< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 20 >
1 ౧ తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు.
[戰敗阿孟]一年復始,正當諸王出征的季節,約阿布統率精兵,蹂躪了阿孟子民的地方,然後去包圍了辣巴,當時達味留在那耶路撒冷。約阿布攻陷了辣巴,加以破壞。
2 ౨ దావీదు వచ్చి, వాళ్ళ రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకున్నాడు. దాని బరువు 34 కిలోగ్రాములు. అందులో విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. దాన్ని దావీదు ధరించాడు. ఇంకా అతడు ఎంతో విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణంలో నుంచి తీసుకుపోయాడు.
達味從米耳公的頭上,取下他的冠冕來,發現有一點「塔冷通」重的金子,上面還有一塊寶石。達味將這塊寶石戴在自己頭上;並由城中運走了大批的戰利品。
3 ౩ దాని ప్రజలను అతడు బయటకు తీసుకొచ్చి, వాళ్ళతో రంపాలతో, ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో బలవంతంగా పని చేయించాడు. ఈ విధంగా అతడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ చేశాడు. తరువాత దావీదూ, సైన్యమూ, యెరూషలేముకు తిరిగి వచ్చారు.
至於城內的居民,達味將他們帶走,叫他們拉鋸、持鎚、操斧工作。達味如此對待了阿孟子民所有的城市,然後率領全軍回了耶路撒冷。[三敗培肋舍特]
4 ౪ అటు తరువాత గెజెరులో ఉన్న ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడు సిప్పయి అనే ఒకణ్ణి హతం చేశాడు. అందువల్ల ఫిలిష్తీయులు లొంగిపోయారు.
這些事以後,右與培肋舍特人在革則爾發生了戰事。胡沙人息貝開擊殺了辣法巨人的後裔息派,他們便投降歸順了。
5 ౫ మళ్ళీ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు యాయీరు కొడుకు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపని చేసేవాడి అడ్డకర్ర అంత పెద్దది.
以後,又與培肋舍特交戰,雅依爾的兒子厄耳哈難擊殺了加特人哥肋雅的兄弟拉赫米。這人的長矛粗如織布機的橫軸。
6 ౬ మళ్ళీ గాతులో యుద్ధం జరిగింది. చాలా పొడవుగాగా ఉన్న వాడొకడు అక్కడ ఉన్నాడు. అతని చేతులకూ కాళ్ళకు, ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతతికి చెందిన వాడు.
此後,在加特又起了戰事,在那裏有一巨人,兩手各有六指,兩足亦各有六趾,共有二十四個,也是辣法巨人的後裔。
7 ౭ అతడు ఇశ్రాయేలీయులను దూషించగా దావీదు సోదరుడు షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాడు.
由於他辱罵了以色列,達味的兄弟史默亞的兒子約納堂將他殺死:
8 ౮ గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారైన వీరు దావీదు చేత, అతని సేవకుల చేత హతమయ్యారు.
這些人全是加特城辣法巨人的子孫,都喪身在達味和他的臣僕手裏。