesi mʼasɔredan ne nʼadiwo nyinaa, efisɛ mayi no sɛ me babarima na mɛyɛ nʼagya.
7 ఈ రోజు చేస్తున్నట్టుగా అతడు ధైర్యంతో నా ఆజ్ఞలూ, నా న్యాయవిధులూ పాటిస్తే, నేను అతని రాజ్యాన్ని నిత్యం స్థిరపరుస్తాను” అన్నాడు.
Na sɛ ɔkɔ so di mʼahyɛde ne me mmara so, sɛnea ɔyɛ mprempren yi a, mɛma nʼahenni atim afebɔɔ.’
8 “కాబట్టి మీరు ఈ మంచి దేశాన్ని స్వాస్థ్యంగా అనుభవించి, మీ తరువాత మీ సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేలా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలు అన్నీ తెలుసుకుని వాటిని పాటించండి.
“Enti mprempren a Onyankopɔn yɛ yɛn dansifo yi, menam wo so de saa asodi yi ma Israel nyinaa a wɔyɛ Awurade manfo no: Monhwɛ yiye na munni Awurade, mo Nyankopɔn, ahyɛde nyinaa so sɛnea mobɛfa saa asase pa yi, na moagyaw ama mo asefo sɛ wɔn agyapade daa.
9 సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.
“Afei, me ba Salomo, hu wʼagyanom Nyankopɔn. Fa wo koma ne wʼadwene nyinaa sɔre no, na som no. Efisɛ Awurade hu koma biara mu, enti ohu na onim emu nhyehyɛe ne nsusuwii biara. Sɛ wohwehwɛ no a, wubehu no. Na sɛ wopo no a, ɔbɛpo wo afebɔɔ.
10 ౧౦ పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు” అన్నాడు.
Enti fa no asɛnhia. Awurade ayi wo sɛ si asɔredan ma no, sɛ ne kronkronbea. Yɛ den, na di dwuma no.”
11 ౧౧ అప్పుడు దావీదు మంటపానికీ, మందిర నిర్మాణానికి, గిడ్డంగులకు, మేడ గదులకూ, లోపలి గదులకూ, ప్రాయశ్చిత్త వేదిక ఉన్న గదికీ, యెహోవా మందిరపు ఆవరణాలకూ,
Afei Dawid de asɔredan no ho mfoni a sikakorabea, soro adan, emu adan ne emu kronkronbea a Apam Adaka no afefare mu a ɛhɔ yɛ mpatabea, faako a wɔde Adaka no besi maa Salomo.
12 ౧౨ వాటి చుట్టూ ఉన్న గదులకూ, దేవుని మందిర గిడ్డంగులకు, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులకు, తాను ఏర్పాటు చేసి సిద్ధం చేసిన నిర్మాణ ప్రణాళికలను తన కొడుకు సొలొమోనుకు అప్పగించాడు.
Nhyehyɛe biara a Honhom no de maa Dawid a ɛfa Awurade Asɔredan adiwo ho, akyi adan, Onyankopɔn Asɔredan no mu sikakorabea ne akyɛde a wɔde ama Onyankopɔn no, ɔkyerɛɛ Salomo.
13 ౧౩ యాజకులూ, లేవీయులూ, సేవ చెయ్యవలసిన వంతుల జాబితా, యెహోవా మందిరపు సేవను గూర్చిన జాబితా, యెహోవా మందిరపు సేవ ఉపకరణాల జాబితా దావీదు అతనికి అప్పగించాడు.
Saa ara na ɔhene no kyerɛɛ Salomo dwuma a asɔfo ne Lewifo nkyekyɛmu ahorow no nyɛ wɔ Awurade Asɔredan no mu. Na ɔkyerɛkyerɛɛ nneɛma pɔtee a ɛwɔ Awurade Asɔredan no mu a wɔde sɔre Awurade ne nea wɔde bɔ afɔre.
14 ౧౪ ఇంకా, అనేక సేవాక్రమాలకు కావలసిన బంగారు ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం బంగారం, అనేక సేవాక్రమాలకు కావలసిన వెండి ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించాడు.
Dawid kyerɛɛ sikakɔkɔɔ ne dwetɛ dodow a wɔmfa nyɛ nneɛma a ɛho behia.
15 ౧౫ బంగారు దీపస్తంభాలకూ, వాటి బంగారు ప్రమిదెలకూ, ఒక్కొక్క దీపస్తంభానికీ, దాని ప్రమిదెలకూ కావలసినంత బంగారం తూకం ప్రకారంగా, వెండి దీపస్తంభాలకూ ఒక్కొక దీపస్తంభానికీ, దాని దాని ప్రమిదలకూ కావలసినంత వెండిని తూకం ప్రకారంగా,
Ɔkyerɛɛ Salomo sikakɔkɔɔ dodow a ɛho behia ama sikakɔkɔɔ akaneadua no ne akanea no, na ɔkyerɛɛ dwetɛ dodow a ɛho behia ama dwetɛ akaneadua no ne akanea no yɛ, ne ɔkwan ko a wɔbɛfa so de emu biara adi dwuma no.
16 ౧౬ సన్నిధి రొట్టెలు ఉంచే ఒక్కొక బల్లకు కావలసినంత బంగారం తూకం ప్రకారంగా వెండి బల్లలకు కావలసినంత వెండినీ,
Ɔkyerɛɛ sikakɔkɔɔ dodow a wɔmfa nyɛ ɔpon a wɔde Daa Daa Brodo no bɛto so; na ɔkyerɛɛ dwetɛ dodow a wɔmfa nyɛ apon a ɛka ho no.
17 ౧౭ ముళ్ళ కొంకులకూ, గిన్నెలకూ, పాత్రలకూ కావలసినంత స్వచ్ఛమైన బంగారం, గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకూ కావలసినంత బంగారం తూకం ప్రకారం, వెండి గిన్నెల్లో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని తూకం ప్రకారం,
Dawid san kyerɛɛ sikakɔkɔɔ dodow a wɔmfa nyɛ nam darewa a wɔde besuso afɔrebɔ nam mu, hweaseammɔ, sukuruwa ne nyowa ne dwetɛ dodow a wɔmfa nyɛ asanka biara.
18 ౧౮ ధూపపీఠానికి కావలసినంత స్వచ్ఛమైన బంగారం తూకం ప్రకారం, రెక్కలు విప్పుకుని యెహోవా నిబంధన మందసాన్ని కప్పే కెరూబుల రూపకల్పనకు కావలసినంత బంగారం అతనికి అప్పగించాడు.
Nea ɔde wiee ne sɛ, ɔkyerɛɛ sikakɔkɔɔ a wɔabere ho dodow a wɔde bɛyɛ nnuhuam afɔremuka no ne sikakɔkɔɔ kerubim a ne ntaban atrɛw wɔ Awurade Adaka no so.
19 ౧౯ ఇవన్నీ అప్పగించి “యెహోవా నాకిచ్చిన అవగాహన, నడిపింపును బట్టి ఈ నిర్మాణ ప్రణాళిక అంతా రాసి పెట్టాను” అని సొలొమోనుతో చెప్పాడు.
Dawid ka kyerɛɛ Salomo se, “Saa mfoni yi nyinaa, Awurade nsa na ɔde kyerɛw maa me.”
20 ౨౦ ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో “నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో. భయపడొద్దు, కంగారు పడొద్దు. నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకూ ఆయన నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు.
Afei, Dawid toaa so se, “Yɛ den na ma wo bo nyɛ duru na yɛ adwuma no. Nsuro na mma dwumadi no kɛseyɛ ntu wo bo, efisɛ Awurade Nyankopɔn, me Nyankopɔn, ka wo ho. Ɔrenni wo huammɔ na ɔrennya wo. Ɔbɛhwɛ sɛ dwumadi biara a ɛfa Awurade Asɔredan no si ho no, wobewie no pɛpɛɛpɛ.
21 ౨౧ దేవుని మందిర సేవంతటికీ, యాజకులూ, లేవీయులూ వంతుల ప్రకారం ఏర్పాటయ్యారు. నీ ఆజ్ఞకు లోబడి ఉంటూ ఈ పనంతా నెరవేర్చడానికి వివిధ పనుల్లో ప్రవీణులైన వాళ్ళూ, మనస్పూర్తిగా పని చేసేవాళ్ళూ, అధిపతులూ, ప్రజలందరూ, నీకు సహాయకులుగా ఉంటారు” అన్నాడు.
Asɔfo ne Lewifo akuw no bɛsom wɔ Onyankopɔn Asɔredan no mu. Wɔn a aka a wɔwɔ nimdeɛ ahorow no nyinaa beyi wɔn yam aboa, na ntuanofo ne ɔman no nyinaa nso bɛyɛ biribiara a wobɛka.”

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 28 >