< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 15 >
1 ౧ దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు.
Onda je David sazidao dvore u Davidovu gradu, pripravio mjesto za Kovčeg Božji i razapeo mu Šator.
2 ౨ అప్పుడు దావీదు “మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు” అని ఆజ్ఞాపించాడు.
Potom je rekao David: “Ne smije nositi Kovčeg Božji nitko osim levita, jer je njih izabrao Jahve da nose Kovčeg Jahvin i da mu služe dovijeka.”
3 ౩ అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.
David je sakupio sav Izrael u Jeruzalem da prenesu Kovčeg Jahvin gore na njegovo mjesto koje mu bijaše pripravio.
4 ౪ అహరోను సంతతి వారిని, లేవీయులను,
Skupio je David i Aronove sinove i levite.
5 ౫ కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని,
Od Kehatovih sinova: kneza Uriela i sto dvadeset njegove braće;
6 ౬ మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని,
od Merarijevih sinova: kneza Asaju i dvjesta dvadeset njegove braće;
7 ౭ గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని,
od Geršomovih sinova: kneza Joela i sto trideset njegove braće.
8 ౮ ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని,
Od Elisafanovih sinova: kneza Šemaju i dvjesta njegove braće.
9 ౯ హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని,
Od Hebronovih sinova: kneza Eliela i osamdeset njegove braće;
10 ౧౦ ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.
od Uzielovih sinova: kneza Aminadaba i sto dvanaest njegove braće.
11 ౧౧ అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో
Tada David pozva svećenike Sadoka i Ebjatara i levite Uriela, Asaju, Joela, Šemaju, Eliela i Aminadaba,
12 ౧౨ “లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు.
pa im reče: “Vi ste glavari levitskih porodica; posvetite sebe i svoju braću da prenesete gore Kovčeg Jahve, Izraelova Boga, na mjesto koje sam mu pripravio.
13 ౧౩ ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి” అన్నాడు.
Jer nas je pobio Jahve, Bog naš, zato što prvi put vi niste bili nazočni i što ga nismo tražili onako kako je trebalo.”
14 ౧౪ అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు.
Posvetiše se tada svećenici i leviti da prenesu gore Kovčeg Jahve, Izraelova Boga.
15 ౧౫ తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.
Levitski su sinovi ponijeli Božji Kovčeg, na svojim ramenima, o motkama, kako je zapovjedio Mojsije po Jahvinoj riječi.
16 ౧౬ అప్పుడు దావీదు “మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి” అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు.
Tada David reče levitskim knezovima da između svoje braće postave pjevače s glazbalima, s harfama, citrama i cimbalima da se čuje i da gromko odjekuje radosno pjevanje.
17 ౧౭ కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరెక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కూషాయాహు కొడుకు ఏతాను,
Leviti su postavili Joelova sina Hemana, a od njegove braće Berekjina sina Asafa, i od njihove braće, Merarijevih sinova, Kušajina sina Etana.
18 ౧౮ వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.
S njima njihovu braću drugoga reda: Zahariju, sina Jaazielova, Šemiramota, Jehiela, Unija, Eliaba, Benaju, Maaseju, Matitju, Eliflehua, Mikneju, Obed Edoma i Jeiela, vratare.
19 ౧౯ వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయింది.
A pjevači, Heman, Asaf i Etan gromko su udarali u mjedene cimbale.
20 ౨౦ జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అనే వాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయింది.
A Zaharija, Uziel, Šemiramot, Jehiel, Uni, Eliab, Maaseja i Benaja u harfe s visokim zvucima;
21 ౨౧ ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.
a Matitja, Eliflehu, Mikneja, Obed Edom, Jeiel i Azazja u citre, u osminskoj pratnji.
22 ౨౨ లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు.
Kenanja, knez onih levita koji su nosili Kovčeg, upravljao je prenošenjem jer je bio vješt u tome.
23 ౨౩ బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా,
Berekja i Elkana bili su vratari kod Kovčega.
24 ౨౪ షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.
Šebanija, Jošafat, Netanel, Amasaj, Zaharija, Benaja i Eliezer, svećenici, trubili su u trube pred Božjim Kovčegom; Obed Edom i Jehija bili su vratari kod Kovčega.
25 ౨౫ దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనుంచి తీసుకు రావడానికి ఉత్సాహంతో వెళ్ళారు.
Tako je David s izraelskim starješinama i tisućnicima radosno išao prenoseći gore Kovčeg saveza Jahvina iz Obed-Edomove kuće.
26 ౨౬ యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.
Kad je Bog pomogao levitima koji su nosili Kovčeg saveza Jahvina, žrtvovali su sedam junaca i sedam ovnova.
27 ౨౭ దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు.
David bijaše ogrnut plaštem od tanka platna, a tako i svi leviti što su nosili Kovčeg, kao i pjevači i Kenanija koji je upravljao pjevačima. David je imao na sebi lanen oplećak.
28 ౨౮ ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.
Tako je sav Izrael prenosio gore Kovčeg saveza Jahvina, radosno kličući uz jeku rogova, truba i cimbala, igrajući uza zvuke harfe i citre.
29 ౨౯ కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.
Kad je Kovčeg saveza Jahvina ulazio u Davidov grad, Šaulova kći Mikala, gledajući s prozora, vidje kralja Davida kako skače i igra i prezre ga ona u svom srcu.