< Hesekiel 24 >
1 Och HERRENS ord kom till mig i nionde året, på tionde dagen i tionde månaden; han sade:
౧బబులోను చెరలో ఉన్న కాలంలో, తొమ్మిదో సంవత్సరం, పదో నెల, పదో రోజు యెహోవా వాక్కు నాకు మళ్ళీ ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
2 Du människobarn, skriv upp åt dig namnet på denna dag, just denna dag; ty konungen i Babel har på just denna dag ryckt fram mot Jerusalem.
౨“నరపుత్రుడా, ఈ రోజు పేరు రాసి ఉంచుకో. కచ్చితంగా ఈ రోజే బబులోను రాజు యెరూషలేమును ముట్టడి వేశాడు.
3 Och tala till det gensträviga släktet i en liknelse; säg till dem: Så säger Herren, HERREN: Sätt på grytan, och när du har satt på den, så gjut vatten däri.
౩తిరుగుబాటుచేసే ఈ ప్రజలకు ఉపమాన రీతిగా ఒక సామెత చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వంట కుండ తెచ్చి అందులో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టు.
4 Lägg sedan köttstyckena tillhopa däri, allahanda goda stycken, av låret och bogen; och fyll den så med de bästa märgbenen.
౪తొడ, జబ్బ మొదలైన మంచి ముక్కలన్నీ అందులో వేసి, మంచి ఎముకలు ఏరి దాన్ని నింపు.
5 Tag härtill det bästa av hjorden; och lägg bränsle under den för att koka benen. Låt den koka starkt, så att ock benen bliva kokta i den.
౫మందలో శ్రేష్ఠమైన వాటిని తీసికో. దానిలో ఉన్న ఎముకలు ఉడికేలా ఎక్కువ కట్టెలు పోగు చెయ్యి, దాన్ని బాగా పొంగించు. ఎముకలు ఉడికేలా పొంగించు.
6 Så säger nu Herren, HERREN: Ve över blodstaden, den rostiga grytan, varifrån rosten icke har kunnat tagas bort! Det ena köttstycket efter det andra har man redan tagit ut därur, utan att kasta lott om ordningen.
౬కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, రక్త నగరానికి బాధ. మడ్డి గల ఆ కుండకు బాధ తప్పదు. దానిలోనుంచి ఆ మడ్డి పోదు. దానికోసం చీటీలు వెయ్యకుండా వండిన దాన్ని ముక్క వెంట ముక్క దానిలోనుంచి తీసుకో.
7 Ty det blod hon har utgjutit är ännu kvar därinne; på kala klippan lät hon det rinna ned; hon utgöt det icke på sådan mark att mullen har kunnat skyla det.
౭దాని రక్తం దాని మధ్యనే ఉంది. అది దాన్ని నున్నటి బండ మీద ఉంచింది. మట్టితో దాన్ని కప్పేందుకు వీలుగా ఆ రక్తాన్ని నేల మీద కుమ్మరించ లేదు.
8 För att vreden skulle hava sin gång, och för att jag skulle utkräva hämnd, lät jag det blod hon utgöt komma på kala klippan, där det icke kunde skylas.
౮కాబట్టి దాని విషయం కోపాగ్ని రేకెత్తించి ప్రతీకారం తీర్చుకోవాలని, అది చిందించిన రక్తం మట్టితో కప్పకుండా దాన్ని ఆ నున్నటి బండ మీద నేను ఉండనిచ్చాను.”
9 Därför säger Herren, HERREN så: Ve över blodstaden! Jag skall nu ytterligare öka på bränslet därunder.
౯కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆ నెత్తురు నగరానికి బాధ. నేను కూడా మరి ఎక్కువ కట్టెలు పేర్చబోతున్నాను.
10 Ja, lägg på mer ved, tänd upp eld, låt köttet bliva förstört och spadet koka in och benen bliva förbrända.
౧౦కట్టెలు ఎక్కువ చెయ్యి! అగ్ని రాజెయ్యి! మాంసాన్ని బాగా ఉడకబెట్టు. మాంసం బాగా ఉడికించి మసాలా కలిపి పులుసు పెట్టు! ఎముకలు బాగా మగ్గనివ్వు!
11 Och låt den sedan stå tom på eldsglöden, till dess att den bliver så upphettad att dess koppar glödgas och orenligheten smältes bort därur och rosten försvinner.
౧౧తరువాత ఖాళీ గిన్నె పొయ్యి మీద పెట్టు. అప్పుడు దానికున్న అశుద్ధం, మడ్డీ కరిగిపోతాయి. అది వేడై ఆ కంచును కాల్చే వరకూ ఆ గిన్నె పొయ్యి మీదే ఉంచు.
12 Tung möda har den kostat, och ändå har dess myckna rost icke gått bort. Så må nu dess röst komma i elden!
౧౨అలసట పుట్టే వరకూ ఇంతగా శ్రమించినా, అగ్నిలో కాల్చినా, దానిలో నుంచి ఆ తుప్పు పోలేదు.
13 Därför att din orenhet är så skändlig, och därför att du icke blev ren. huru jag än sökte rena dig, därför skall du nu icke mer bliva fri ifrån din orenhet, förrän jag har släckt min vrede på dig.
౧౩నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.
14 Jag, HERREN, har talat. Det kommer! Jag skall fullborda det! Jag skall icke släppa efter och icke skona och icke ångra mig. Efter dina vägar och dina gärningar skall man döma dig, säger Herren, HERREN.
౧౪యెహోవానైన నేను ప్రకటించాను. అది జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనుకాడను, కనికరించను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలనుబట్టి నీకు శిక్ష ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు.”
15 Och HERRENS ord kom till mig; han sade:
౧౫యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు,
16 Du människobarn, se, genom en plötslig död skall jag taga ifrån dig den som är dina ögons lust, men du må icke hålla dödsklagan eller gråta eller fälla tårar.
౧౬“నరపుత్రుడా, చూడు! నీ కళ్ళకు ఇష్టమైన దాన్ని నీ నుంచి ఒక్క తెగులు మూలంగా తీసేస్తాను. నువ్వు సంతాప పడవద్దు. కన్నీరు కార్చ వద్దు.
17 Tyst må du jämra dig; men du skall icke hålla sorgefest såsom efter en död. Nej, sätt på dig din huvudbindel och tag skor på dina fötter; skyl icke ditt skägg, och ät icke det särskilda bröd som eljest är övligt.
౧౭నువ్వు మౌనంగా మూలగాలి. చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చెయ్యొద్దు. తలపాగా కట్టుకుని చెప్పులు వేసుకో. నీ గడ్డం దాచుకోవద్దు, భార్యను కోల్పోయిన పురుషుని ఆహారం తినొద్దు.”
18 Sedan talade jag nästa morgon till folket, men på aftonen dog min hustru; och följande morgon gjorde jag såsom mig var befallt.
౧౮ఉదయం ప్రజలకు నేను ప్రకటించాను. సాయంత్రం నా భార్య చనిపోగా నాకు ఆజ్ఞాపించినట్టు మరుసటి ఉదయాన నేను చేశాను.
19 Då sade folket till mig: "Vill du icke omtala för oss vad det betyder att du så gör?"
౧౯ప్రజలు నన్ను “నువ్వు చేస్తున్నవాటి అర్థం మాకు చెప్పవా?” అని అడిగారు.
20 Jag svarade dem: HERRENS ord kom till mig; han sade:
౨౦కాబట్టి నేను వాళ్ళతో “యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
21 Säg till Israels hus: Så säger Herren, HERREN: Se, jag vill ohelga min helgedom, eder stolta härlighet, edra ögons lust och eder själs längtan. Och edra söner och döttrar, som I haven måst övergiva, skola falla för svärd.
౨౧ఇశ్రాయేలీయులకు నువ్వు ఈ విధంగా చెప్పు, చూడు! ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ బలంలో మీకున్న అతిశయం, మీ నేత్రాశలు, మీ మనస్సులో మీకున్న వాంఛలు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నాయి! కాబట్టి, మీరు వెనుక విడిచిన మీ కొడుకులూ, కూతుళ్ళూ కత్తిచేత కూలిపోతారు.
22 Då skolen I komma att göra såsom jag har gjort: I skolen icke skyla skägget och icke äta det övliga brödet.
౨౨అప్పుడు నేను చేసినట్టే మీరూ చేస్తారు. మీ గడ్డాలు కప్పుకోరు. సంతాపంలో ఉన్న పురుషుల ఆహారం తినరు!
23 Och I skolen behålla huvudbindlarna på edra huvuden och skorna på edra fötter; I skolen icke hålla dödsklagan eller gråta, utan skolen sitta där försmäktande genom edra missgärningar och sucka med varandra.
౨౩మీ తలపాగాలు మీ తలలపై ఉంటాయి. మీ చెప్పులు మీ కాళ్ళకు ఉంటాయి. మీరు సంతాపపడరు, కన్నీరు కార్చరు. ఒకడినొకరు చూసి మూలుగుతూ, మీరు చేసిన దోషాల కారణంగా క్షీణించిపోతారు.
24 Hesekiel skall vara ett tecken för eder; alldeles såsom han gör skolen I komma att göra. När detta händer, skolen I förnimma att jag är Herren, HERREN.
౨౪కాబట్టి, యెహెజ్కేలు మీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిన ప్రకారం మీరూ చేస్తారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
25 Men du, människobarn, må veta att på den tid då jag tager ifrån dem deras värn, deras härliga fröjd, deras ögons lust och deras själs begär, deras söner och döttrar,
౨౫“కాని, నరపుత్రుడా, వాళ్ళ ఆనందాన్నీ, వాళ్ళ అతిశయాన్నీ, వాళ్ళ కళ్ళకు ఇష్టమైనదాన్నీ, వాళ్ళ కొడుకులనూ, వాళ్ళ కూతుళ్ళనూ నేను బలవంతంగా పట్టుకున్న రోజు నీకు సమాచారం తెలియజేయడానికి, తప్పించుకుని వచ్చిన వాడొకడు నీదగ్గరికి వస్తాడు.
26 på den tiden skall en räddad flykting komma till dig och förkunna detta.
౨౬ఆ రోజున నువ్వింక మౌనంగా ఉండకుండాా, తప్పించుకుని వచ్చిన వాడితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు,
27 Och då när flyktingen är där, skall din mun upplåtas, och du skall tala och icke mer vara stum; och du skall vara ett tecken för dem, och de skola förnimma att jag är HERREN.
౨౭నేను యెహోవానై ఉన్నానని వాళ్ళు తెలుసుకునేలా నువ్వు వాళ్లకు సూచనగా ఉంటావు.”