< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 19 >

1 ఇది జరిగిన తరువాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోగా అతని కొడుకు అతని స్థానంలో రాజయ్యాడు.
Dopo, morì Nacas re degli Ammoniti; al suo posto divenne re suo figlio.
2 అప్పుడు దావీదు “హానూను తండ్రి నాహాషు నా పట్ల దయ చూపించాడు కాబట్టి నేను అతని కొడుకు పట్ల దయ చూపిస్తాను” అనుకుని, అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించడానికి దూతలను పంపాడు. దావీదు సేవకులు హానూనును పరామర్శించడానికి అమ్మోను దేశానికి వచ్చినప్పుడు,
Davide disse: «Userò benevolenza con Canun figlio di Nacas, perché anche suo padre è stato benevolo con me». Davide mandò messaggeri per consolarlo della morte di suo padre. I ministri di Davide andarono nella regione degli Ammoniti da Canun per consolarlo.
3 అమ్మోనీయుల అధిపతులు హానూనుతో “నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి దావీదు దూతలను పంపడం నీ తండ్రిని ఘనపరచడానికే అనుకుంటున్నావా? దేశాన్ని జాగ్రత్తగా గమనించి, దాన్ని నాశనం చెయ్యడానికే అతని సేవకులు నీ దగ్గరికి వచ్చారు” అని చెప్పారు.
Ma i capi degli Ammoniti dissero a Canun: «Forse Davide intende onorare tuo padre ai tuoi occhi mandandoti consolatori? Questi suoi ministri non sono venuti forse da te per spiare, per informarsi e per esplorare la regione?».
4 హానూను దావీదు సేవకులను పట్టుకుని, వాళ్ళ జుట్టు గొరిగించి, వాళ్ళ బట్టలు మొల కంటే కిందకు దిగకుండా సగానికి కత్తిరించి వాళ్ళను పంపేశాడు.
Canun allora prese i ministri di Davide, li fece radere, tagliò a metà le loro vesti fino alle natiche e li rimandò.
5 ఆ మనుషులు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి వాళ్ళను గూర్చిన వార్త దావీదుకు తెలియజేశారు. వాళ్ళు ఎంతో సిగ్గు పాలై ఉన్నారు గనుక రాజు వాళ్లకు ఎదురుగా మనుషులను పంపి “మీ గడ్డాలు పెరిగే వరకూ మీరు యెరికోలో ఉండి, తరువాత రండి” అని సందేశం పంపాడు.
Alcuni vennero a riferire a Davide la sorte di quegli uomini. Poiché costoro si vergognavano moltissimo, il re mandò ad incontrarli con questo messaggio: «Rimanete in Gerico finché non sia cresciuta la vostra barba; allora ritornerete».
6 అమ్మోనీయులు తమ పట్ల దావీదుకు అసహ్యం కలిగేలా చేసుకున్నాం అని గ్రహించారు. హానూనూ, అమ్మోనీయులూ రెండు వేల మణుగుల వెండి ఇచ్చి అరామ్నహరయీము నుంచి, ఆరాము మయకా నుంచి, సోబా నుంచి, రథాలను, గుర్రపు రౌతులను కిరాయికి తెచ్చుకున్నారు.
Gli Ammoniti, accortisi di essersi inimicati Davide, mandarono, essi e Canun, mille talenti d'argento per assoldare carri e cavalieri nel paese dei due fiumi, in Aram Maaca e in Zoba.
7 కిరాయి చెల్లించి మయకా రాజును, అతని సైన్యాన్నీ ముప్ఫై రెండువేల రథాలను కుదుర్చుకున్నారు. వీళ్ళు వచ్చి మేదెబా ఎదుట దిగారు. అమ్మోనీయులు తమ పట్టణాల్లో నుంచి యుద్ధం చెయ్యడానికి వచ్చారు.
Assoldarono trentaduemila carri e il re di Maaca con le sue truppe. Questi vennero e si accamparono di fronte a Màdaba; frattanto gli Ammoniti si erano radunati dalle loro città e si erano mossi per la guerra.
8 దావీదు ఈ సంగతి విని యోవాబునూ, సైన్యంలో ఉన్న పరాక్రమశాలులు అందరినీ పంపాడు.
Quando Davide lo venne a sapere, mandò Ioab con tutto il gruppo dei prodi.
9 అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు ద్వారం దగ్గర యుద్ధపంక్తులు తీర్చారు. వచ్చిన రాజులు ప్రత్యేకంగా బయట ఉన్న భూమిలో యుద్ధానికి సిద్ధంగా నిలిచారు.
Gli Ammoniti uscirono per disporsi a battaglia davanti alla città mentre i re alleati stavano da parte nella campagna.
10 ౧౦ తాను రెండు సైన్యాల మధ్యలో చిక్కి ఉండడం చూసి, యోవాబు ఇశ్రాయేలీయుల్లో ఉన్న శ్రేష్ఠుల్లో పరాక్రమశాలులను సిద్ధం చేసుకుని, అరామీయులకు ఎదురుగా వాళ్ళను బారులు తీర్చి,
Ioab si accorse che la battaglia gli si profilava di fronte e alle spalle. Egli scelse i migliori di Israele e li schierò contro gli Aramei.
11 ౧౧ మిగిలిన సైన్యాన్ని తన సోదరుడు అబీషైకి అప్పగించి, అమ్మోనీయులకు ఎదురుగా మొహరింప జేశాడు.
Affidò il resto dell'esercito ad Abisài suo fratello che lo schierò contro gli Ammoniti.
12 ౧౨ “అరామీయుల బలగాలను ఎదిరించి నేను నిలబడలేకపోతే, నువ్వు నాకు సాయం చెయ్యాలి. అమ్మోనీయుల బలానికి నువ్వు నిలబడలేకపోతే, నేను నీకు సాయం చేస్తాను.
E gli disse: «Se gli Aramei prevarranno su di me, mi verrai in aiuto; se invece gli Ammoniti prevarranno su di te, io ti verrò in aiuto.
13 ౧౩ ధైర్యంగా ఉండు. మనం మన ప్రజల నిమిత్తమూ మన దేవుని పట్టణాల నిమిత్తమూ శౌర్యం చూపుదాం. యెహోవా తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక” అన్నాడు.
Coraggio, dimostriamoci forti per il nostro popolo e per le città del nostro Dio; il Signore faccia ciò che gli piacerà».
14 ౧౪ ఆ విధంగా యోవాబు అతనితో కూడ ఉన్న సైన్యమూ, అరామీయులతో యుద్ధం చేయడానికి కదిలినప్పుడు, వాళ్ళు అతని ముందు నిలవలేక వెనక్కి తిరిగి పారిపోయారు.
Ioab con i suoi mosse verso gli Aramei per combatterli, ma essi fuggirono davanti a lui.
15 ౧౫ అరామీయులు పారిపోవడం అమ్మోనీయులు చూసినప్పుడు వాళ్ళు కూడా యోవాబు సోదరుడు అబీషై ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి పట్టణంలోకి పారిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
Anche gli Ammoniti, visto che gli Aramei si erano dati alla fuga, fuggirono di fronte ad Abisài fratello di Ioab, rientrando in città. Ioab allora tornò in Gerusalemme.
16 ౧౬ తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని అరామీయులు గ్రహించి దూతలను పంపి, నది అవతల ఉన్న అరామీయులను పిలిపించుకున్నారు. హదరెజెరు సైన్యాధిపతి షోపకు వాళ్లకు నాయకుడయ్యాడు.
Gli Aramei, visto che erano stati battuti dagli Israeliti, mandarono messaggeri e fecero venire gli Aramei d'Oltrefiume; li comandava Sofach, capo dell'esercito di Hadad-Ezer.
17 ౧౭ దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను దాటి, వాళ్లకు ఎదురుగా సైన్యాలను సిద్ధం చేశాడు. దావీదు అరామీయులకు ఎదురుగా సైన్యాలను బారులు తీర్చి యుద్ధం చేశాడు.
Quando ciò fu riferito a Davide, egli radunò tutto Israele e attraversò il Giordano. Li raggiunse e si schierò davanti a loro; Davide si dispose per la battaglia contro gli Aramei, che l'attaccarono.
18 ౧౮ అరామీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక, వెనుదిరిగి పారిపోయారు. దావీదు అరామీయుల్లో ఏడువేల రథికులనూ, నలభై వేల మంది సైనికులనూ హతం చేసి వారి సేనాని షోపకును చంపాడు.
Gli Aramei fuggirono di fronte agli Israeliti. Davide uccise, degli Aramei, settemila cavalieri e quarantamila fanti; uccise anche Sofach capo dell'esercito.
19 ౧౯ తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని హదరెజెరు సేవకులు గ్రహించి దావీదుతో సంధి చేసుకుని అతనికి దాసోహమయ్యారు. అప్పటినుంచి అరామీయులు అమ్మోనీయులకు సాయం చెయ్యడానికి అంగీకరించ లేదు.
Gli uomini di Hadad-Ezer, visto che erano stati battuti dagli Israeliti, fecero la pace con Davide e si sottomisero a lui. Gli Aramei non vollero più recare aiuto agli Ammoniti.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 19 >