< 1 Krönikeboken 10 >

1 De Philisteer stridde emot Israel, och de af Israel flydde för de Philisteer, och de slagne föllo på Gilboa berg.
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళను గిల్బోవ పర్వతం మీద హతమార్చారు.
2 Och de Philisteer gåfvo sig hardt in på Saul och hans söner, och slogo Jonathan, AbiNadab och MalchiSua, Sauls söner.
ఫిలిష్తీయులు సౌలునీ అతని కొడుకులనూ వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానునీ, అబీనాదాబునీ, మల్కీషూవనీ చంపేశారు.
3 Och striden vardt skarp emot Saul; och de bågaskyttar kommo inpå honom, så att han blef sår af skyttorna.
సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమైంది. బాణాలు వేసే వాళ్ళు అతణ్ణి చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేసారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు.
4 Då sade Saul till sin vapnedragare: Drag ditt svärd ut, och stick mig igenom dermed, att desse oomskorne icke komma och fara skamliga med mig. Men hans vapnedragare ville icke; ty han fruktade sig svårliga. Då tog Saul sitt svärd, och föll deruppå.
అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో “నీ కత్తితో నన్ను పొడిచెయ్యి. లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు” అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దాని మీద పడ్డాడు.
5 Som nu hans vapnedragare såg, att Saul var död, föll han ock på svärdet, och blef död.
సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడూ చనిపోయాడు.
6 Alltså blef Saul död, och hans tre söner, och hans hela hus tillika.
ఈ విధంగా సౌలూ, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు.
7 Då nu de män af Israel, som i dalenom voro, sågo att de voro flydde, och att Saul och hans söner voro döde, öfvergåfvo de sina städer, och flydde; och de Philisteer kommo, och bodde deruti.
తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారనీ, సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు.
8 Den andra morgonen kommo de Philisteer till att afkläda de slagna, och funno Saul och hans söner liggande på Gilboa berg;
తరువాత రోజు చనిపోయిన వారి బట్టలనూ ఇతర వస్తువులనూ దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చారు. అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు.
9 Och klädde honom af, och togo hans hufvud och hans vapen, och sände uti de Philisteers land allt omkring, och läto förkunnat för deras afgudar och folkena;
వాళ్ళు సౌలు కవచాన్నితీసుకున్నారు. అతని తలనూ, ఆయుధాలనూ తీసుకువెళ్ళారు. తమ విగ్రహాల మధ్యా, ప్రజల మధ్యా ఈ వార్తను చాటించడానికి మనుషులను పంపారు.
10 Och lade hans vapen i deras guds hus; och hans hufvud slogo de på Dagons hus.
౧౦తమ దేవుని గుడిలో అతని ఆయుధాలను ఉంచారు. అతని తలను దాగోను గుడికి వేలాడదీశారు.
11 Då nu alle de i Jabes i Gilead hörde allt det de Philisteer Saul gjort hade,
౧౧ఫిలిష్తీయులు సౌలుకి చేసింది యాబేష్గిలాదు నివాసులకు తెలిసింది.
12 Reste de upp alle stridsamme män, och togo Sauls lekamen, och hans söners, och förde dem till Jabes, och begrofvo deras ben under den eken i Jabes; och fastade i sju dagar.
౧౨అప్పుడు వాళ్ళలో శూరులైన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సౌలు శరీరాన్నీ, అతని కొడుకుల శరీరాలనూ యాబేషుకి తీసుకు వచ్చారు. వాళ్ళ ఎముకలను యాబేషులోనే ఉన్న సింధూరం చెట్టు కింద పాతిపెట్టారు. ఏడు రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు.
13 Alltså blef Saul död i sine missgerning, som han emot Herran gjort hade, emot Herrans ord, det han icke höll; också derföre, att han frågade spåqvinnona,
౧౩సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు.
14 Och icke frågade Herran; derföre drap han honom, och vände riket till David, Isai son.
౧౪మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.

< 1 Krönikeboken 10 >