< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 14 >

1 తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు.
Hiram, rey de Tiro, envió mensajero a David, y maderas de cedro, y también albañiles y carpinteros, para edificarle una casa.
2 తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.
Y conoció David que Yahvé había confirmado su reinado sobre Israel, porque (Dios) había ensalzado su dignidad real por amor de Israel su pueblo.
3 తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు.
Tomó David otras mujeres en Jerusalén, y engendró más hijos e hijas.
4 యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
He aquí los nombres de los hijos que tuvo en Jerusalén: Samúa, Sobab, Natán, Salomón,
5 ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు,
Ibhar, Elisúa, Elpélet,
6 నోగహు, నెపెగు, యాఫీయ,
Noga, Náfeg, Jafía,
7 ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
Elisamá, Baaliadá y Elifélet.
8 దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.
Cuando los filisteos oyeron que David había sido ungido rey sobre Israel entero, todos los filisteos subieron en busca de David. Mas David lo supo y les salió al paso.
9 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.
Llegaron los filisteos y se extendieron en el valle de Refaím.
10 ౧౦ “ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు.
Entonces David consultó a Dios, preguntando: “¿Subiré contra los filisteos? ¿Los entregarás en mi mano?” Y Yahvé le respondió: “Sube, pues Yo los entregaré en tu mano”.
11 ౧౧ వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి “ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు” అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది.
Y subieron a Baal-Ferasim, donde David los derrotó. Dijo entonces David: “Dios ha quebrantado a mis enemigos por mi mano, como las aguas rompen (los diques) y por eso aquel lugar se llamó Baal-Ferasim.”
12 ౧౨ ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
Dejaron allí sus dioses, que por orden de David fueron arrojados al fuego.
13 ౧౩ ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.
Otra vez invadieron los filisteos el valle,
14 ౧౪ దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు “నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు.
y David volvió a consultar a Dios, el cual le contestó: “No subas tras de ellos; aléjate de ellos, para acometerlos desde el lado de las balsameras.
15 ౧౫ కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో” అని చెప్పాడు.
Y cuando oigas el ruido de pasos por las copas de las balsameras, saldrás a la batalla, porque Dios va marchando delante de ti para derrotar el campamento de los filisteos.”
16 ౧౬ దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.
David hizo como le había mandado Dios; y derrotaron el campamento de los filisteos desde Gabaón hasta Géser.
17 ౧౭ కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.
La fama de David se extendió sobre todos los países, pues Yahvé le hizo temible para todos los gentiles.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 14 >