< 1 Korinthierbrevet 13 >
1 Om jag talade både människors och änglars tungomål, men icke hade kärlek, så vore jag allenast en ljudande malm eller en klingande cymbal.
౧నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను.
2 Och om jag hade profetians gåva och visste alla hemligheter och ägde all kunskap, och om jag hade all tro, så att jag kunde förflytta berg, men icke hade kärlek, så vore jag intet.
౨దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే.
3 Och om jag gåve bort allt vad jag ägde till bröd åt de fattiga, ja, om jag offrade min kropp till att brännas upp, men icke hade kärlek, så vore detta mig till intet gagn.
౩పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
4 Kärleken är tålig och mild. Kärleken avundas icke, kärleken förhäver sig icke, den uppblåses icke.
౪ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 Den skickar sig icke ohöviskt, den söker icke sitt, den förtörnas icke, den hyser icke agg för en oförrätts skull.
౫అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 Den gläder sig icke över orättfärdigheten, men har sin glädje i sanningen.
౬ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 Den fördrager allting, den tror allting, den hoppas allting, den uthärdar allting.
౭అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
8 Kärleken förgår aldrig. Men profetians gåva, den skall försvinna, och tungomålstalandet, det skall taga slut, och kunskapen, den skall försvinna.
౮ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.
9 Ty vår kunskap är ett styckverk, och vårt profeterande är ett styckverk;
౯ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము.
10 men när det kommer, som är fullkomligt, då skall det försvinna, som är ett styckverk.
౧౦అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి.
11 När jag var barn, talade jag såsom ett barn, mitt sinne var såsom ett barns, jag hade barnsliga tankar; men sedan jag blev man, har jag lagt bort vad barnsligt var.
౧౧నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.
12 Nu se vi ju på ett dunkelt sätt, såsom i en spegel, men då skola vi se ansikte mot ansikte. Nu är min kunskap ett styckverk, men då skall jag känna till fullo, såsom jag själv har blivit till fullo känd.
౧౨అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.
13 Så bliva de då beståndande, tron, hoppet, kärleken, dessa tre; men störst bland dem är kärleken.
౧౩ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.