< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 13 >
1 ౧ దావీదు వేలమంది మీద అధిపతులుగా ఉన్నవాళ్ళతోను, వందలమంది మీద అధిపతులుగా ఉన్న వాళ్ళతోను, అధిపతులందరితోను ఆలోచన చేసి, సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో,
Efter at have rådført sig med Tusindførerne og Hundredeførerne, alle Øversterne,
2 ౨ “ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి,
sagde David til hele Israels Forsamling: "Hvis det tykkes eder godt, og det er HERREN vor Guds Vilje, lad os så sende Bud til vore Brødre, der er tilbage i alle Israels Landsdele, og ligeledes til Præsterne og Leviterne i Byerne, hvor de har deres Græsmarker, at de skal samles hos os,
3 ౩ మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి. సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు” అన్నాడు.
for at vi kan bringe vor Guds Ark tilbage til os, thi i Sauls Dage spurgte vi ikke om den."
4 ౪ ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు.
Og hele Forsamlingen svarede, at det skulde man gøre, thi alt Folket fandt Forslaget rigtigt.
5 ౫ దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు.
Så samlede David bele Israel lige fra Sjihor i Ægypten til Egnen ved Hamat for at hente Guds Ark i Kirjat-Jearim.
6 ౬ కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.
Derpå drog David og hele tsrael op til Ba'ala, til Kirjat-Jearim i Juda for der at hente Gud HERRENs Ark, over hvilken hans Navn er nævnet, han, som troner over Keruberne.
7 ౭ వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు.
De førte da Guds Ark bort fra Abinadabs Hus på en ny Vogn, og Uzza og Ajo kørte Vognen.
8 ౮ దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.
David og hele Israel legede af alle Kræfter for Guds Åsyn til Sang og til Citre, Harper, Pauker, Cymbler og Trompeter.
9 ౯ వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు
Men da de kom til Kidons Tærskeplads, rakte Uzza Hånden ud for at gribe fat i Arken, fordi Okserne snublede.
10 ౧౦ యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు.
Da blussede HERRENs Vrede op mod Uzza, og han slog ham, fordi han rakte Hånden ud mod Arken, og han døde på Stedet for Guds Åsyn.
11 ౧౧ యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈ రోజు వరకూ పెరెజ్ ఉజ్జా అని పేరు.
Men David græmmede sig over, at HERREN havde tilføjet Uzza et Brud. Derfor kaldte man Stedet Perez-Uzza, som det hedder den Dag i Dag.
12 ౧౨ ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి “దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకు పోతాను?” అన్నాడు.
Og David grebes den Dag af Frygt for Gud og sagde: "Hvor kan jeg da lade Guds Ark komme hen hos mig!"
13 ౧౩ కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు.
Og David flyttede ikke Arken hen hos sig i Davidsbyen, men lod den sætte ind i Gatiten Obed-Edoms Hus.
14 ౧౪ దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో మూడు నెలలు ఉంది. యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు.
Guds Ark blev så i Obed-Edoms Hus tre Måneder, og HERREN velsignede Obed-Edoms Hus og alt, hvad hans var.