< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 14 >
1 ౧ తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు.
Sur padşahı Xiram Davudun yanına qasidlər və ona saray tikmək üçün sidr ağacları, bənnalar və dülgərlər göndərdi.
2 ౨ తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.
Onda Davud başa düşdü ki, Rəbb onu İsrail üzərində padşah kimi möhkəmləndirmiş və xalqı İsrailin xatirinə onun padşahlığını yüksəltmişdi.
3 ౩ తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు.
Davud Yerusəlimdə başqa arvadlar aldı, yenə oğullar və qızlar atası oldu.
4 ౪ యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
Onun Yerusəlimdə doğulan oğullarının adları belədir: Şammua, Şovav, Natan, Süleyman,
5 ౫ ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు,
İvxar, Elişua, Elpelet,
6 ౬ నోగహు, నెపెగు, యాఫీయ,
Noqah, Nefeq, Yafia,
7 ౭ ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
Elişama, Beelyada və Elifelet.
8 ౮ దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.
Filiştlilər eşitdilər ki, Davud bütün İsrail üzərində padşah olmaq üçün məsh edilmişdir. Onda hamısı Davudu axtarmağa çıxdı. Davud bunu eşidib onlarla qarşılaşmağa çıxdı.
9 ౯ ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.
Filiştlilər gəlib Refaim vadisini talayırdılar.
10 ౧౦ “ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు.
Davud Allahdan soruşdu: «Filiştlilərin qarşısına çıxımmı? Onları mənə təslim edəcəksənmi?» Rəbb ona cavab verdi: «Çıx, onları sənə təslim edəcəyəm».
11 ౧౧ వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి “ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు” అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది.
Davud Baal-Perasimə çıxıb Filiştliləri qırdı. Davud dedi: «Sellər bəndləri dağıtdığı kimi Allah da mənim əlimlə düşmənlərimi dağıtdı». Buna görə də o yerin adını Baal-Perasim qoydular.
12 ౧౨ ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
Filiştlilər qaçanda öz allahlarının bütlərini orada qoydular. Davudun əmri ilə bunlar odda yandırıldı.
13 ౧౩ ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.
Filiştlilər yenə o vadini taladılar.
14 ౧౪ దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు “నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు.
Davud yenə Allahdan soruşdu və Allah ona dedi: «Onların arxasınca çıxma, onların ətrafına dolanıb balzam ağaclarının qabağında bu düşmənlərin üstünə gəl.
15 ౧౫ కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో” అని చెప్పాడు.
Balzam ağaclarının başından addım səsləri eşidəndə döyüşə çıx, çünki o zaman Allah sənin qarşınca Filiştlilərin ordusunu məğlub etmək üçün çıxacaq».
16 ౧౬ దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.
Davud Allahın ona buyurduğu kimi etdi və onlar Giveondan Gezerə qədər Filiştlilərin ordusunu qırdılar.
17 ౧౭ కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.
Davudun şöhrəti bütün ölkələrə yayıldı və Rəbb onun qorxusunu bütün millətlərin ürəyinə saldı.