< 5 Mosebok 11 >
1 Så skall du nu älska Herran din Gud, och hålla hans lag, hans seder, hans rätter och hans bud, så länge du lefver.
౧“కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.
2 Och förnimmer i dag det edor barn icke veta, eller sett hafva; nämliga Herrans edars Guds tuktan, hans härlighet, och hans mägtiga hand, och uträckta arm;
౨మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.
3 Och hans tecken och verk, som han gjorde ibland de Egyptier, på Pharao, Konungen i Egypten, och på allt hans land;
౩ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు,
4 Och hvad han gjorde på de Egyptiers magt; på deras hästar och vagnar, då han lät komma vattnet af det röda hafvet öfver dem, när de foro efter eder, och Herren förgjorde dem, allt intill denna dag;
౪ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు.
5 Och hvad han eder gjorde i öknene, intilldess I nu till detta rummet komne ären;
౫యెహోవా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు.
6 Hvad han gjorde Dathan och Abiram, Eliabs sönom, Rubens sons; huru jorden öppnade sin mun, och uppsvalg dem med deras folk och tjäll, och alla deras ägodelar, som under dem voro, midt i hela Israel.
౬అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు.
7 Ty edor ögon hafva sett de stora Herrans gerningar, som han gjort hafver.
౭యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా.
8 Derföre skolen I hålla all de bud, som jag bjuder eder i dag, på det I skolen styrkte varda till att komma in, och intaga landet, dit I faren till att intaga det;
౮కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ,
9 Och att du skall länge lefva i landena, som Herren edra fäder svorit hafver att gifva dem och deras säd, ett land der mjölk och hannog uti flyter.
౯యెహోవా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి.
10 Ty det landet, som du kommer till att intaga, är icke såsom Egypti land, der I utdragne ären, der man sår säd, och bär dit vatten till fots, såsom till en kålgård;
౧౦మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు.
11 Utan det hafver berg, och slättmarker, hvilka regn af himmelen vattna måste;
౧౧మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.
12 Om hvilket land Herren din Gud låter sig vårda, och Herrans dins Guds ögon se alltid deruppå, ifrå begynnelsen på året, intill ändan.
౧౨అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.
13 Om I nu hören min bud, som jag bjuder eder i dag, att I älsken Herran edar Gud, och tjenen honom af allt hjerta, och af allo själ;
౧౩కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే,
14 Så skall jag gifva edro lande regn i sinom tid, arla och serla, att du skall inberga din säd, ditt vin, och dina oljo;
౧౪మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు.
15 Och skall gifva dinom boskap gräs på dine mark, att I mågen äta och varda mätte.
౧౫మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.
16 Men tager eder vara, att edart hjerta icke låter draga sig dertill, att I afträden, och tjenen andra gudar, och tillbedjen dem;
౧౬మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.
17 Och Herrans vrede förgrymmar sig då öfver eder, och lycker himmelen till, att intet regn kommer, och jorden icke gifver sin växt, och I snarliga förgås utaf det goda landet, som Herren eder gifvit hafver.
౧౭లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.
18 Så fatter nu dessa orden i hjertat, och i edra själar, och binder dem för ett tecken på edra hand, att de äro till en åminnelse för edor ögon;
౧౮కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి.
19 Och lärer dem edor barn, så att du talar derom, när du sitter i dino huse, eller går på vägen; när du lägger dig neder, och när du uppstår.
౧౯మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.
20 Och skrif dem på dörrträn i dino huse, och på dine dörr;
౨౦మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.
21 Att du och din barn mågen länge lefva i landena, som Herren dine fäder svorit hafver att gifva dem, så länge dagarna af himmelen på jordene vara.
౨౧ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.
22 Ty om I alla dessa buden hållen, som jag bjuder eder, och derefter gören, så att I älsken Herran edar Gud, och vandren i alla hans vägar, och håller eder intill honom;
౨౨మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి.
23 Så skall Herren fördrifva allt detta folket för eder, så att I skolen intaga större och starkare folk än I ären.
౨౩అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు.
24 All rum, som edar fot på träder, skola vara edor; ifrån öknene och ifrå berget Libanon, och ifrån älfvene Phrath, allt intill det yttersta hafvet, skall edart landamäre vara.
౨౪మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది.
25 Ingen skall kunna stå eder emot; edar räddhåga och förfärelse skall Herren låta komma öfver all de land, der I inresen, såsom han eder sagt hafver.
౨౫ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు.
26 Si, jag lägger eder före i dag välsignelse och förbannelse:
౨౬చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను.
27 Välsignelse, om I lyden Herrans edars Guds bud, som jag bjuder eder i dag;
౨౭నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది.
28 Förbannelse, om I icke lyden Herrans edars Guds bud, och afträden ifrå den vägen, som jag bjuder eder i dag, så att I vandren efter andra gudar, de I icke kännen.
౨౮మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.
29 När Herren din Gud förer dig in i det land, der du inkommer till att intagat, så skall du låta tala välsignelsen på det berget Grisim, och förbannelsen på det berget Ebal;
౨౯కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి.
30 Hvilke äro på hinsidon Jordan, på den vägen vesterut, i de Cananeers lande, som bo på den slättmarkene in emot Gilgal, vid den lunden More.
౩౦అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా.
31 Ty du måste gå öfver Jordan, att du inkommer, och tager landet in, som Herren edar Gud eder gifvit hafver, att I det intaga och deruti bo skolen.
౩౧మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు.
32 Så ser nu till, att I gören efter all de bud och rätter, som jag eder i dag förelägger.
౩౨ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి.”