< Psaltaren 130 >
1 En vallfartssång. Ur djupen ropar jag till dig, HERRE.
౧యాత్రల కీర్తన యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను.
2 Herre, hör min röst, låt dina öron akta på mina böners ljud.
౨ప్రభూ, నా ప్రార్థన అంగీకరించు. నేను చేసే ఆర్తనాదం శ్రద్ధగా ఆలకించు.
3 Om du, HERRE, vill tillräkna missgärningar, Herre, vem kan då bestå?
౩యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు.
4 Dock, hos dig är ju förlåtelse, på det att man må frukta dig.
౪అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు.
5 Jag väntar efter HERREN, min själ väntar, och jag hoppas på hans ord.
౫యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను.
6 Min själ väntar efter Herren mer än väktarna efter morgonen, ja, mer än väktarna efter morgonen.
౬రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది.
7 Hoppas på HERREN, Israel; ty hos HERREN är nåd, och mycken förlossning är hos honom.
౭యెహోవా జాలిపరుడు. ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశలు నిలుపుకో. ఆయన క్షమించడానికి ఇష్టపడే వాడు.
8 Och han skall förlossa Israel från alla dess missgärningar.
౮ఇశ్రాయేలువారి పాపాలన్నిటి నుండి విముక్తి కలిగించేది ఆయనే.