< 2 Kungaboken 16 >
1 Uti sjuttonde årena Pekah, Remalia sons, vardt Ahas Konung, Jothams, Juda Konungs, son.
౧రెమల్యా కొడుకు పెకహు పరిపాలనలో 17 వ సంవత్సరంలో యూదా రాజు యోతాము కొడుకు ఆహాజు పరిపాలన ఆరంభించాడు.
2 Tjugu åra gammal var Ahas, då han vardt Konung, och regerade sexton år i Jerusalem, och gjorde intet det Herranom hans Gud behagade, såsom hans fader David.
౨ఆహాజు పరిపాలన ఆరంభించినప్పుడు 27 సంవత్సరాల వయస్సు ఉండి, యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. తన పూర్వికుడైన దావీదు తన దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించినట్టు అతడు ప్రవర్తించకుండా ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు.
3 Ty han vandrade på Israels Konungars väg; dertill lät han sin son gå igenom eld, efter de Hedningars styggelse, hvilka Herren för Israels barn fördrifvit hade.
౩అతడు, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన జాతులు చేసిన హేయమైన పనులు చేస్తూ, తన కొడుకును దహన బలిగా అర్పించాడు.
4 Och han gjorde offer, och rökte på höjderna, och på alla backar, och under all grön trä.
౪ఇంకా అతడు ఉన్నత స్థలాల్లో, కొండల మీద, అన్ని రకాల పచ్చని వృక్షాల కింద, బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చాడు.
5 På den tiden drog Rezin, Konungen i Syrien, och Pekah, Remalia son, Israels Konung, upp till Jerusalem till att strida, och belade Ahas; men de kunde icke vinna det.
౫సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు రెమల్యా కొడుకు పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి, అక్కడ ఉన్న ఆహాజును, పట్టణాన్నీ చుట్టుముట్టారు గాని అతన్ని జయించలేక పోయారు.
6 På samma tiden fick Rezin, Konungen i Syrien, Elath igen till Syrien, och dref Judarna utur Elath. Och de Syrier kommo, och bodde deruti, allt intill denna dag.
౬ఆ కాలంలో సిరియా రాజు రెజీను ఏలతును మళ్ళీ పట్టుకుని సిరియనుల వశం చేసి, ఏలతులోనుంచి యూదా వాళ్ళను వెళ్లగొట్టినప్పుడు సిరియనులు ఏలతు పట్టణానికి వచ్చి నివాసం ఉన్నారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.
7 Men Ahas sände båd till Thiglath Pileser, Konungen i Assyrien, och lät säga honom: Jag är din tjenare, och din son. Kom hitupp, och hjelp mig utu Konungens hand i Syrien, och Israels Konungs, hvilka sig emot mig upprest hafva.
౭ఇది ఇలా ఉండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనవీ, రాజనగరు సంబంధమైనవీ అయిన సామానుల్లో కనబడిన వెండి బంగారాలను తీసుకుని అష్షూరు రాజుకు కానుకగా పంపి,
8 Och Ahas tog det silfver och guld, som i Herrans huse och uti Konungshusens fatebur funnet vardt, och sände Konungenom i Assyrien skänker.
౮“నేను నీ సేవకుణ్ణి, నీ కొడుకులాంటి వాణ్ణి గనుక నీవు వచ్చి, నా మీద దండెత్తిన సిరియా రాజు చేతిలో నుంచి, ఇశ్రాయేలురాజు చేతిలో నుంచి నన్ను రక్షించాలి” అని అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు దగ్గరికి వార్తాహరులను పంపాడు.
9 Och Konungen i Assyrien hörde honom; och drog upp till Damascon, och vann det; och förde dem bort till Kir, och drap Rezin.
౯అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు పట్టణం మీద దాడి చేసి దాన్ని చెర పట్టుకుని, రెజీనును హతం చేసి ఆ ప్రజలను కీరు పట్టణానికి బందీలుగా తీసుకుని వెళ్ళాడు.
10 Och Konung Ahas drog emot ThiglathPileser, Konungen i Assyrien, till Damascon. Och då han såg ett altare, som i Damascon var, sände Konung Ahas ett mönster och en efterliknelse till Presten Uria, såsom det gjordt var.
౧౦రాజైన ఆహాజు అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వచ్చి, దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని పనితనం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.
11 Och Uria Presten byggde ett altare, och gjorde det efter det, som Konung Ahas honom sändt hade ifrå Damascon, tilldess Konung Ahas kom ifrå Damascon.
౧౧యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు పట్టణం నుంచి పంపిన నమూనాకు సరిపడిన బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు దమస్కు నుంచి తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు.
12 Och då Konungen kom ifrå Damascon och såg altaret, offrade han deruppå;
౧౨అప్పుడు రాజు దమస్కు నుంచి వచ్చి బలిపీఠాన్ని చూసి, ఆ బలిపీఠం సమీపించి, ఎక్కి,
13 Och upptände deruppå sitt bränneoffer, och spisoffer, och göt deruppå sitt drickoffer; och blodet af tackoffrena, som han offrade, lät han stänka på altaret.
౧౩దహన బలి, నైవేద్యం అర్పించి, పానార్పణం చేసి, తాను అర్పించిన సమాధానబలి పశువుల రక్తాన్ని దాని మీద చల్లాడు.
14 Men det kopparaltaret, som för Herranom stod, tog han bort, så att det icke skulle stå emellan altaret och Herrans hus; utan satte det utmed sidona vid altaret norrut.
౧౪ఇంకా, యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలివేదికను మందిరం ముందున్న స్థలం నుంచి, అంటే, తాను కట్టించిన బలిపీఠానికీ, యెహోవా మందిరానికీ మధ్య నుంచి తొలగించి, తాను కట్టించిన దానికి ఉత్తరం వైపు దాన్ని ఉంచాడు.
15 Och Konung Ahas böd Prestenom Uria, och sade: På det stora altaret skall du upptända bränneoffer om morgonen, och spisoffer om aftonen, och Konungens bränneoffer, och hans spisoffer, och allt folkens bränneoffer i landena, samt med deras spisoffer, och drickoffer; och allt blodet af bränneoffret, och af allo andro offer skall du stänka deruppå; men om kopparaltaret vill jag vara förtänkt hvad jag göra skall.
౧౫అప్పుడు ఆహాజు రాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపిస్తూ “ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహనబలులూ, సాయంత్రం అర్పించే నైవేద్యాలూ రాజు చేసే దహనబలి, నైవేద్యాలూ, దేశపు ప్రజలందరూ అర్పించే దహనబలులు, నైవేద్యాలూ, పానార్పణలూ ఇంకా ఏ దహనబలి జరిగినా, అ బలి పశువుల రక్తాన్ని దాని మీదే చల్లాలి. అయితే, నేను దేవుణ్ణి సహాయం అడగడానికి ఈ ఇత్తడి బలిపీఠం ఉండాలి” అన్నాడు.
16 Presten Uria gjorde allt det Konung Ahas befallde honom.
౧౬యాజకుడైన ఊరియా ఆహాజు రాజు ఆజ్ఞ ప్రకారం అంతా చేశాడు.
17 Och Konung Ahas bröt bort sidorna af stolarna, och hof bort kettlarna deraf, och hafvet hof han utaf de kopparoxar, som voro derunder, och satte det uppå stengolfvet;
౧౭ఇంకా, ఆహాజు రాజు కదిలే పీట మీది నుండి తొట్టిని పక్కన ఉండే పలకలను తీయించాడు. కంచు ఎద్దుల మీద ఉన్న గంగాళాన్ని దింపి, రాతి అరుగు మీద దాన్ని ఉంచాడు.
18 Dertill Sabbathspredikostolen, den de i husena byggt hade. Och Konungsgången utantill vände han i Herrans hus, för Konungens skull i Assyrien.
౧౮ఇంకా అతడు అష్షూరు రాజుకు భయపడి విశ్రాంతి దినం ఆచరణ కోసం మందిరంలో కట్టి ఉన్న మంటపాన్ని, రాజు ప్రాంగణంలోనుంచి వెళ్ళే దారిని యెహోవా మందిరం నుంచి తీసేశాడు.
19 Hvad nu mer af Ahas sägandes är? hvad han gjort hafver, si, det är skrifvet i Juda Konungars Chrönico.
౧౯ఆహాజు చేసిన ఇతర పనుల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
20 Och Ahas afsomnade med sina fäder, och vardt begrafven när sina fäder uti Davids stad; och Hiskia hans son vardt Konung i hans stad.
౨౦ఆహాజు తన పూర్వీకులతోబాటు చనిపోయినప్పుడు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని కొడుకు హిజ్కియా అతని స్థానంలో రాజయ్యాడు.