< Jakobsbrevet 4 >
1 Varav uppkomma strider, och varav tvister bland eder? Månne icke av de lustar som föra krig i eder lemmar?
౧మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?
2 I ären fulla av begärelser, men haven dock intet; I dräpen och hysen avund, men kunnen dock intet vinna; och så tvisten och striden I. I haven intet, därför att I icke bedjen.
౨మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.
3 Dock, I bedjen, men I fån intet, ty I bedjen illa, nämligen för att kunna i edra lustar förslösa vad I fån.
౩మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు.
4 I trolösa avfällingar, veten I då icke att världens vänskap är Guds ovänskap? Den som vill vara världens vän, han bliver alltså Guds ovän.
౪కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.
5 Eller menen I att detta är ett tomt ord i skriften: »Med svartsjuk kärlek trängtar den Ande som han har låtit taga sin boning i oss»?
౫ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా?
6 Men så mycket större är den nåd han giver; därför heter det: »Gud står emot de högmodiga, men de ödmjuka giver han nåd.»
౬కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
7 Så varen nu Gud underdåniga, men stån emot djävulen, så skall han fly bort ifrån eder.
౭కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
8 Nalkens Gud, så skall han nalkas eder. Renen edra händer, I syndare, och gören edra hjärtan rena, I människor med delad håg.
౮దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.
9 Kännen edert elände och sörjen och gråten. Edert löje vände sig i sorg och eder glädje i bedrövelse.
౯చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి.
10 Ödmjuken eder inför Herren, så skall han upphöja eder.
౧౦ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
11 Förtalen icke varandra, mina bröder. Den som förtalar en broder eller dömer sin broder, han förtalar lagen och dömer lagen. Men dömer du lagen, så är du icke en lagens görare, utan dess domare.
౧౧సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం.
12 En är lagstiftaren och domaren, han som kan frälsa och kan förgöra. Vem är då du som dömer din nästa?
౧౨ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?
13 Hören nu, I som sägen: »I dag eller i morgon vilja vi begiva oss till den och den staden, och där vilja vi uppehålla oss ett år och driva handel och skaffa oss vinning» --
౧౩“నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట.
14 I veten ju icke vad som kan ske i morgon. Ty vad är edert liv? En rök ären I, som synes en liten stund, men sedan försvinner.
౧౪రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
15 I borden fastmera säga: »Om Herren vill, och vi får leva, skola vi göra det, eller det.»
౧౫కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి.
16 Men nu talen I stora ord i eder förmätenhet. All sådan stortalighet är ond.
౧౬ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది.
17 Alltså, den som förstår att göra vad gott är, men icke gör det, för honom bliver detta till synd.
౧౭మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.