< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 24 >
1 ౧ అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
१अहरोनाच्या वंशजांची वर्गवारी नादाब, अबीहू एलाजार व इथामार.
2 ౨ నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.
२पण नादाब आणि अबीहू हे दोघे आपल्या पित्याच्या आधीच मरण पावले. त्यांना अपत्य ही नव्हती. तेव्हा एलाजार आणि इथामार हेच याजक झाले.
3 ౩ దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.
३दावीद व एलाजाराच्या वंशातला सादोक आणि इथामार यांच्या वंशातला अहीमलेख यांनी त्यांच्या नेमणुकीप्रमाणे त्यांच्या सेवेसाठी त्यांची वाटणी केली.
4 ౪ వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.
४इथामारापेक्षा एलाजाराच्या वंशजात वडीलधारी प्रमुख मंडळी अधिक निघाली. एलाजाराच्या वंशजात सोळा जण तर इथामारच्या वंशजात आठ जण प्रमुख होते.
5 ౫ ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.
५दोन्ही वंशजातील पुरुषांची निवड चिठ्ठ्या टाकून केली. काहीजणांना पवित्रस्थानाच्या देखभालीचे अधिकारी आणि देवाकडचे अधिकारी असे केले. हे सर्वजण एलाजार आणि इथामार यांच्या वंशजातलेच होते.
6 ౬ లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
६आणि लेव्यांतला लेखक, नथनेलाचा पुत्र शमाया याने राजा व अधिकारी, सादोक याजक, अब्याथारचा पुत्र अहीमलेख, याजक आणि लेवी यांच्या घराण्यातील प्रमुख ह्याच्यासमोर त्यांची नावे लिहिली. चिठ्ठ्या टाकून एलाजाराच्या कुळाच्या वंशातून निवड करण्यात येई आणि पुढच्या वेळेला इथामार यांच्या कुळातील वंशातून निवड करण्यात येई.
7 ౭ మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,
७पहिली चिठ्ठी यहोयारीबाची निघाली. दुसरी यदायाची,
8 ౮ మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,
८तिसरी हारीमाची, चौथी सोरीमाची,
9 ౯ అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,
९पाचवी मल्कीयाची, सहावी मयामिनाची,
10 ౧౦ ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,
१०सातवी हक्कोसाची, आठवी अबीयाची.
11 ౧౧ తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
११नववी येशूवाची, दहावी शकन्याची,
12 ౧౨ పండ్రెండోది యాకీముకు,
१२अकरावी एल्याशिबाची, बारावी याकीमाची
13 ౧౩ పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,
१३तेरावी हुप्पाची, चवदावी येशेबाबाची,
14 ౧౪ పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,
१४पंधरावी बिल्गाची, सोळावी इम्मेराची.
15 ౧౫ పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,
१५सतरावी हेजीराची, अठरावी हप्पिसेसाची,
16 ౧౬ పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,
१६एकोणीसावी पथह्याची, विसावी यहेजकेलाची,
17 ౧౭ ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,
१७एकविसावी याखीनाची, बाविसावी गामूलची,
18 ౧౮ ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి.
१८तेविसावी दलायाची आणि चोविसावी माज्याची.
19 ౧౯ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.
१९परमेश्वराच्या मंदिरात सेवा करण्यासाठी या सर्वांची क्रमाने नेमणूक करण्यात आली. इस्राएलचा परमेश्वर देव याने अहरोनाला जे नियम घालून दिले त्याच नियमांचे पालन त्यांनी मंदिराच्या सेवेसाठी केले.
20 ౨౦ మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,
२०लेवीच्या इतर वंशजांची नावे खालीलप्रमाणे: अम्रामच्या वंशातील शूबाएल; शूबाएलचे वंशज: यहदाया.
21 ౨౧ రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,
२१रहब्याचे वंशज: रहब्याच्या वंशात इश्शिया मुख्य.
22 ౨౨ ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,
२२इसहार वंशजापैकी: शलोमोथ. शलोमोथाच्या वंशजातून: यहथ.
23 ౨౩ హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.
२३हेब्रोनचा थोरला पुत्र यरीया, हेब्रोनचा दुसरा पुत्र अमऱ्या, यहजिएल तिसरा आणि चौथा यकमाम.
24 ౨౪ ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
२४उज्जियेलाच्या वंशातला मीखा. मीखाच्या वंशातला शामीर.
25 ౨౫ ఇష్షీయా సంతానంలో జెకర్యా,
२५मीखाचा भाऊ इश्शिया, इश्शियाचा पुत्र जखऱ्या.
26 ౨౬ మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.
२६मरारीचे वंशज: महली आणि मूशी. याजीयाचा वंशज बनो.
27 ౨౭ యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
२७मरारीचे वंशज: याजीयापासून बनो व शोहम व जक्कूर व इब्री.
28 ౨౮ మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.
२८महलीपासून: एलाजार हा महलीचा पुत्र. याला अपत्य नव्हते.
29 ౨౯ కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.
२९कीशाचे वंशज: यरहमेल.
30 ౩౦ మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.
३०महली, एदर आणि यरीमोथ हे मूशीचे पुत्र. हे लेवी होते, त्यांच्या घराण्याप्रमाणे त्यांची यादी करण्यात आली.
31 ౩౧ రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.
३१राजा दावीद, सादोक, अहीमलेख आणि याजक व लेवी घराण्यातील प्रमुख यांच्यासमोर त्यांनी चिठ्ठ्या टाकल्या. घराण्यातील श्रेष्ठ मुलाने कनिष्ठाबरोबर चिठ्ठ्या टाकल्या. त्यांनी अहरोन याच्या वंशजाप्रमाणेच चिठ्ठ्या टाकल्या.