< Hebreerbrevet 9 >
1 Hade ock väl det första sina rätter, och Gudstjenst, och utvärtes helighet.
౧మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి.
2 Ty det främre tabernaklet var der uppsatt; uti hvilko voro ljusastakarne, och bordet, och skådobröden; och detta kallades det Helga.
౨ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
3 Men bak den andra förlåten var det tabernaklet, som man kallade det Aldrahelgasta;
౩ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
4 Hvilket hade det gyldene rökelsekaret, och Testamentsens ark, på alla sidor beslagen med guld; uti hvilko var det gyldene ämbar, der det himmelsbrödet uti var, och Aarons staf, som blomstrats hade, och Testamentsens taflor;
౪అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి.
5 Men der ofvanuppå voro härlighetenes Cherubim, som öfverskyggde Nådastolen; af hvilka stycker på denna tid icke besynnerliga är sägandes.
౫“కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు.
6 Då nu detta så beredt var, gingo Presterna alltid in i det främre tabernaklet, och uträttade Gudstjensten.
౬వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారంలోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు.
7 Men uti det andra gick allenast den öfverste Presten, en tid om året; icke utan blod, den han offrade för sina egna, och för folkens synder;
౭కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తానూ, తన ప్రజలూ తెలియక చేసిన దోషాల కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకోకుండా ప్రవేశించడు.
8 Der den Helge Ande med betydde, att helighetenes väg ändå icke uppenbar var, emedan det första tabernaklet stod;
౮దీన్ని బట్టి, ఆ మొదటి మందిరం నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం వెల్లడి కాలేదని పరిశుద్ధాత్మ స్పష్టం చేస్తున్నాడు.
9 Hvilket var en liknelse i den tiden, i hvilkom gåfvor och offer offrades, och kunde icke göra honom fullkommen, efter samvetet, som den Gudstjensten gjorde;
౯ఆ గుడారం, ఈ కాలానికి ఒక ఉదాహరణగా ఉంది. ఈ అర్పణలూ కానుకలూ ఆరాధించే వ్యక్తి మనస్సాక్షిని పరిపూర్ణం చేయలేక పోయాయి.
10 Allenast med mat och dryck, och mångahanda tvagning, och utvärtes helighet, som pålagda voro intill bättringenes tid.
౧౦ఇవి కేవలం అన్నపానాలకు, పలురకాల ప్రక్షాళనలకు సంబంధించిన ఆచారాలు. ఇవి నూతన వ్యవస్థ వచ్చేంత వరకూ నిలిచి ఉండే శరీర సంబంధమైన నియమాలు.
11 Men Christus är kommen, att han skall vara öfverste Prest till det tillkommande goda, genom ett större och fullkomligare tabernakel, det med händer icke gjordt är, det är, det icke så bygdt är;
౧౧అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు.
12 Icke heller genom bockablod, eller kalfvablod; utan han är genom sitt eget blod ena reso ingången uti det helga, och hafver funnit en evig förlossning. (aiōnios )
౧౨మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు. (aiōnios )
13 Ty hafver oxablod och bockablod, och strödd aska af kone, helgat de orena, till köttslig renhet;
౧౩ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే
14 Huru mycket mer skall Christi blod, som hafver sig sjelf obesmittad, genom den Helga Anda, Gudi offrat, rena vårt samvet af de döda gerningar, till att tjena lefvandes Gud? (aiōnios )
౧౪ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి! (aiōnios )
15 Derföre är han ock Nya Testamentsens Medlare; på det de, som kallade äro, skulle få dess eviga arfsens löfte, i thy att hans död gick deremellan, till förlossning ifrå de öfverträdelser, som under det förra Testamentet voro. (aiōnios )
౧౫ఈ కారణం చేత ఈ కొత్త ఒప్పందానికి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇలా ఎందుకంటే, మొదటి ఒప్పందం కింద ఉన్న ప్రజలను వారు చేసిన పాపాలకు కలిగే శిక్ష నుండి విడిపించడానికి ఒకరు చనిపోయారు. కాబట్టి దేవుడు పిలిచిన వారు ఆయన వాగ్దానం చేసిన తమ శాశ్వతమైన వారసత్వాన్ని స్వీకరించడానికి వీలు కలిగింది. (aiōnios )
16 Ty hvar ett Testament är, måste ock hans död med vara, som Testamentet gjorde.
౧౬ఎవరైనా వీలునామా వదిలి వెళ్తే, ఆ వ్యక్తి మరణించాడని నిరూపణ కావాలి.
17 Ty Testamentet blifver gildt genom döden; annars hafver det ännu ingen magt, så länge han lefver som Testamentet gjorde.
౧౭మరణం ఉంటేనే వీలునామా చెల్లుబాటు అవుతుంది. దాన్ని రాసిన వాడు బతికి ఉండగా ఆ వీలునామా చెల్లదు.
18 Derföre var ock icke det första stiktadt utan blod.
౧౮కాబట్టి మొదటి ఒప్పందం కూడా రక్తం లేకుండా ఏర్పడలేదు.
19 Ty då Moses allo folkena föregifvit hade hvart och ett budord, efter lagen, tog han kalfvablod, och bockablod, med vatten, och purpurull, och hysop, och bestänkte bokena, och allt folket;
౧౯మోషే కూడా ధర్మశాస్త్రంలోని అన్ని ఆదేశాలనూ ప్రజలకు వివరించిన తరువాత కోడెదూడల, మేకల రక్తాన్ని నీళ్ళతో కలిపి ఎర్రని ఉన్ని, హిస్సోపుతో దాన్ని తీసుకుని ధర్మశాస్త్రగ్రంథం చుట్ట మీదా, ప్రజలందరి మీదా చిలకరించాడు.
20 Och sade: Detta är Testamentsens blod, det Gud hafver eder budit.
౨౦తరువాత, “ఇది నిబంధన రక్తం. దీనిలోనే దేవుడు మీకు ఆదేశాలు ఇచ్చాడు” అని చెప్పాడు.
21 Och desslikes tabernaklet, och all kärile, der Gudstjenst plägade med göras, bestänkte han sammalunda med blod.
౨౧అలాగే ఆ రక్తాన్ని, ఆరాధనా గుడారం పైనా, గుడారంలోని యాజక సేవకు ఉపయోగించే పాత్రలన్నిటిపైనా చిలకరించాడు.
22 Och varda mest all ting efter lagen ren gjord i blod; och utan blodsutgjutelse sker ingen förlåtelse.
౨౨ధర్మశాస్త్రం ప్రకారం, దాదాపు వస్తువులన్నీ రక్తం వల్ల శుద్ధి అవుతాయి. రక్తం చిందించకపోతే పాపాలకు క్షమాపణ కలగదు.
23 Så är nu af nöden, att de himmelska tings eftersyner skola med sådant renade varda; men de himmelska tingen måste bättre offer hafva, än dessa voro.
౨౩కాబట్టి పరలోకంలో ఉన్నవాటికి నకలుగా ఉన్న వస్తువులు జంతు బలుల వల్ల శుద్ధి కావలసి ఉంది. అయితే అసలు పరలోకానికి సంబంధించినవి శుద్ధి కావాలంటే అంతకంటే శ్రేష్ఠమైన బలులు జరగాలి.
24 Ty Christus är icke ingången i det helga, som med händer gjordt är, hvilket är en eftersyn till det sannskyldiga; utan in uti sjelfva himmelen, på det han skall nu vara i Guds åsyn för oss;
౨౪అందుచేత చేతులతో నిర్మాణం జరిగి, నిజమైన దానికి నకలుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి క్రీస్తు ప్రవేశించలేదు, ప్రస్తుతం ఆయన మనందరి కోసమూ దేవుని సన్నిధిలో కనిపించడానికి ఏకంగా పరలోకంలోకే ప్రవేశించాడు.
25 Icke, att han skall ofta offra sig, såsom öfverste Presten gick hvart år in uti det heliga, med annars blod;
౨౫అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని వేరే రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అయితే యేసు పదే పదే తనను తాను అర్పించుకోడానికి అక్కడికి వెళ్ళలేదు.
26 Eljest måste han skolat ofta lida, af verldenes begynnelse; men nu, på verldenes ändalykt, är han en gång uppenbarad, genom sitt eget offer, till att borttaga syndena. (aiōn )
౨౬ఒకవేళ ఆయన పదేపదే అక్కడికి వెళ్ళాల్సి వస్తే భూమి ప్రారంభం నుండి ఆయన అనేకసార్లు హింస పొందాల్సి వచ్చేది. కానీ ఆయన ఈ కాలాంతంలో ప్రత్యక్షమై ఒకేసారి తనను తాను బలిగా అర్పించడం ద్వారా పాపాన్ని తీసివేశాడు. (aiōn )
27 Och såsom menniskomen är förelagdt en gång dö, men sedan domen;
౨౭మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తరువాత తీర్పు జరుగుతుంది.
28 Så är ock Christus ena reso offrad, till att borttaga mångs mans synder; men en annan gång skall han låta se sig, utan synd, dem som honom vänta till salighet.
౨౮అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాల కోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.