< Psaltaren 138 >
1 Av David. Jag vill tacka dig av allt mitt hjärta; inför gudarna vill jag lovsjunga dig.
౧దావీదు కీర్తన నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను.
2 Jag vill tillbedja, vänd mot ditt heliga tempel, och prisa ditt namn för din nåd och sanning, ty du har gjort ditt löftesord stort utöver allt vad ditt namn hade sagt.
౨నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.
3 När jag ropade, svarade du mig; du gav mig frimodighet, och min själ fick kraft.
౩నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు.
4 HERRE, alla jordens konungar skola tacka dig, när de få höra din muns tal.
౪యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు.
5 De skola sjunga om HERRENS vägar, ty HERRENS ära är stor.
౫యెహోవా మహా బలప్రభావాలు గలవాడని వారు యెహోవా విధానాలను గూర్చి పాటలు పాడతారు.
6 Ja, HERREN är hög, men han ser till det låga, och han känner den högmodige fjärran ifrån.
౬యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు.
7 Om ock min väg går genom nöd, så behåller du mig vid liv; du räcker ut din hand till värn mot mina fienders vrede, och din högra hand frälsar mig.
౭నేను ఆపదల్లో చిక్కుకుని ఉన్నప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తావు. నీ చెయ్యి చాపి నా శత్రువుల క్రోధం నుండి నన్ను రక్షిస్తావు. నీ కుడిచేతి నుండి నాకు సంరక్షణ దొరుకుతుంది.
8 HERREN skall fullborda sitt verk för mig. HERRE, din nåd varar evinnerligen; övergiv icke dina händers verk.
౮యెహోవా నా తరపున పని సవ్యంగా జరిగిస్తాడు. యెహోవా, నీ కృప సదాకాలం నిలుస్తుంది. నీ చేతులు చేసిన వాటిని విడిచిపెట్టవద్దు.