< Romarbrevet 4 >

1 Hvad säge vi då vår fader Abraham efter köttet hafva funnit?
కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం దొరికింది?
2 Det säge vi: Är Abraham rättfärdig vorden af gerningarna, så hafver han det han må berömma sig af; men icke för Gudi.
అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోవడానికి కారణం ఉండేది గానీ అది దేవుని ఎదుట కాదు.
3 Men hvad säger Skriften? Abraham trodde Gudi, och det vardt honom räknadt till rättfärdighet.
లేఖనం చెబుతున్నదేమిటి? “అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు.”
4 Men honom, som håller sig vid gerningarna, varder lönen icke räknad af nåd, utan af pligt.
పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.
5 Men honom, som icke håller sig vid gerningarna, utan tror på honom som den ogudaktiga gör rättfärdigan, hans tro varder honom räknad till rättfärdighet;
కానీ క్రియలు చేయకుండా దానికి బదులు భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవునిలో కేవలం విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసాన్నే దేవుడు నీతిగా ఎంచుతాడు.
6 Såsom ock David säger, att saligheten är dens menniskos, hvilko Gud tillräknar rättfärdighetena, utan gerningar.
అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు.
7 Salige äro de, som deras orättfärdigheter äro förlåtna, och deras synder äro öfverskylda.
ఎలా అంటే, “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
8 Salig är den man, som Gud ingen synd tillräknar.
ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.”
9 Månn nu denna saligheten allenast vara kommen öfver omskärelsen, eller ock öfver förhudena? Vi säge ju, att Abrahe vardt tron räknad till rättfärdighet.
ఈ దీవెన సున్నతి ఆచరించే వారి గురించి చెప్పాడా, ఆచరించని వారి గురించి కూడా చెప్పాడా? అబ్రాహాము విశ్వాసం అతణ్ణి నీతిమంతుడుగా తీర్చింది అన్నాం కదా?
10 Huru blef hon honom då tillräknad? När han var i omskärelsen, eller när han var i förhudene? Icke i omskärelsen, utan i förhudene.
౧౦అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి చేయించుకున్న తరవాతా లేక సున్నతికి ముందా? ముందే కదా!
11 Men han tog omskärelsens tecken för ett insegel till trones rättfärdighet, hvilka han hade i förhudene; att han skulle vara allas deras fader, som i förhudene trodde, att sådant skulle ock räknas dem för rättfärdighet;
౧౧సున్నతి లేకపోయినా నమ్మిన వారికందరికీ అతడు తండ్రి కావడం కోసం వారికి నీతి ఆపాదించడానికై సున్నతి లేనప్పుడే, తాను కలిగి ఉన్న విశ్వాసం వలన పొందిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు.
12 Desslikes ock omskärelsens fader, icke dem allenast, som äro af omskärelsen, utan ock dem som vandra i trones fotspår, som var i vår faders Abrahams förhud.
౧౨అలాగే సున్నతి గలవారికి కూడా తండ్రి కావడానికి, అంటే కేవలం సున్నతి మాత్రమే పొందిన వారు కాక సున్నతి లేనప్పుడు మన తండ్రి అబ్రాహాము విశ్వాసపు అడుగుజాడల్లో నడచిన వారికి కూడా తండ్రి కావడానికి అతడు ఆ గుర్తు పొందాడు.
13 Ty det löftet, att han skulle varda verldenes arfvinge, är icke skedt Abrahe och hans säd igenom lagen, utan igenom trones rättfärdighet.
౧౩అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది.
14 Ty om de, som lyda till lagen, äro arfvingar, så är tron onyttig vorden, och löftet är blifvet om intet.
౧౪ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమౌతుంది, వాగ్దానం కూడా నిరర్థకమౌతుంది.
15 Ty lagen kommer vrede åstad; ty der ingen lag är, der är icke heller öfverträdelse.
౧౫ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.
16 Derföre måste det vara af trone, att det skall vara af nåd, och löftet fast blifva allo sädene; icke honom allenast som är af lagen, utan ock honom som är af Abrahams tro, hvilken är allas våra fader;
౧౬ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రాహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడా కృపను బట్టి వర్తించాలని, అది విశ్వాసమూలమైనది అయ్యింది. ఆ అబ్రాహాము మనందరికీ తండ్రి.
17 Som skrifvet är: Jag hafver satt dig till en fader öfver många Hedningar, för Gudi, den du trott hafver, hvilken de döda gör lefvande, och kallar de ting, som icke äro, lika som de voro.
౧౭దీని గురించే, “నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను” అని రాసి ఉంది. తాను నమ్ముకున్న దేవుని సమక్షంలో, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి.
18 Och han trodde på det hopp, der intet hopp var, att han skulle varda många Hedningars fader, som sagdt var till honom: Så skall din säd vara.
౧౮అలాగే, “నీ సంతానం ఇలా ఉంటుంది” అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎలాటి ఆశాభావం లేనప్పడు సైతం అతడు ఆశాభావంతో నమ్మాడు.
19 Och han vardt icke svag i trone, och aktade icke sin halfdöda kropp, ty han var när hundrade åra gammal; ej heller Saras halfdöda qved;
౧౯అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు.
20 Ty han tviflade intet på Guds löfte med otro; utan vardt stark i trone, gifvandes Gudi ärona;
౨౦అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు.
21 Och var full viss derpå, att den som lofvade, han var ock mägtig det att hålla.
౨౧దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు.
22 Derföre var det ock räknadt honom till rättfärdighet.
౨౨అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు.
23 Så är detta icke allenast skrifvet för hans skull, att honom tillräknadt vardt;
౨౩దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని కోసం మాత్రమే రాసి లేదు,
24 Utan ock för våra skull, som det också tillräknadt varder, när vi trom på honom, som vår Herra Jesum uppväckte ifrå de döda;
౨౪మన ప్రభు యేసును చనిపోయిన వారిలో నుండి లేపిన దేవునిలో విశ్వాసం ఉంచిన మనలను కూడా నీతిమంతులుగా ఎంచడానికి మన కోసం కూడా రాసి ఉంది.
25 Hvilken för våra synders skull är utgifven, och för våra rättfärdighets skull uppväckt.
౨౫ఆయనను దేవుడు మన అపరాధాల కోసం అప్పగించి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు.

< Romarbrevet 4 >