< Romarbrevet 8 >
1 Så är nu intet fördömeligit i dem som äro i Christo Jesu, de icke vandra efter köttet, utan efter Andan.
౧ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
2 Ty Andans lag, som lif gifver i Christo Jesu, hafver gjort mig fri ifrå syndenes och dödsens lag.
౨క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది.
3 Ty det som lagen icke kunde åstadkomma, i det hon vardt försvagad af köttet, det gjorde Gud, sändandes sin Son i syndelig kötts liknelse, och fördömde syndena i köttet genom synd;
౩ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.
4 På det den rättfärdighet, som lagen äskar, skulle varda fullbordad i oss, som icke vandrom efter köttet, utan efter Andan.
౪
5 Ty de som köttslige äro, de äro köttsliga sinnade; men de som andelige äro, de äro andeliga sinnade.
౫శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు.
6 Ty köttsens sinne är döden; men Andans sinne är lif och frid.
౬శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం.
7 Ty köttsligit sinne är en fiendskap emot Gud; efter det är icke Guds lag underdånigt; icke kan det heller.
౭ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా.
8 Men de, som äro köttslige, kunna icke vara Gudi täcke.
౮కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.
9 Men I ären icke köttslige, utan andelige, om Guds Ande annars bor i eder; ty hvilken icke hafver Christi Anda, han hörer icke honom till.
౯దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు.
10 Men om Christus är i eder, så är väl lekamenen död, för syndenes skull; men Anden är lifvet, för rättfärdighetenes skull.
౧౦క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది.
11 Om nu hans Ande, som Jesum uppväckte ifrå de döda, bor i eder, så skall ock den, som Christum uppväckte ifrå de döda, göra edor dödeliga lekamen lefvande, för sin Andas skull, som i eder bor.
౧౧చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.
12 Så äre vi nu, käre bröder, skyldige, icke köttena, att vi skole lefva efter köttet;
౧౨కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము.
13 Ty om I lefven efter köttet, så skolen I dö; men om I döden köttsens gerningar med Andanom, så skolen I lefva.
౧౩మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.
14 Ty alle de som drifvas af Guds Anda, de äro Guds barn.
౧౪దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.
15 Ty I hafven icke fått träldomsens anda, åter till räddhåga; utan I hafven fått utkorada barns Anda, i hvilkom vi rope: Abba, käre Fader.
౧౫ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం.
16 Den samme Anden vittnar med vår Anda, att vi äre Guds barn.
౧౬మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు.
17 Äre vi nu barn, så äre vi ock arfvingar; nämliga Guds arfvingar, och Christi medarfvingar; om vi annars lidom med honom, att vi ock med honom komma mågom till härligheten.
౧౭మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.
18 Ty jag håller det så före, att denna tidsens vedermöda är icke lika emot den härlighet, som på oss uppenbaras skall.
౧౮మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.
19 Ty kreaturens högeliga åstundan väntar efter, att Guds barn skola uppenbaras;
౧౯దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది.
20 Efter kreaturen äro vanskelighetene underkastade emot sin vilja; men för hans skull, som dem underkastat hafver, på en förhoppning.
౨౦ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి,
21 Ty kreaturen skola ock varda fri af förgängelighetenes träldom, till Guds barnas härliga frihet.
౨౧నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది.
22 Ty vi vete, att hvart och ett kreatur suckar och ängslas med oss, allt härtill.
౨౨ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.
23 Och icke de allenast; utan ock vi sjelfve, som hafvom Andans förstling, suckom ock vid oss sjelfva efter barnaskapet, och väntom vår kropps förlossning.
౨౩అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.
24 Ty vi äre väl salige vordne, dock i hoppet; men hoppet, om det synes, är det icke hopp; ty huru kan man hoppas det man ser?
౨౪ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు?
25 Om vi nu hoppes det vi icke sem, så vänte vi det med tålamod.
౨౫మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
26 Sammaledes hjelper ock Anden våra skröplighet; ty vi vete icke hvad vi skolom bedja, såsom det bör sig; utan sjelfver Anden manar godt för oss, med osägeliga suckan.
౨౬అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు.
27 Men han, som skådar hjertan, han vet hvad Andans sinne är; ty han manar för helgonen, efter Guds behag.
౨౭ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
28 Men vi vete att dem, som hafva Gud kär, tjena all ting till det bästa, de som efter uppsåtet äro kallade.
౨౮దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.
29 Ty hvilka han hafver föresett, dem hafver han ock beskärt, att de skulle vara hans Sons beläte like; på det han skall vara den förstfödde ibland många bröder.
౨౯ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు.
30 Men dem som han hafver beskärt, dem hafver han ock kallat; och dem han hafver kallat, dem hafver han ock gjort rättfärdiga; men dem som han hafver gjort rättfärdiga, dem hafver han ock gjort härliga.
౩౦ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
31 Hvad vilje vi nu säga härtill? Är Gud för oss, ho kan vara emot oss?
౩౧వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు?
32 Hvilken ock icke hafver skonat sin egen Son, utan gifvit honom ut för oss alla; huru skulle han icke ock gifva oss all ting med honom?
౩౨తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?
33 Hvilken vill åklaga dem som Gud hafver utkorat? Gud är den som rättfärdigar.
౩౩దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే.
34 Hvilken är den som vill fördöma? Christus är den som lidit hafver döden; ja, han är ock den som uppväckt är; den ock sitter på Guds högra hand, och manar godt för oss.
౩౪ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.
35 Ho kan skilja oss ifrå Christi kärlek? Bedröfvelse, eller ångest, eller förföljelse, eller hunger, eller nakenhet, eller farlighet, eller svärd?
౩౫క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా?
36 Såsom skrifvet är: För dina skull vardom vi dödade hela dagen; vi vardom hållne såsom slagtofår.
౩౬దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే, “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం. వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”
37 Men i allt detta öfvervinne vi, genom honom som oss älskat hafver.
౩౭అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం.
38 Ty jag är viss derpå, att hvarken död, eller lif, eller Änglar, eller Förstadöme, eller väldigheter, eller de ting som nu äro, eller de ting som tillkomma skola;
౩౮నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా,
39 Eller höghet, eller djuphet, eller något annat kreatur, skall skilja oss ifrå Guds kärlek, som är i Christo Jesu, vårom Herra.
౩౯సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.