< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 1 >
1 ౧ ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
Adam, Set, Enos,
2 ౨ ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
Kenan, Mahalalel, Jered,
3 ౩ యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
Hanok, Metusela, Lemek,
4 ౪ లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
Noa, Sem, Ham och Jafet.
5 ౫ యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
Jafets söner voro Gomer, Magog, Madai, Javan, Tubal, Mesek och Tiras.
6 ౬ గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
Gomers söner voro Askenas, Difat och Togarma.
7 ౭ యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
Javans söner voro Elisa och Tarsisa, kittéerna och rodanéerna.
8 ౮ హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.
Hams söner voro Kus, Misraim, Put och Kanaan.
9 ౯ కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.
Kus' söner voro Seba, Havila, Sabta, Raema och Sabteka. Raemas söner voro Saba och Dedan.
10 ౧౦ కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
Men Kus födde Nimrod; han var den förste som upprättade ett välde på jorden.
11 ౧౧ ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,
Och Misraim födde ludéerna, anaméerna, lehabéerna, naftuhéerna,
12 ౧౨ పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
patroséerna, kasluhéerna, från vilka filistéerna hava utgått, och kaftoréerna.
13 ౧౩ కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.
Och Kanaan födde Sidon, som var hans förstfödde, och Het,
14 ౧౪ ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
så ock jebuséerna, amoréerna och girgaséerna,
15 ౧౫ హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు
hivéerna, arkéerna, sinéerna,
16 ౧౬ అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
arvadéerna, semaréerna och hamatéerna.
17 ౧౭ షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.
Sems söner voro Elam, Assur, Arpaksad, Lud och Aram, så ock Us, Hul, Geter och Mesek.
18 ౧౮ అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
Arpaksad födde Sela, och Sela födde Eber.
19 ౧౯ ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
Men åt Eber föddes två söner; den ene hette Peleg, ty i hans tid blev jorden fördelad; och hans broder hette Joktan.
20 ౨౦ యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
Och Joktan födde Almodad, Selef, Hasarmavet, Jera,
21 ౨౧ హదోరము, ఊజాలు, దిక్లాను,
Hadoram, Usal, Dikla,
22 ౨౨ ఏబాలు, అబీమాయేలు, షేబా,
Ebal, Abimael, Saba,
23 ౨౩ ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
Ofir, Havila och Jobab; alla dessa voro Joktans söner.
24 ౨౪ షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,
Sem, Arpaksad, Sela,
25 ౨౫ ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,
Eber, Peleg, Regu,
26 ౨౬ రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
Serug, Nahor, Tera,
27 ౨౭ తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
Abram, det är Abraham
28 ౨౮ అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
Abrahams söner voro Isak och Ismael.
29 ౨౯ వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,
Detta är deras släkttavla: Nebajot, Ismaels förstfödde, vidare Kedar, Adbeel och Mibsam,
30 ౩౦ మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
Misma och Duma, Massa, Hadad och Tema,
31 ౩౧ యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
Jetur, Nafis och Kedma. Dessa voro Ismaels söner.
32 ౩౨ అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
Och de söner som Ketura, Abrahams bihustru, födde voro Simran, Joksan, Medan, Midjan, Jisbak och Sua. Joksans söner voro Saba och Dedan.
33 ౩౩ మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
Och Midjans söner voro Efa, Efer, Hanok, Abida och Eldaa. Alla dessa voro Keturas söner.
34 ౩౪ అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.
Och Abraham födde Isak. Isaks söner voro Esau och Israel.
35 ౩౫ ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.
Esaus söner voro Elifas, Reguel, Jeus, Jaelam och Kora.
36 ౩౬ వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.
Elifas' söner voro Teman och Omar, Sefi och Gaetam, Kenas, Timna och Amalek
37 ౩౭ రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
Reguels söner voro Nahat, Sera, Samma och Missa.
38 ౩౮ శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
Men Seirs söner voro Lotan, Sobal, Sibeon, Ana, Dison, Eser och Disan.
39 ౩౯ లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
Lotans söner voro Hori och Homam; och Lotans syster var Timna.
40 ౪౦ శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
Sobals söner voro Aljan, Manahat och Ebal, Sefi och Onam. Och Sibeons söner voro Aja och Ana.
41 ౪౧ అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
Anas söner voro Dison. Och Disons söner voro Hamran, Esban, Jitran och Keran.
42 ౪౨ ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
Esers söner voro Bilhan, Saavan, Jaakan. Disans söner voro Us och Aran.
43 ౪౩ ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
Och dessa voro de konungar som regerade i Edoms land, innan ännu någon israelitisk konung var konung där: Bela, Beors son, och hans stad hette Dinhaba.
44 ౪౪ బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
När Bela dog, blev Jobab, Seras son, från Bosra, konung efter honom.
45 ౪౫ యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
När Jobab dog, blev Husam från temanéernas land konung efter honom.
46 ౪౬ హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.
När Husam dog, blev Hadad, Bedads son, konung efter honom, han som slog midjaniterna på Moabs mark; och hans stad hette Avit.
47 ౪౭ హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.
När Hadad dog, blev Samla från Masreka konung efter honom.
48 ౪౮ శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
När Samla dog, blev Saul, från Rehobot vid floden, konung efter honom.
49 ౪౯ షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.
När Saul dog, blev Baal-Hanan, Akbors son, konung efter honom
50 ౫౦ బయల్ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
När Baal-Hanan dog, blev Hadad konung efter honom; och hans stad hette Pagi, och hans hustru hette Mehetabel, dotter till Matred, var dotter till Me-Sahab.
51 ౫౧ హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,
Men när Hadad hade dött, voro dessa Edoms stamfurstar: fursten Timna, fursten Alja, fursten Jetet,
52 ౫౨ అహలీబామా, ఏలా, పీనోను,
fursten Oholibama, fursten Ela, fursten Pinon,
53 ౫౩ కనజు, తేమాను, మిబ్సారు,
fursten Kenas, fursten Teman, fursten Mibsar,
54 ౫౪ మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.
fursten Magdiel, fursten Iram. Dessa voro Edoms stamfurstar.