< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 17 >

1 దావీదు తన ఇంటికి వెళ్లి సేదదీరిన తరువాత ప్రవక్త అయిన నాతానును పిలిపించి అతనితో “నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను. కాని, యెహోవా నిబంధన మందసం మాత్రం ఒక గుడారంలో ఉంది” అని చెప్పాడు.
А кад Давид сеђаше код куће своје, рече Давид Натану пророку: Гле, ја стојим у кући од кедровог дрвета, а ковчег завета Господњег под завесима.
2 అప్పుడు నాతాను “దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నదంతా చెయ్యి” అని దావీదుతో అన్నాడు.
А Натан рече Давиду: Шта ти је год у срцу, чини, јер је Бог с тобом.
3 ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
Али ону ноћ дође реч Божја Натану говорећи:
4 “నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు. యెహోవా చెప్పేదేమంటే, నా నివాసం కోసం ఒక ఆలయాన్ని నువ్వు కట్టించకూడదు.
Иди и реци Давиду слузи мом: Овако вели Господ: Ти ми нећеш сазидати куће да у њој наставам.
5 ఇశ్రాయేలీయులను రప్పించిన రోజు నుంచి ఈ రోజు వరకూ నేను ఒక ఇంట్లో నివాసం చెయ్యకుండా, డేరాలో, ప్రత్యక్ష గుడారంలో నివాసం చేశాను.
Кад нисам наставао у кући откад изведох Израиља до данас, него сам ишао од шатора до шатора и од наслона до наслона,
6 నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచారం చేసిన కాలంలో, మీరు నాకోసం దేవదారు మానులతో ఆలయం ఎందుకు కట్టలేదు? అని నా ప్రజలను కాయడానికి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాటైనా అన్నానా?
Куда сам год ходио са свим Израиљем, јесам ли једну реч рекао коме између судија Израиљевих којима заповедах да пасу народ мој, и казао: Зашто ми не начините кућу од кедра?
7 కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఏం చెప్పాలంటే, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, గొర్రెల వెంట తిరుగుతున్న నిన్ను గొర్రెల మంద నుంచి తీసుకు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా చేశాను.
Овако, дакле, реци слузи мом Давиду: Овако вели Господ над војскама: Ја те узех од тора, од оваца, да будеш вођ народу мом Израиљу.
8 నువ్వు వెళ్లిన ప్రతిచోటా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవాళ్ళను నీ ముందు నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలో ఘనులకు ఉన్న పేరులాంటి పేరు నీకు ఉండేలా చేస్తాను.
И бејах с тобом куда си год ишао, и истребих све непријатеље твоје испред тебе, и стекох ти име као што је име великих људи на земљи.
9 ఇంకా నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం ఒక స్థలం ఏర్పాటు చేసి, వాళ్ళను అక్కడ నాటుతాను. వాళ్ళు ఇంక తిరుగులాడకుండా తమ స్థానంలో కాపురం ఉంటారు. పూర్వం జరిగినట్టూ, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకుని జరుగుతూ వచ్చినట్టూ, దుష్టులు వాళ్ళను ఇక బాధ పెట్టరు.
И одредићу место народу свом Израиљу, и посадићу га, те ће наставати у свом месту, и неће се више претресати; нити ће им више досађивати неправедници као пре,
10 ౧౦ నీ పగవాళ్ళందరినీ నేను అణచివేస్తాను. అంతమాత్రమే కాదు, యెహోవానైన నేను నీ తరువాత నీ సంతానమే పరిపాలిస్తుందని నీకు తెలియజేశాను.
И од оног дана када сам поставио судије над народом својим Израиљем; и покорих све непријатеље твоје; него ти јављам да ће ти Господ сазидати кућу.
11 ౧౧ నీ జీవితకాలం ముగిసి నీ పూర్వీకుల దగ్గరికి నువ్వు చేరే సమయానికి, నీ తరువాత నీ కొడుకుల వల్ల కలిగే నీ సంతానాన్ని లేపుతాను. వాళ్ళల్లో ఒకరి ద్వారా నేను రాజ్య స్థాపనచేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
И кад се наврше дани твоји да отидеш к оцима својим, подигнућу семе твоје након тебе, које ће бити између синова твојих, и утврдићу царство његово.
12 ౧౨ అతడు నాకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని సింహాసనాన్ని నేను శాశ్వతమైనదిగా చేస్తాను.
Они ће ми сазидати дом, и утврдићу престо његов довека.
13 ౧౩ నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నీ మీద పరిపాలించిన సౌలు దగ్గరనుండి తీసి వేసినట్టుగా అతని దగ్గరనుండి నా నిబంధన విశ్వాస్యత తీసివేయను.
Ја ћу му бити Отац, и он ће ми бити син; а милости своје нећу уклонити од њега као што сам уклонио од оног који беше пре тебе.
14 ౧౪ నా మందిరంలో, నా రాజ్యంలో, నేను నిత్యం అతన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉంటుంది అని అతనికి తెలియచెయ్యి.”
Него ћу га утврдити у дому свом и у царству свом довека, и престо ће његов стајати довека.
15 ౧౫ నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు.
По свим овим речима и по свој овој утвари каза Натан Давиду.
16 ౧౬ రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని ఈ విధంగా మనవి చేశాడు. “దేవా యెహోవా, నువ్వు నన్ను ఇలాటి ఉన్నత స్థితికి తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఏమాత్రం?
Тада дође цар Давид и стаде пред Господом, и рече: Ко сам ја, Господе Боже, и шта је дом мој, те си ме довео довде?
17 ౧౭ దేవా, ఇది నీ దృష్టిలో చిన్న విషయమే. దేవా యెహోవా, నువ్వు దూర భవిషత్తులో ఉండబోయే నీ సేవకుని సంతతినిగూర్చి చెప్పి, ముందు తరాలను నాకు చూపించావు.
И то ти се чини мало, Боже, него си говорио и за дом слуге свог на дуго времена, и постарао си се за ту славу законом човечијим, Господе Боже.
18 ౧౮ నీ దాసుడైన నాకు కలుగబోయే ఘనతను గూర్చి దావీదు అనే నీ దాసుడనైన నేను నీతో ఇంకా ఏమని మనవి చెయ్యను? నువ్వు నీ దాసునికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చావు.
Шта ће још Давид да Ти говори о части слуге Твог, кад Ти знаш слугу свог?
19 ౧౯ యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం ఈ మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యం చేశావు.
Господе, слуге свог ради и по срцу свом чиниш сву ову велику ствар, обзнањујући све ове велике ствари.
20 ౨౦ యెహోవా, మేము మా చెవులతో విన్నదంతా నిజం. నీలాంటివాడు ఎవ్వడూ లేడు. నువ్వు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.
Господе, нема таквог какав си Ти, и нема Бога осим Тебе, по свему сто чусмо својим ушима.
21 ౨౧ నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు.
Јер који је народ на земљи као Твој народ Израиљ? Ради кога је Бог ишао да га искупи да му буде народ, и да стече себи име великим и страшним делима изгонећи народе испред народа свог, који си искупио из Мисира
22 ౨౨ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిత్యం నీకు ప్రజలయ్యేలా నువ్వు ఆ విధంగా చేశావు. యెహోవావైన నువ్వు వాళ్లకు దేవుడివయ్యావు.
Јер си учинио народ свој Израиља својим народом довека; а Ти си им, Господе, Бог.
23 ౨౩ యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చీ, అతని సంతతిని గూర్చీ నువ్వు చెప్పిన మాట నిత్యం స్థిరమౌతుంది గాక.
И тако, Господе, реч коју си обрекао слузи свом и дому његовом нека буде тврда довека, и учини како си рекао.
24 ౨౪ ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరుకు ఎన్నటికీ ఘనత వచ్చేలా నువ్వు చెప్పిన మాట నిశ్చయంగా స్థిరమౌతుంది గాక. ఇంకా, నీ దాసుడైన దావీదు సంతతి నీ సన్నిధిలో స్థిరపడు గాక.
Нека буде тврда, да се велича име Твоје довека и да се говори: Господ над војскама, Бог Израиљев јесте Бог над Израиљем, и дом Давида слуге Твог нека стоји тврдо пред Тобом.
25 ౨౫ దేవా, నీకు సంతానం ఇస్తానని నీ దాసునికి నువ్వు తెలియచేశావు గనుక నీ సన్నిధిలో విన్నపం చెయ్యడానికి నీ దాసునికి ధైర్యం కలిగింది.
Јер си Ти, Боже мој, јавио слузи свом да ћеш му сазидати дом, зато се слуга Твој усуди да Ти се помоли.
26 ౨౬ యెహోవా, నువ్వు దేవుడవై ఉండి, నీ దాసునికి ఈ మేలు దయచేస్తానని చెప్పావు.
Тако Господе, Ти си Бог, и обрекао си слузи свом то добро.
27 ౨౭ ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధిలో ఉండేలా దాన్ని ఆశీర్వదించడానికి నీకు ఇష్టం అయింది. యెహోవా, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది.”
Буди дакле вољан и благослови дом слуге свог да буде довека пред Тобом; јер кад Ти, Господе, благословиш, биће благословен довека.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 17 >