< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 27 >

1 ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెలా రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య ఇరవై నాలుగు వేలు.
Hagi ama'i vahe zamagia, Israeli vahetamimofo nagate, nagate'ma kegava hutere hu'naza vahetamine, 1 tauseni'a sondia vahete'ene, 100'a sondia vahetaminte'ma kegava hu'naza vahetamine, kini ne'mofo eri'zama erinentaza vahetamine. Hagi ana vahetmina 24tauseni'a vahe refko huntetere hu'neankino mago kevumo'a mago ikampi eri'zana eritere hu'naze.
2 మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.
Hagi ese ikante'ma ese kevufima mani'naza vahe'ma eri'zama erisaza vahetmimofo kva nera Zabdieli nemofo Jasobiamu'e. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
3 పెరెజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు.
Hagi Jasobiamu'a Perezi nagapinti fore hu'neankino, maka sondia kva vahe'taminte kegava hu'ne. Hagi agra maka ese ikampina eri'zana erigahie.
4 రెండో నెల వంతు అహోహీయుడైన దోదై, అతని గుంపుదీ అయింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 2 ikante'ma eri'zama erisaza vahe'ma refkoma huntea kevurera, Ahohiti nagapinti ne' Dodai kegava higeno Mikloti anante kva nera mani'ne. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
5 మూడో నెల యెహోయాదా కొడుకూ, సభాముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరినవాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 3 ikante'ma refko'ma hunte'nea vahe kevure'ma kegavama hu'nea kva nera, ugagota pristi ne' Jehoiada nemofo Benaia mani'ne. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
6 ఈ బెనాయా ఆ ముప్ఫై మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ ముప్ఫైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు.
Hagi Devitina 30'a hankavenentake sondia vahepina Benaia'a mago'zimimokino, agra ugota huno kegava huzmante'ne. Hagi Agri'ma refko'ma humiza kevurera nemofo Amizabadi nampa 2 kva nera mani'neno kegava huzmante'ne.
7 నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 4 ikante'ma nampa 4 kevuma refkoma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Joapu nagna'amo Asaheli kegava hu'ne. Hagi agri noma henka erino kegavama hu'neana, nemofo Zebadia ana vahera kegava higeno, ana kevufina 24tauseni'a vahe mani'naze.
8 అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 5fu ikantema, nampa 5fu kevuma refkoma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Izrahi nagapinti ne' Samhuti'e. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
9 ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 6si ikante'ma nampa 6si kevuma refkoma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Tekoa kumateti ne' Ikesi nemofo Ira'e. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
10 ౧౦ ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 7ni ikante'ma nampa 7ni kevuma refkoma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Peloni kumateti, Efraemi nagapinti ne' Helezi'e. Hagi ana kevufina 24 tauseni'a vahe mani'naze.
11 ౧౧ ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 8ti ikante'ma nampa 8ti kevuma refkoma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Husa kumateti, Zera nagapinti ne' Sibekai'e. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
12 ౧౨ తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువూ, అనాతోతీయుడు అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు, అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 9ni ikante'ma nampa 9ni kevuma refko'ma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Anatoti kumateti, Benzameni nagapinti ne' Abiezeri'e. Hagi ana kevufina 24tauseni'a vahe' mani'naze.
13 ౧౩ పదో నెల జెరహీయుల బంధువూ, నెటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 10ni ikante'ma nampa 10ni kevuma refko'ma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Netofa kumateti, Zera nagapinti ne' Maharai'e. Hagi ana kevufina 24tauseni'a vahe' mani'naze.
14 ౧౪ పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడూ, పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 11ni ikante'ma 11ni kevuma refko'ma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Piratoni kumateti, Efraemi nagapinti ne' Benaia'e. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
15 ౧౫ పన్నెండో నెల ఒత్నీయేలు బంధువూ, నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Hagi namba 12 ikante'ma 12fu kevuma refko'ma hunte'nea kevure'ma kegavama hu'nea kva nera Netofa kumateti, Otnieli nagapinti ne' Heldai'e. Hagi ana kevufina 24tauseni'a vahe mani'naze.
16 ౧౬ ఇంకా, ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం, జిఖ్రీ కొడుకు ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు, మయకా కొడుకు షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు,
Hagi Israeli vahetamimofoma mago'mago nagate'ma ugotama hu'za kegavama hu'naza vahetamina ama'ne, Zikri nemofo Eliezeri'a Rubeni nagate kva manigeno, Simioni nagatera Ma'aka nemofo Sefataia kva mani'ne.
17 ౧౭ కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.
Kemueli nemofo Hasabia Livae naga'mofontera kva manino kegava huzmantegeno, Aroni naga'mofontera Sadoki kva manino kegava huzmante'ne.
18 ౧౮ దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు. మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు,
Hagi Deviti negana Elihu Juda nagamofo kva manigeno, Maekoli nemofo Omri Isaka naga kva mani'ne.
19 ౧౯ ఓబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు. అజ్రీయేలు కొడుకు యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు.
Hagi Obadaia nemofo Ismaia Zebuluni nagate kva mani'geno, Azerieli nemofo Jeremoti Naftali nagate kva manino kegava huzmante'ne.
20 ౨౦ అజజ్యాహు కొడుకు హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు. మనష్షే అర్థగోత్రం వాళ్లకు పెదాయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు.
Hagi Azazaia nemofo Hosea Efraemi nagate kva manigeno, Manase nagama amunompinti'ma refkoma hu'nea nagara Pedaia nemofo Joeli kvazmia mani'ne.
21 ౨౧ గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రం వాళ్లకు జెకర్యా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు. బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహశీయేలు అధిపతిగా ఉన్నాడు.
Hagi Zekaraia nemofo Ido Manase naga'ma amu'nompintima refko hu'za Giliatima nemaniza nagara kegava huzmante'ne. Hagi Ja'asieli nemofo Abna Benzameni nagamofo kva mani'ne.
22 ౨౨ దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.
Hagi Jerohamu nemofo Azareli Dani naga kva mani'ne. Hagi ama'i Israeli vahe'mokizmima ugota huzmante'naza vahetami mani'naze.
23 ౨౩ ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.
Hagi kafu'amo'ma 20reti'ma erami'nea vahera Deviti'a ohampri'ne. Na'ankure Ra Anumzamo'a huvempa huno Israeli vahera azeri rama'a hanugeno monafi ofugna hugahie, huno hu'ne.
24 ౨౪ ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.
Hagi Zeruia nemofo Joapu'a agafa huno vahera hampri'neanagi, ana eri'zana eri vagaore'ne. Hagi e'i ana zankura Anumzamo'a Israeli vahera tusi arimpa ahezmante'ne. E'ina higeno anama hampria nambana kini ne' Deviti'ma eri'zama eri'nea agenkema krente'nea avontafepina kre onte'naze.
25 ౨౫ రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావెతు నియామకం జరిగింది. అయితే పొలాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది.
Hagi Adieli nemofo Azmaveti'a kini ne'mofo feno nontera kegava hu'ne. Hagi Uzia nemofo Jonatani'a Israeli agu'afima afete'ma me'nea feno nontaminte'ene, rankumatmimpi me'nea feno nontaminte'ene, neone kumatmimpima me'nea feno nontaminte'ene, zaza nontaminte'ene kegava hu'ne.
26 ౨౬ పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది.
Kalubi nemofo Ezri hoza eri'zama eri vahetera kegava huzmante'ne.
27 ౨౭ ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.
Hagi waini hozaramintera Rama kumateti ne' Simei kegava hu'ne. Hagi nomofo agu'afima keri asentene'za wainima vasagenentaza nontera, Sefamu kumateti ne' Zabdi kegava hu'ne.
28 ౨౮ షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్‌ హనాను నియామకం జరిగింది. నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది.
Hagi agupofima me'nea olivi zafaraminte'ene, sikamo zafaramintera Gederi kumateti ne' Ba'al-Hanani kegava hu'ne. Hagi Joasi olivi masavema ante nontera kegava hu'ne.
29 ౨౯ షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి, లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది.
Hagi Saroni kumateti ne' Sitrai Saroni agupofi bulimakao afutamintera kegava hu'ne. Hagi mago'a agupofima mani'nea bulimakao afutamintera Adlai nemofo Safati kegava hu'ne.
30 ౩౦ ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.
Hagi Ismaeli nagapinti ne' Obili maka kemoli afutamintera kegava hu'ne. Hagi Meronoti kumateti ne' Jedeia donki afutamintera kegava hu'ne.
31 ౩౧ గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.
Hagi Hagri nagapinti ne' Jazizi maka sipisipi afutamintera kegava hu'ne. E'i ama ana maka vahera Kini ne' Deviti fenonte'ma kegavama hutere hu'naza vahetami mani'naze.
32 ౩౨ దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు. హక్మోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు.
Hagi Devitina anenta nafa'amo Jonatani'a maka avoma kre'zana antahi ani' hu'neankino, agra knare antahi'zama Devitima ami' nera mani'ne. Hagi kini ne'mofo ne' mofavreramima rempi huzami nera Hakmoni nemofo Jehieli mani'ne.
33 ౩౩ అహీతోపెలు రాజుకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజుకు అంతరంగిక సలహాదారు.
Hagi Ahitofeli'a kini ne'mofoma knare antahintahima nemia ne' mani'ne. Hagi Aka nagapinti ne' Husai'a kini ne'mofo avate rone'a mani'ne.
34 ౩౪ అహీతోపెలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబ్యాతారు మంత్రులయ్యారు. రాజు సేనకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.
Hagi Ahitofeli'ma frigeno'a, Benaia nemofo Jehoiata'ene Abiatake agri nona eri'na'e. Hagi Joapu maka sondia vahetamina kegava hu'ne.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 27 >