< Nehemja 5 >
1 Och sig upphof ett stort rop af folket, och deras hustrur, emot sina bröder Judarna.
౧తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
2 Och voro somlige, som sade: Våre söner och döttrar äro allt för månge; låt oss taga säd, och äta, att vi måge lefva.
౨కొందరు వచ్చి “మేమూ, మా కొడుకులూ కూతుళ్ళు చాలామంది ఉన్నాం. మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇప్పించు” అన్నారు.
3 Och somlige sade: Låt oss utsätta våra åkrar, vingårdar och hus, och taga säd i denna hårda tiden.
౩మరి కొంతమంది “కరువు కాలంలో మా భూములను, ద్రాక్షతోటలను, మా ఇళ్ళను తాకట్టు పెట్టాం, కనుక మాకు కూడా ధాన్యం ఇప్పించాలి” అన్నారు.
4 Somlige sade: Låt oss låna penningar på ränto till Konungen, på våra åkrar och vingårdar.
౪మరికొందరు “రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూములను, ద్రాక్షతోటలను తాకట్టు పెట్టాం.
5 Ty våra bröders kropp är såsom vår kropp, och deras barn såsom vår barn; eljest gifve vi våra söner och döttrar i träldom, och äre allaredo våra döttrar somliga undergifna, och ingen magt är i våra händer; komma också våra åkrar och vingårdar androm tillhanda.
౫మా కొడుకులను, కూతుళ్ళను బానిసలుగా పంపించ వలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటివారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు, ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు” అని చెప్పారు.
6 Då jag nu deras rop och dessa orden hörde, vardt jag ganska vred.
౬ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది.
7 Och mitt hjerta fick till råds, att jag straffade rådherrarna och öfverstarna, och sade till dem: Viljen I drifva ocker, den ene på den andra? Och jag hade tillhopa emot dem en stor församling;
౭అప్పుడు నాలో నేను ఆలోచించాను. ప్రధానులను, అధికారులను గద్దించాను “మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను.
8 Och sade till dem: Vi hafve igenköpt våra bröder Judarna, som Hedningomen sålde voro, efter våra förmågo; och I viljen också sälja edra bröder, de vi till oss köpt hafve? Då tego de, och funno intet till att svara.
౮“ఇతర ప్రజలకు అమ్ముడుబోయిన మన సోదర యూదులను మా శక్తి కొద్దీ విడిపించాం. మళ్ళీ మన సాటి యూదులు అమ్ముడుబోయేలా మీరు చేస్తున్నారా?” అని వారితో అన్నాను. వారు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు.
9 Och jag sade: Det är icke godt, som I gören. Skullen I icke vandra i Gudsfruktan, för Hedningarnas försmädelses skull, våra fiendars?
౯నేను ఇలా అన్నాను “మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నుండి వచ్చే నిందను బట్టి మన దేవుని పట్ల భయం కలిగి ఉండాలి కదా?
10 Jag och mine bröder, och mine tjenare, hafvom ock fått dem penningar och säd; men ockret vilje vi låta blifva tillbaka.
౧౦నేనూ నా బంధువులు, నా బానిసలు కూడా వారికి అప్పు ఇచ్చాం. ఆ బాకీలన్నీ వదిలేస్తున్నాం.
11 Så får dem nu i denna dag igen sina åkrar, vingårdar, oljogårdar och hus, och hundradedelen af penningomen för säd, vin och oljo, som I på dem ockrat hafven.
౧౧ఈ రోజే వాళ్ళ దగ్గరనుండి మీరు ఆక్రమించుకొన్న భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి.”
12 Då sade de: Vi vilje få dem det igen, och vilje intet äska af dem; och vilje göra såsom du sagt hafver. Och jag kallade Presterna, och tog en ed af dem, att de så göra skulle.
౧౨అప్పుడు వాళ్ళు “నువ్వు చెప్పినట్టుగా అవన్నీ ఇచ్చేస్తాం, వాళ్ళ నుండి ఏదీ ఆశించం” అన్నారు. నేను యాజకులను పిలిచి వాళ్ళు వాగ్దానం చేసినట్టు జరిగిస్తామని వాళ్ళచేత ప్రమాణం చేయించాను.
13 Och jag skuddade mitt sköte ut, och sade: Så skudde Gud hvar och en af sitt hus, och ifrå hans arbete, den icke blifver vid detta ord, så att han blifve utskuddad och blottad. Och hela församlingen sade Amen; och lofvade Herran. Och folket gjorde så.
౧౩నేను నా దుప్పటి దులిపి “ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వ్యక్తినీ అతని ఇంట్లో, ఆస్తిలో పాలు లేకుండా దేవుడు దులిపి వేస్తాడు గాక. ఆ విధంగా అలాంటివాడు దులిపి వేసినట్టుగా అన్నీ పోగొట్టుకుంటాడు” అని చెప్పాను. సమాజమంతా “అలాగే జరుగుతుంది గాక” అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా ఈ వాగ్దానం ప్రకారం చేశారు.
14 Desslikes, ifrå den tiden, då mig vardt befaldt att vara landshöfding i Juda land, nämliga ifrå tjugonde årena, allt intill annat och tretionde året Konungs Arthahsasta, det är i tolf år, höll jag mig och mina bröder intet af höfdingakoste.
౧౪నేను యూదా దేశంలో వారికి అధికారిగా వచ్చినప్పటినుండి, అంటే అర్తహషస్త రాజు పాలనలో 20 వ సంవత్సరం నుండి 32 వ సంవత్సరం దాకా ఈ 12 సంవత్సరాలు అధికారిగా నాకు రావలసిన ఆహార పదార్థాలను నేను గానీ, నా బంధువులు గానీ తీసుకోలేదు.
15 Förty de förre landshöfdingar, som för mig varit hade, hade besvärat folket, och hade tagit af dem bröd och vin, och dertill fyratio siklar silfver, och deras tjenare hade haft sig väldeliga med folket; men jag gjorde icke så, för Gudsfruktans skull.
౧౫అయితే నాకు ముందున్న అధికారులు ప్రజల నుండి ఆహారం, ద్రాక్షారసం, 40 తులాల వెండి చొప్పున తీసుకుంటూ వచ్చారు. వారి సేవకులు కూడా ప్రజలపై ఆధికారం చెలాయించేవారు. అయితే దేవుని పట్ల భయభక్తులు ఉన్న కారణంగా నేనలా చేయలేదు.
16 Arbetade jag ock på murarbetet, och köpte ingen åker; och alle mine tjenare måste der komma samman till arbetes.
౧౬నేను ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమయ్యాను. నా పనివాళ్ళు కూడా నాతో కలసి పని చేస్తూ వచ్చారు. మేము భూములు ఏమీ సంపాదించుకోలేదు.
17 Dertill voro ock af Judarna och Förstarna hundrade och femtio vid mitt bord, som till mig komne voro ifrå Hedningarna, som kringom oss äro.
౧౭నా భోజనం బల్ల దగ్గర మా చుట్టూ ఉన్న అన్యదేశాల నుండి వచ్చిన ప్రజలతోపాటు యూదులు, అధికారులు మొత్తం 150 మంది మాతో కలసి భోజనం చేసేవాళ్ళు.
18 Och man måste beställa mig om dagen en oxa, och sex utvald får, och foglar, och ju i tio dagar allahanda vin tillfyllest. Likväl äskade jag intet höfdingakosten; förty tungen var svår på folkena.
౧౮నా కోసం ప్రతి రోజూ ఒక ఎద్దు, ఆరు శ్రేష్ఠమైన గొర్రెలు భోజనం కోసం సిద్ధం చేసేవారు. ఇవి కాకుండా పిట్టలు, పది రోజులకొకసారి రకరకాల ద్రాక్షారసాలు సమృద్ధిగా సిద్ధపరిచే వారు. అయినప్పటికీ ఈ ప్రజలు ఎంతో కఠినమైన బానిసత్వం కింద ఉన్నందువల్ల అధికారిగా నాకు రావలసిన రాబడి నేను ఆశించలేదు.
19 Min Gud, betänk mig till godo allt det jag desso folkena gjorde.
౧౯నా దేవా, నేను ఈ ప్రజల కోసం చేసిన అన్ని రకాల ఉపకారాలనుబట్టి నన్ను జ్ఞాపకముంచుకుని కరుణించు.