< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 24 >

1 అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
و اين است فرقه هاي بني هارون: پسران هارون، ناداب و اَبِيهُو و اَلِعازار و ايتامار.۱
2 నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.
و ناداب و اَبِيهُو قبل از پدر خود مُردند و پسري نداشتند، پس اَلِعازار و ايتامار به کهانت پرداختند.۲
3 దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.
و داود با صادوق که از بني اَلِعازار بود و اَخِيمَلَک که از بني ايتامار بود،۳
4 వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.
و از پسران اَلِعازار مرداني که قابل رياست بودند، زياده از بني ايتامار يافت شدند. پس شانزده رئيس خاندان آبا از بني اَلِعازار و هشت رئيس خاندان آبا از بني ايتامار معين ايشان را بر حسب وکالت ايشان بر خدمت ايشان تقسيم کردند.۴
5 ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.
پس اينان با آنان به حسب قرعه معين شدند زيرا که رؤساي قدس و رؤساي خانه خدا هم از بني اَلِعازار و هم از بني ايتامار بودند.۵
6 లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
و شَمَعيا ابن نَتَنئيل کاتب که از بني لاوي بود، اسمهاي ايشان را به حضور پادشاه و سروران و صادوق کاهن و اَخِيمَلَک بن ابياتار و رؤساي خاندان آباي کاهنان و لاويان نوشت و يک خاندان آبا به جهت اَلِعازار گرفته شد و يک به جهت ايتامار گرفته شد.۶
7 మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,
و قرعه اول براي يهُوَياريب بيرون آمد و دوم براي يدَعيا،۷
8 మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,
و سوم براي حاريم و چهارم براي سعُوريم،۸
9 అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,
و پنجم براي مَلکيه و ششم براي مَيامين،۹
10 ౧౦ ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,
و هفتم براي هَقُّوص و هشتم براي اَبِيا،۱۰
11 ౧౧ తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
و نهم براي يشُوع و دهم براي شَکُنيا،۱۱
12 ౧౨ పండ్రెండోది యాకీముకు,
و يازدهم براي اَلياشيب و دوازدهم براي ياقيم،۱۲
13 ౧౩ పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,
و سيزدهم براي حُفَّه و چهاردهم براي يشَبآب،۱۳
14 ౧౪ పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,
و پانزدهم براي بِلجَه و شانزدهم براي اِمير،۱۴
15 ౧౫ పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,
و هفدهم براي حيزير و هجدهم براي هِفصيص،۱۵
16 ౧౬ పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,
و نوزدهم براي فَتَحيا و بيستم براي يحَزقيئيل،۱۶
17 ౧౭ ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,
و بيست و يکم براي ياکين و بيست و دوم براي جامُول،۱۷
18 ౧౮ ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి.
و بيست و سوم براي دَلايا و بيست و چهارم براي مَعَزيا.۱۸
19 ౧౯ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.
پس اين است وظيفه ها و خدمت هاي ايشان به جهت داخل شدن در خانه خداوند بر حسب قانوني که به واسطه پدر ايشان هارون موافق فرمان يهُوَه خداي اسرائيل به ايشان داده شد.۱۹
20 ౨౦ మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,
و اما درباره بقيه بني لاوي، از بني عَمرام شُوبائيل و از بني شوبائيل يحَديا.۲۰
21 ౨౧ రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,
و اما رَحَبيا. از بني رَحَبيا يشِياي رئيس،۲۱
22 ౨౨ ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,
و از بني يصهار شَلُومُوت و از بني شَلُومُوت يحَت.۲۲
23 ౨౩ హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.
و از بني حَبرُون يريا و دومين اَمَريا و سومين يحزيئيل و چهارمين يقمَعام.۲۳
24 ౨౪ ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
از بني عُزّيئيل ميکا و از بني ميکا شامير.۲۴
25 ౨౫ ఇష్షీయా సంతానంలో జెకర్యా,
و برادر ميکا يشِيا و از بني يشِيا زکريا.۲۵
26 ౨౬ మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.
و از بني مَراري مَحلي و مُوشِي و پسرِ يعزيابَنُو.۲۶
27 ౨౭ యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
و از بني مَراري پسران يعزيا بَنُو و شُوهَم و زَکُّور و عِبري.۲۷
28 ౨౮ మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.
و پسر مَحلي اَلِعازار و او را فرزندي نَبُود.۲۸
29 ౨౯ కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.
و اما قَيس، از بني قَيس يرَحميئيل،۲۹
30 ౩౦ మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.
و از بني مُوشِي مَحلي و عادَر و يريمُوت. اينان بر حسب خاندان آباي ايشان بني لاوي مي باشند.۳۰
31 ౩౧ రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.
ايشان نيز مثل برادران خود بني هارون به حضور داود پادشاه و صادوق و اَخِيمَلَک و رؤساي آباي کَهَنَه و لاويان قرعه انداختند يعني خاندانهاي آباي برادر بزرگتر برابر خاندانهاي کوچکتر او بودند.۳۱

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 24 >