< Matteus 15 >
1 Härefter kommo fariséer och skriftlärde från Jerusalem till Jesus och sade:
౧ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి,
2 "Varför överträda dina lärjungar de äldstes stadgar? De två ju icke sina händer, när de skola äta."
౨“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు.
3 Men han svarade och sade till dem: "Varför överträden I själva Guds bud, för edra stadgars skull?
౩అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, “మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు.
4 Gud har ju sagt: 'Hedra din fader och din moder' och: 'Den som smädar sin fader eller sin moder, han skall döden dö.'
౪ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు.
5 Men I sägen, att om någon säger till sin fader eller sin moder: 'Vad du av mig kunde hava fått till hjälp, det giver jag i stället såsom offergåva', då behöver han alls icke hedra sin fader eller sin moder.
౫కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు.
6 I haven så gjort Guds budord om intet, för edra stadgars skull.
౬ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు.
7 I skrymtare, rätt profeterade Esaias om eder, när han sade:
౭వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”
8 'Detta folk ärar mig med sina läppar, men deras hjärtan äro långt ifrån mig;
౮
9 och fåfängt dyrka de mig, eftersom de läror de förkunna äro människobud.'"
౯
10 Och han kallade folket till sig och sade till dem: "Hören och förstån.
౧౦ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే,
11 Icke vad som går in i munnen orenar människan, men vad som går ut ifrån munnen, det orenar människan."
౧౧ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు.
12 Då trädde hans lärjungar fram och sade till honom: "Vet du, att när fariséerna hörde det du nu sade, var det för dem en stötesten?"
౧౨అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, “నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు” అని ఆయనతో అన్నారు.
13 Men han svarade och sade: "Var planta som min himmelske Fader icke har planterat skall ryckas upp med rötterna.
౧౩ఆయన, “పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది.
14 Frågen icke efter dem. De äro blinda ledare; och om en blind leder en blind, så falla de båda i gropen."
౧౪వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.
15 Då tog Petrus till orda och sade till honom: "Uttyd för oss detta bildliga tal."
౧౫అందుకు పేతురు, “ఈ ఉపమానభావం మాకు వివరించు” అని ఆయనను అడిగాడు.
16 Han sade: "Ären då också I ännu utan förstånd?
౧౬అప్పుడాయన, “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా?
17 Insen I icke att allt som går in i munnen, det går ned i buken och har sin naturliga utgång?
౧౭నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది.
18 Men vad som går ut ifrån munnen, det kommer från hjärtat, och det är detta som orenar människan.
౧౮కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా?
19 Ty från hjärtat komma onda tankar, mord, äktenskapsbrott, otukt, tjuveri, falskt vittnesbörd, hädelse.
౧౯హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.
20 Det är detta som orenar människan; men att äta med otvagna händer, det orenar icke människan."
౨౦మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.
21 Och Jesus begav sig bort därifrån och drog sig undan till trakten av Tyrus och Sidon.
౨౧యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు.
22 Då kom en kananeisk kvinna från det området och ropade och sade: "Herre, Davids son, förbarma dig över mig. Min dotter plågas svårt av en ond ande."
౨౨అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది.
23 Men han svarade henne icke ett ord. Då trädde hans lärjungar fram och bådo honom och sade: "Giv henne besked; hon förföljer oss ju med sitt ropande."
౨౩కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు.
24 Han svarade och sade: "Jag är icke utsänd till andra än till de förlorade fåren av Israels hus."
౨౪దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు.
25 Men hon kom fram och föll ned för honom och sade: "Herre, hjälp mig."
౨౫అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది.
26 Då svarade han och sade: "Det är otillbörligt att taga brödet från barnen och kasta det åt hundarna."
౨౬ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు.
27 Hon sade: "Ja, Herre. Också äta ju hundarna allenast av de smulor som falla ifrån deras herrars bord."
౨౭ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది.
28 Då svarade Jesus och sade till henne: "O kvinna, din tro är stor. Ske dig såsom du vill." Och hennes dotter var frisk ifrån den stunden.
౨౮అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
29 Men Jesus gick därifrån vidare och kom till Galileiska sjön. Och han gick upp på berget och satte sig där.
౨౯యేసు అక్కడ నుండి బయలుదేరి, గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు.
30 Då kom mycket folk till honom, och de hade med sig halta, blinda, dövstumma, lytta och många andra; dem lade de ned för hans fötter, och han botade dem,
౩౦ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, వికలాంగులను, ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు.
31 så att folket förundrade sig, när de funno dövstumma tala, lytta vara friska och färdiga, halta gå och blinda se. Och man prisade Israels Gud.
౩౧మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు.
32 Och Jesus kallade sina lärjungar till sig och sade: "Jag ömkar mig över folket, ty det är redan tre dagar som de hava dröjt kvar hos mig, och de hava intet att äta; och jag vill icke låta dem gå ifrån mig fastande, för att de icke skola uppgivas på vägen."
౩౨అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో” అన్నాడు.
33 Då sade lärjungarna till honom: "Varifrån skola vi här, i en öken, få så mycket bröd, att vi kunna mätta så mycket folk?"
౩౩ఆయన శిష్యులు, “ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?” అన్నారు.
34 Jesus frågade dem: "Huru många bröd haven I?" De svarade: "Sju, och därtill några få småfiskar."
౩౪యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగాడు. వారు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు.
35 Då tillsade han folket att lägra sig på marken.
౩౫అప్పుడు యేసు “నేల మీద కూర్చోండి” అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి,
36 Och han tog de sju bröden, så ock fiskarna, och tackade Gud och bröt bröden och gav åt lärjungarna, och lärjungarna gåvo åt folket.
౩౬ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు.
37 Så åto de alla och blevo mätta. Och de överblivna styckena samlade man sedan upp, sju korgar fulla.
౩౭వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.
38 Men de som hade ätit voro fyra tusen män, förutom kvinnor och barn.
౩౮స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.
39 Sedan lät han folket skiljas åt och steg i båten och for till Magadans område.
౩౯తరువాత ఆయన ఆ ప్రజలందరినీ పంపివేసి, పడవ మీద మగదాను ప్రాంతానికి వచ్చాడు.