< 1 Krönikeboken 4 >
1 Juda barn voro: Perez, Hezron, Charmi, Hur och Sobal.
౧యూదా కొడుకులు పెరెసు, హెస్రోను, కర్మీహూరు, శోబాలు అనేవాళ్ళు.
2 Men Reaja, Sobals son, födde Jahath. Jahath födde Ahumai och Lahad. Det äro de Zorgathiters slägter.
౨శోబాలు కొడుకు పేరు రెవాయా. రెవాయాకి యహతు పుట్టాడు. యహతుకి అహూమై, లహదు పుట్టారు. వీళ్ళు జొరాతీయుల తెగల మూల పురుషులు.
3 Detta är den fadrens Ethams slägte: Jisreel, Jisma, Jidbas; och deras syster het Hazelelponi.
౩అబీయేతాము సంతానం యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు హజ్జెలెల్పోని.
4 Och Pnuel, Gedors fader, och Eser, Husa fader. Det äro Hurs barn, den första Ephrata sons, BethLehems faders.
౪ఇక పెనూయేలు గెదోరీయులకు మూలపురుషుడు. ఏజెరు అనేవాడు హూషాయీయులకు మూలపురుషుడు. వీళ్ళంతా హూరు కొడుకులు. హూరు ఎఫ్రాతాకు పెద్ద కొడుకు, బేత్లెహేముకు తండ్రి.
5 Men Ashur, Thekoa fader, hade två hustrur: Helea och Naara.
౫అష్షూరు తండ్రి తెకోవ. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వీరి పేళ్ళు హెలా, నయరా.
6 Och Naara födde honom Ahusam, Hepher, Themeni, Ahastari. Det äro Naara barn.
౬నయరా ద్వారా అతనికి అహూజ్జాము, హెపెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీళ్ళు నయరా కొడుకులు.
7 Men Helea barn voro: Zereth, Jesohar och Ethnan.
౭హెలా కొడుకులెవరంటే జెరెతు, సోహరు, ఎత్నాను, కోజు.
8 Men Coz födde Anub, och Hazobeba, och de Aharhels slägter, Harums sons.
౮వీరిలో కోజు ద్వారా ఆనూబు, జోబేబా, హారుము కొడుకైన అహర్హేలు ద్వారా కలిగిన తెగల ప్రజలూ వచ్చారు.
9 Men Jabez var härligare än hans bröder; och hans moder kallade honom Jabez; ty hon sade: Jag hafver födt honom med bekymmer.
౯యబ్బేజు తన సోదరులందరి కంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది. ఎందుకంటే “యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను” అని చెప్పింది.
10 Och Jabez åkallade Israels Gud, och sade: Om du välsignar mig, och förvidgar mina gränsor, och din hand blifver med mig, och så skaffar med det onda, att det mig intet bekymrar. Och Gud lät ske som han bad.
౧౦ఈ యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడికి ఇలా విజ్ఞాపన చేశాడు. “నువ్వు నన్ను కచ్చితంగా ఆశీర్వదించు. నా భూభాగాన్ని విశాలం చెయ్యి. నీ చేతిని నాకు తోడుగా ఉంచు. నేను వేదన పడకుండా దయతో నన్ను కీడు నుండి తప్పించు.” దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతడు అడిగినట్టే అతనికి దయచేశాడు.
11 Men Chelub, Suahs broder, födde Mehir, det är Esthons fader.
౧౧షూవహు సోదరుడైన కెలూబు కొడుకు పేరు మెహీరు. ఇతని కొడుకు పేరు ఎష్తోను.
12 Men Esthon födde Bethrapha, Paseah och Thehinna, fadren till den staden Nahas. Det äro de män af Recha.
౧౨ఎష్తోను కొడుకులు బేత్రాఫా, పాసెయా, తెహిన్నా అనే వాళ్ళు. ఈ తెహిన్నా ఈర్నాహాషుకు తండ్రి. వీళ్ళు రేకాకు చెందిన వాళ్ళు.
13 Kenas barn voro: Athniel och Seraja. Athniels barn voro: Hathath.
౧౩కనజు కొడుకుల పేర్లు ఒత్నీయేలు శెరాయా. ఒత్నీయేలు కొడుకుల్లో హతతు అనే ఒకడుండేవాడు.
14 Och Meonothai födde Ophra. Och Seraja födde Joab, en fader åt de timbermän i dalenom; ty de voro timbermän.
౧౪మెయానొతైకి ఒఫ్రా పుట్టాడు. శెరాయా కొడుకు పేరు యోవాబు. ఇతడు నిపుణులైన చేతి వృత్తుల వాళ్ళ లోయలో జీవించే వారికి మూలపురుషుడు. ఆ లోయలో ఉన్న వాళ్ళంతా చేతిపనుల వాళ్ళే.
15 Calebs barn, Jephunne sons, voro: Iru, Ela och Naam. Ela barn voro: Kenas.
౧౫యెఫున్నె కొడుకైన కాలేబుకు ఈరు, ఏలా, నయం పుట్టారు. ఏలా కొడుకుల్లో కనజు అనే వాడున్నాడు.
16 Jehaleleels barn voro: Siph, Sipha, Thiria och Asareel.
౧౬యెహల్లెలేలు కొడుకులు జీఫు, జీఫా, తీర్యా, అశర్యే.
17 Esra barn voro: Jether, Mered, Epher och Jalon, och Thahar med MirJam, Sammai, Jisbah Esthemoa fader.
౧౭ఎజ్రా కొడుకులు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. ఐగుప్తీయురాలూ, ఫరో కూతురూ అయిన బిత్యా ద్వారా మెరెదుకు పుట్టిన కొడుకులు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో, ఇష్బాహు అనేవాళ్ళు. ఈ ఇష్బాహు ఎష్టేమోను వాళ్లకి తండ్రి.
18 Och hans hustru Judija födde Jered, Gedors fader, Heber, Socho fader, Jekuthiel, Sanoahs fader. Desse äro Bithias barn, Pharaos dotters, hvilka Mared tog.
౧౮యూదురాలైన అతని భార్య వల్ల అతనికి గెదోరుకు తండ్రి అయిన యెరెదు, శోకోకు తండ్రి అయిన హెబెరు, జానోహకు తండ్రి అయిన యెకూతీయేలు పుట్టారు.
19 Den hustrunes Hodijas barn, Nahams systers, Kegila faders, voro: Hagarmi, och Esthemoa den Maachathiten.
౧౯నహము సోదరీ హూదీయా భార్యా అయిన ఆమెకు పుట్టిన కొడుకుల్లో ఒకడు గర్మీ వాడు కెయిలాకు తండ్రి. మరొకడు మాయకాతీయుడైన ఎష్టేమో.
20 Simeons barn voro: Amnon, Rinnah, och Benhanan, Thilon. Jisei barn voro: Soheth och Bensoheth.
౨౦షీమోను కొడుకులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోనులు. ఇషీ కొడుకులు జోహేతు, బెన్జోహేతులు.
21 Sela barn, Juda sons, voro: Er, Lecha fader, Laeda, Maresa fader, och de linväfvares slägter i Asbea hus;
౨౧యూదా కొడుకైన షేలహు కొడుకులు ఎవరంటే లేకాకు తండ్రియైన ఏరు, మారేషాకు తండ్రీ, బేత్ ఆష్బియాలో సన్నటి వస్త్రాలు నేసే వారికి మూలపురుషుడైన లద్దాయు,
22 Dertill Jokim, och de män af: Coseba, Joas, Saraph, hvilke husherrar voro i Moab, och bodde i Lahem; som de gamle säga.
౨౨యోకిం, కోజేబా సంతతి, యోవాషు సంతతి, మోయాబులో ప్రసిద్ధులై బెత్లేహెంకు తిరిగి వచ్చిన శారాపీయులూ. ఇవన్నీ పూర్వకాలంలోనే రాసి ఉన్న సంగతులే.
23 De voro pottomakare, och bodde ibland planteringar och gårdar, när Konungenom i hans arbete, och kommo och blefvo der.
౨౩వీళ్ళు కుమ్మరి వాళ్ళు. నెతాయీములోనూ, గెదేరలోనూ వీళ్ళు నివసించారు. వీళ్ళు రాజు కోసం పని చేయడానికి అక్కడ నివసించారు.
24 Simeons barn voro: Nemuel, Jamin, Jarib, Serah, Saul.
౨౪షిమ్యోను కొడుకులు వీళ్ళు. నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు.
25 Hans son var Sallum. Hans son var Mibsam. Hans son var Misma.
౨౫వీళ్ళలో షావూలుకు షల్లూము పుట్టాడు. షల్లూముకు మిబ్సాము పుట్టాడు. మిబ్సాముకు మిష్మా పుట్టాడు.
26 Misma barn voro: Hamuel. Hans son var Saccur. Hans son var Simei.
౨౬మిష్మా సంతతి వారెవరంటే అతని కొడుకు హమ్మూయేలు, అతని మనవడు జక్కూరు, మునిమనవడు షిమీ.
27 Simei hade sexton söner, och sex döttrar; och hans bröder hade icke mång barn; och all deras slägt förökade sig icke så mycket, som Juda barn.
౨౭షిమీకి పదహారు మంది కొడుకులూ, ఆరుగురు కూతుళ్ళూ పుట్టారు. కానీ అతని అన్నదమ్ములకు ఎక్కువమంది సంతానం కలుగలేదు. యూదా తెగ ప్రజలు వృద్ధి చెందినట్లు వీళ్ళ తెగలు వృద్ధి చెందలేదు.
28 Men de bodde i BerSeba, Molada, HazarSual,
౨౮వీళ్ళు బెయేర్షెబా, మోలాదా, హజర్షువలు అనే ఊళ్లలో నివసించారు.
౨౯వీళ్ళు ఇంకా బిల్హా, ఎజెము, తోలాదు,
30 Bethuel, Horma, Ziklag,
౩౦బెతూయేలు, హోర్మా, సిక్లగు
31 BethMarchaboth, HazarSusim, BethBirei, Saarim. Det voro deras städer, allt intill Konung David.
౩౧బేత్మర్కాబోతు, హాజర్సూసా, బేత్బీరీ, షరాయిము అనే ప్రాంతాల్లో కూడా నివసించారు. దావీదు పరిపాలన మొదలయ్యే వరకూ వీళ్ళు ఈ ఊళ్లలో నివసించారు.
32 Dertill deras byar, Etham, Ain, Rimmon, Thochen, Asan, de fem städerna;
౩౨వాళ్ళ ఐదు ఊళ్ళు ఏవంటే ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను.
33 Och alle de byar, som voro omkring dessa städerna, allt intill Baal. Det är deras boning, och deras ätt ibland dem.
౩౩వీటితో పాటు బయలు వరకూ ఉన్న గ్రామాలు వాళ్ళ వశంలో ఉండేవి. వీళ్ళు నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతాలు ఇవి. వీళ్ళు తమ వంశావళి వివరాలను భద్రం చేసుకున్నారు.
34 Och Mesobab, Jamlech, Josa, Amazia son,
౩౪వీళ్ళ తెగల నాయకులు ఎవరంటే మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కొడుకైన యోషా,
35 Joel, Jehu Josibia son, Seraja sons, Asiels sons,
౩౫యోవేలు, అశీయేలు కొడుకైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కొడుకైన యెహూ,
36 Eljoenai, Jaacoba, Jesohaja, Asaja, Adiel, Jisimiel, och Benaja,
౩౬ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా,
37 Sisa, Siphei son, Allons sons, Jedaja sons, Simri sons, Semaja sons.
౩౭షెమయాకు పుట్టిన షిమ్రీ కొడుకైన యెదాయాకు పుట్టిన అల్లోను కొడుకైన షిపి కొడుకైన జీజా అనేవాళ్ళు.
38 Desse voro namnkunnige Förstar uti deras ätter, och i deras fäders hus; och delade sig ut, efter det de voro månge.
౩౮వీళ్ళ కుటుంబాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి.
39 Och de drogo bort till att fara till Gedor, intill öster på dalen, på det de skulle söka bet för deras får.
౩౯వీళ్ళు తమ దగ్గర ఉన్న మందలకు మేత కోసం గెదోరుకు తూర్పు దిక్కున ఉన్న పల్లపు ప్రాంతానికి వెళ్ళారు.
40 Och de funno feta och goda bet, och ett vidt land, stilla och rikt; ty i förtiden bodde der de af Ham.
౪౦అక్కడ వాళ్ళకు పుష్టిగా, విస్తారంగా మేత ఉన్న ప్రాంతం కనిపించింది. ఆ దేశం విశాలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంది. అంతకుముందు అక్కడ హాము వంశం వాళ్ళు నివసించారు.
41 Och de som nu vid namn beskrifne äro, kommo i Hiskia tid, Juda Konungs, och slogo deras hyddor och boningar, som der funne vordo, och gjorde dem tillspillo, allt intill denna dag; och bodde i deras stad; ty der var bet för får.
౪౧ఆ వంశావళిలో పేర్లు ఉన్న వీరు యూదా రాజు హిజ్కియా పరిపాలించిన రోజుల్లో అక్కడకు వెళ్ళారు. అక్కడ హాము తెగల నివాసాల పైనా అక్కడే ఉన్న మేయూనిము తెగలపైనా దాడులు చేశారు. వాళ్ళను పూర్తిగా నాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తమ మందలకు సరిపోయినంత మేత అక్కడ ఉండటం వల్ల వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు.
42 Och gingo ut af dem af Simeons barnom, femhundrad män, intill Seirs berg, med deras öfverstar; Pelatia, Nearia, Rephaja, och Ussiel, Jisei barn;
౪౨షిమ్యోను తెగ నుండి ఐదు వందలమంది శేయీరు పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. వీళ్ళకు ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు నాయకులుగా ఉన్నారు.
43 Och slogo de återlefde af de Amalekiter, som undsluppne voro; och bodde der allt intill denna dag.
౪౩వీళ్ళు అమాలేకీయుల్లో మిగిలి ఉన్న కాందిశీకులను హతమార్చి అక్కడే ఈ రోజు వరకూ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు.