< Galaterbrevet 1 >
1 Paulus, apostel, icke från människor, ej heller genom någon människa, utan genom Jesus Kristus och genom Gud, Fadern, som har uppväckt honom från de döda --
౧మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,
2 jag, jämte alla de bröder som äro här med mig, hälsar församlingarna i Galatien.
౨నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.
3 Nåd vare med eder och frid ifrån Gud, vår Fader, och ifrån Herren Jesus Kristus,
౩తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
4 som har utgivit sig själv för våra synder, för att rädda oss från den nuvarande onda tidsåldern, efter vår Guds och Faders vilja. (aiōn )
౪మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. (aiōn )
5 Honom tillhör äran i evigheternas evigheter. Amen. (aiōn )
౫నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్. (aiōn )
6 Det förundrar mig att I så hastigt avfallen från honom, som har kallat eder till att vara i Kristi nåd, och vänden eder till ett nytt evangelium.
౬క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
7 Likväl är detta icke något annat »evangelium»; det är allenast så, att några finnas som vålla förvirring bland eder och vilja förvända Kristi evangelium.
౭అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు.
8 Men om någon, vore det ock vi själva eller en ängel från himmelen, förkunnar evangelium i strid mot vad vi hava förkunnat för eder, så vare han förbannad.
౮మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక.
9 Ja, såsom vi förut hava sagt, så säger jag nu åter: Om någon förkunnar evangelium för eder i strid mot vad I haven undfått, så vare han förbannad.
౯మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.
10 Är det då människor som jag nu söker vinna för mig, eller är det Gud? Står jag verkligen efter att »vara människor till behag»? Nej, om jag ännu ville vara människor till behag, så vore jag icke en Kristi tjänare.
౧౦ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
11 Ty det vill jag säga eder, mina bröder, att det evangelium som har blivit förkunnat av mig icke är någon människolära.
౧౧సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.
12 Det är ju icke heller av någon människa som jag har undfått det eller blivit undervisad däri, utan genom en uppenbarelse från Jesus Kristus.
౧౨మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
13 I haven ju hört huru det var med mig, medan jag ännu vandrade i judiskt väsende: att jag då övermåttan våldsamt förföljde Guds församling och ville utrota den,
౧౩నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.
14 ja, att jag gick längre i judiskt väsende än många av mina samtida landsmän och ännu ivrigare nitälskade för mina fäders stadgar.
౧౪అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.
15 Men när han, som allt ifrån min moders liv har avskilt mig, och som genom sin nåd har kallat mig,
౧౫అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని
16 täcktes i mig uppenbara sin Son, för att jag bland hedningarna skulle förkunna evangelium om honom, då begav jag mig strax åstad; jag rådförde mig icke med någon människa,
౧౬ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.
17 ej heller for jag upp till Jerusalem, till dem som före mig voro apostlar. I stället for jag bort till Arabien och vände så åter tillbaka till Damaskus.
౧౭నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
18 Först sedan, tre år därefter, for jag upp till Jerusalem, för att lära känna Cefas, och jag stannade hos honom femton dagar.
౧౮మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను.
19 Men av de andra apostlarna såg jag ingen; allenast Jakob, Herrens broder, såg jag.
౧౯అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
20 Och Gud vet att jag icke ljuger i vad jag här skriver till eder.
౨౦నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను.
21 Därefter for jag till Syriens och Ciliciens bygder.
౨౧ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.
22 Men för de kristna församlingarna i Judeen var jag personligen okänd.
౨౨క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ
23 De hörde allenast huru man sade: »Han som förut förföljde oss, han förkunnar nu evangelium om den tro som han förr ville utrota.»
౨౩“మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని,
24 Och de prisade Gud för min skull.
౨౪వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.