< Jesaja 42 >
1 Se, över min tjänare som jag uppehåller, min utkorade, till vilken min själ har behag, över honom har jag låtit min Ande komma; han skall utbreda rätten bland folken.
౧ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు. ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు.
2 Han skall icke skria eller ropa och icke låta höra sin röst på gatorna.
౨ఆయన కేకలు వేయడు, అరవడు. ఆయన స్వరం వీధుల్లో వినబడదు.
3 Ett brutet rör skall han icke sönderkrossa, och en tynande veke skall han icke utsläcka; han skall i trofasthet utbreda rätten.
౩నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు. ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు.
4 Hans kraft skall icke förtyna eller brytas, intill dess att han har grundat rätten på jorden; havsländerna vänta efter hans lag.
౪భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకూ ఆయన అలసిపోడు, నిరాశ చెందడు. సముద్ర ద్వీపాలు అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తాయి.
5 Så säger Gud, HERREN, han som har skapat himmelen och utspänt den, han som har utbrett jorden med vad som alstras därav, han som har givit liv åt folket som är därpå och ande åt dem som vandra där:
౫ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
6 Jag, HERREN, har kallat dig i rättfärdighet, och jag vill fatta dig vid handen och bevara dig och fullborda i dig förbundet med folket och sätta dig till ett ljus för folkslagen,
౬“గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు.
7 för att du må öppna blinda ögon och föra fångar ut ur fängelset, ja, ur fångenskapen dem som sitta i mörkret.
౭యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను. నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను.
8 Jag, HERREN, det är mitt namn; och jag giver icke min ära åt någon annan eller mitt lov åt belätena.
౮నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను.
9 Se, vad jag förut förkunnade, det har nu kommit. Nu förkunnar jag nya ting; förrän de visa sig, låter jag eder höra om dem.
౯గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.”
10 Sjungen till HERRENS ära en ny sång, hans lov från jordens ända, I som faren på havet, så ock allt vad däri är, I havsländer med edra inbyggare;
౧౦సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి. భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి.
11 stämmen upp, du öken med dina städer och I byar, där Kedar bor; jublen, I klippornas invånare, ropen från bergens toppar.
౧౧ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి. సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు.
12 Given HERREN ära och förkunnen hans lov i havsländerna.
౧౨ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు.
13 HERREN drager ut såsom en hjälte, han eggar upp sig till iver såsom en krigare; han uppgiver härskri, han ropar högt och visar sin makt mot sina fiender.
౧౩యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు.
14 I lång tid har jag tegat, jag höll mig stilla och betvang mig; men nu skall jag höja rop såsom en barnaföderska, jag vill skaffa mig luft och andas ut.
౧౪చాలాకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను. నన్ను నేను అణచుకుంటూ మాట్లాడకుండా ఉన్నాను. ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలాగా నేను బలవంతంగా ఊపిరి తీస్తూ ఒగరుస్తూ ఉన్నాను.
15 Jag skall föröda berg och höjder och låta allt gräs på dem förtorka; jag skall göra strömmar till land och låta allt gräs på dem förtorka; jag skall göra strömmar till land och låta sjöar torka ut.
౧౫పర్వతాలూ కొండలూ పాడైపోయేలా, వాటి మీద ఉన్న చెట్లన్నిటినీ ఎండిపోయేలా చేస్తాను. నదులను ద్వీపాలుగా మారుస్తాను. నీటి మడుగులు ఆరిపోయేలా చేస్తాను.
16 Och de blinda skall jag leda på en väg som de icke känna; på stigar som de icke känna skall jag föra dem. Jag skall göra mörkret framför dem till ljus och det som är ojämnt till jämn mark. Detta är, vad jag skall göra, och jag skall ej rygga mitt ord.
౧౬గుడ్డివారిని వారికి తెలియని దారిలో తీసుకువస్తాను. వారు నడవని మార్గాల్లో వారిని నడిపిస్తాను. వారి చీకటిని వెలుగుగా, వంకరదారులను తిన్నగా చేస్తాను. ఈ పనులన్నీ నేను చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను.
17 Men de som förtrösta på skurna beläten och som säga till gjutna beläten: »I ären våra gudar», de skola vika tillbaka och stå där med skam.
౧౭చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు.
18 Hören, I döve; I blinde, skåden och sen.
౧౮చెవిటివారు వినండి, గుడ్డివారు మీరు గ్రహించగలిగేలా చూడండి.
19 Vem är blind, om icke min tjänare, och så döv som den budbärare jag sänder åstad?
౧౯నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు?
20 Du har fått se mycket, men du aktar icke därpå; fastän öronen hava blivit öppnade, lyssnar ingen till.
౨౦నువ్వు చాలా విషయాలు చూస్తున్నావు గానీ గ్రహించలేకపోతున్నావు. చెవులు తెరిచే ఉన్నాయి గానీ వినడం లేదు.
21 Det är HERRENS behag, för hans rättfärdighets skull, att han vill låta sin lag komma till makt och ära.
౨౧యెహోవా తన నీతికీ తన ధర్మశాస్త్రానికీ ఘనతామహిమలు కలగడంలో సంతోషించాడు.
22 Men detta är ett plundrat och skövlat folk; dess ynglingar äro alla lagda i bojor, och i fängelser hållas de gömda, de hava blivit givna till plundring, och ingen finnes, som räddar, till skövling, och ingen säger: »Giv tillbaka.»
౨౨అయితే ఈ ప్రజలు దోపిడీకి గురయ్యారు. వారంతా గుహల్లో చిక్కుకుపోయారు, వారిని బంధకాల్లో ఉంచారు. వారు దోపుడు పాలైనప్పుడు వారినెవరూ విడిపించలేదు. అపహరణకు గురైనప్పుడు “వారిని తిరిగి తీసుకురండి” అని ఎవరూ చెప్పలేదు.
23 Ack att någon bland eder ville lyssna härtill, för framtiden giva akt och höra härpå!
౨౩మీలో దీన్ని ఎవడు వింటాడు? భవిష్యత్తులోనైనా ఎవడు ఆలకించి వింటాడు?
24 Vem har lämnat Jakob till skövling och Israel i plundrares våld? Har icke HERREN gjort det; han, mot vilken vi hava syndat, han, på vilkens vägar man icke ville vandra och på vilkens lag man icke ville höra?
౨౪వారు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మార్గాల్లో నడుచుకోలేదు. ఆయన ఉపదేశాన్ని తిరస్కరించారు. అందుకు యెహోవాయే యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించాడు. ఇశ్రాయేలును దోచుకునేవారికి అప్పగించాడు.
25 Därför utgöt han över dem i sin vrede förtörnelse och krigets raseri. Och de förbrändes därav runt omkring, men besinnade det icke; de förtärdes därav, men aktade icke därpå.
౨౫దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు. అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు.