< Lukas 13 >
1 På samma tid voro der någre tillstädes, som bådade honom om de Galileer, hvilkas blod Pilatus hade blandat med deras offer.
౧కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు.
2 Då svarade Jesus, och sade till dem: Menen I att desse Galileer voro syndare för alla Galileer, efter de sådant ledo?
౨అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా?
3 Nej, säger jag eder; utan om I icke bättren eder, skolen I alle sammalunda förgås.
౩కారని మీతో చెబుతున్నాను. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
4 Eller de aderton, som tornet i Siloa föll uppå, och drap dem, menen I att de brottslige voro för alla menniskor, som bo i Jerusalem?
౪అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా?
5 Nej, säger jag eder; utan om I icke bättren eder, skolen I alle sammalunda förgås.
౫కానే కాదని మీతో చెబుతున్నా. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.”
6 Sade han ock denna liknelsen: En man hade ett fikonaträ planteradt i sin vingård, och han kom och sökte frukt derpå, och fann ingen.
౬తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు.
7 Då sade han till vingårdsmannen: Si, nu i tre år hafver jag kommit, och sökt frukt på detta fikonaträt, och finner ingen; hugg det bort; hvarefter skall det förhindra jordena?
౭దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో, ‘మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గానీ నాకేమీ దొరకడం లేదు. దీన్ని నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి’ అన్నాడు.
8 Han svarade, och sade till honom: Herre, låt stå det ännu i detta året, så länge jag grafver omkring det och göder det;
౮అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి,
9 Om det så kunde bära frukt; hvar ock icke, så hugg det sedan bort.
౯అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి’ అన్నాడు.”
10 Och han lärde om Sabbathen i en Synagogo.
౧౦ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు.
11 Och si, der var en qvinna, som hade haft krankhetenes anda i aderton år; och var krumpen, och förmådde icke upplyfta hufvudet.
౧౧బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది.
12 När Jesus såg henne, kallade han henne till sig, och sade till henne: Qvinna, var fri af dine krankhet.
౧౨యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి
13 Och han lade händerna på henne: och straxt reste hon sig upp, och prisade Gud.
౧౩ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది.
14 Då svarade öfversten för Synagogon, och var vred att Jesus helade på Sabbathen, och sade till folket: Sex dagar äro, der I mågen arbeta på; kommer på dem, och låter hela eder; icke på Sabbathen.
౧౪యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు.
15 Då svarade Herren honom, och sade: Du skrymtare, löser icke hvar och en af eder om Sabbathen sin oxa eller åsna ifrå krubbone, och leder bort att vattna?
౧౫అందుకు ప్రభువు, “కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా.
16 Måtte man då icke lösa af detta bandet, på Sabbathen, denna Abrahams dotter, hvilken Satan bundit hafver, si, nu i aderton år?
౧౬ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు.
17 Och då han detta sade, skämde sig alle som honom emotståndit hade, och allt folket gladde sig af de härliga gerningar, som gjordes af honom.
౧౭ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
18 Så sade han då: Hvem är Guds rike likt? Och vid hvad skall jag likna det?
౧౮ఆయన ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చగలం?
19 Det är likt vid ett senapskorn, som en man tog, och sådde i sin örtagård; och det växte, och blef ett stort trä, och foglarna under himmelen bodde på dess qvistar.
౧౯అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి.”
20 Och åter sade han: Vid hvad skall jag likna Guds rike?
౨౦మళ్ళీ ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం?
21 Det är likt enom surdeg, hvilken en qvinna tog, och lade in uti tre skäppor mjöl, tilldess det surnade alltsammans.
౨౧ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి, దానిలో వేసే పుల్లని పిండిలాగా ఉంది” అన్నాడు.
22 Och han gick igenom städer och byar, och lärde, och tog vägen åt Jerusalem.
౨౨ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు.
23 Och en sade till honom: Herre, äro de ock få, som varda salige? Då sade han till dem:
౨౩ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు.
24 Vinnlägger eder derom, att I kunnen ingå igenom den trånga porten; ty månge, säger jag eder, skola söka derefter, att de må inkomma, och skola dock icke kunna.
౨౪దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను.
25 Sedan husbonden hafver uppståndit, och låtit dörren igen; och I begynnen stå ute, och bulta på dörren, sägande: Herre, Herre, låt upp för oss; och han svarar, och säger till eder: Jag vet intet af eder, hvadan I ären;
౨౫ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే
26 Då skolen I begynna säga: Vi hafvom ätit och druckit med dig, och du hafver lärt på våra gator.
౨౬ఆయన, ‘మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు’ అని మీతో అంటాడు. అప్పుడు మీరు, ‘నీ ఎదుటనే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా’ అంటారు.
27 Och han skall säga: Jag säger eder, jag vet intet af eder, hvadan I ären; går ifrå mig, alle I ogerningsmän.
౨౭అప్పుడు ఆయన, ‘మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేసేవారు. నా దగ్గరనుంచి పొండి’ అంటాడు.
28 Och der skall vara gråt och tandagnisslan; när I fån se Abraham, Isaac och Jacob, och alla Propheterna, i Guds rike; och eder utdrifvas.
౨౮అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు.
29 Och de skola komma ifrån östan och vestan, och nordan och sunnan, och skola sitta till bords i Guds rike.
౨౯ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు.
30 Och si, det äro någre ytterste, som skola varda de främste; och någre främste, som skola varda de ytterste.
౩౦ఇదిగో వినండి, చివరి వారు మొదటి వారవుతారు, అలాగే మొదటివారు చివరి వారవుతారు.”
31 Samma dagen gingo någre Phariseer fram, och sade till honom: Skynda dig, och gack hädan; ty Herodes vill dräpa dig.
౩౧అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి, “నువ్వు ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు” అని ఆయనతో చెప్పారు.
32 Då sade han till dem: Går, och säger dem räfvenom: Si, jag utdrifver djeflar, och helar i dag, och i morgon; och tredje dagen varder det ändadt med mig.
౩౨ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను.
33 Dock likväl måste jag ännu vandra i dag, och i morgon, och öfvermorgon; ty det kan icke vara, att en Prophet förgås annorstädes än i Jerusalem.
౩౩అయితే ఈ రోజూ రేపూ ఆ తరువాత కూడా నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే యెరూషలేముకు బయట ప్రవక్త హతం కావడం జరగదు.
34 Jerusalem, Jerusalem, du som dräper Propheterna, och stenar dem som sändas till dig; huru ofta ville jag församla din barn, likavisst som foglen sitt näste under sina vingar; och I villen icke?
౩౪“యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు.
35 Si, edart hus skall varda eder öde; och säger jag eder, att I skolen icke se mig, tilldess tiden kommer, att I varden sägande: Välsignad är han, som kommer i Herrans Namn.
౩౫ఇదిగో విను! నీ ఇల్లు నీకు పాడుగా విడిచి పెడుతున్నాను. ‘ప్రభువు పేరిట వచ్చే వాడు ధన్యుడు’ అని నువ్వు చెప్పేంతవరకూ నన్ను మళ్ళీ చూడవని నీతో కచ్చితంగా చెబుతున్నాను,” అన్నాడు.