< Ayubu 27 >
1 Ayubu akaendelea kuoengea na kusema,
౧యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.
2 “Kama aishivyo Mungu, ameniondolea haki yangu, Mwenyezi, aliyeyafanya machungu maisha yangu,
౨నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు.
3 kadili uhai ungalimo ndani yangu uzima wa Mungu upo puani mwangu.
౩నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు,
4 Hakika midomo yangu haitanena uovu, wala ulimi wangu kunena uongo.
౪నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.
5 Sitakiri kwamba mko sahihi; hata nifapo sitakana uadilifu wangu.
౫మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను.
6 Naishikilia haki yangu na sitaiacha; nafsi yangu haitanisuta kadili ninavyoishi.
౬నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు.
7 Adui yangu na awe kama mwovu; anayeinuka kunyume changu na awe kama asiye haki.
౭నాకు శత్రువులు దుష్టులుగా కనబడతారు గాక. నన్నెదిరించేవారు నీతి లేని వారుగా కనబడతారు గాక.
8 Kwani tumaini la mwovu ni nini Mungu anapomwondoa, Mungu anapochukua uhai wake?
౮దేవుడు అతణ్ణి కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది?
9 Je Mungu atasikiliza kilio chake tabu zinapompat?
౯వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా?
10 Je atajifurahisha katika Mwenyezi na kumwita Mungu nyakati zote
౧౦వాడు సర్వశక్తుడిలో ఆనందిస్తాడా? వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడా?
11 Nitawafundisha kuhusu uwezo wa Mungu; sitabatilisha mawazo ya Mwenyezi.
౧౧దేవుని హస్తాన్ని గూర్చి నేను మీకు ఉపదేశిస్తాను. సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను.
12 Tazama, ninyi nyote mmeona; kwa nini basi mmeongea yasiyo na maana.
౧౨మీలో ప్రతివాడూ దాన్ని చూశాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని తలపోస్తూ ఉంటారు?
13 Hii ndiyo hatima ya waovu mbele za Mungu, urithi wa mtesaji aupokeao kutoka kwa Mwenyezi.
౧౩దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే. బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే.
14 Ikiwa watoto wake wataongezeka, ni kwa upanga; uzao wake utakuwa na njaa.
౧౪వారి పిల్లలు సంఖ్యలో విస్తరిస్తే అది కత్తివాత కూలడానికే గదా. వారి సంతానానికి చాలినంత ఆహారం దొరకదు.
15 Wanaomsalia watauawa kwa tauni, na wajane wao hawatawaombolezea.
౧౫వారికి మిగిలిన వారు తెగులు మూలంగా చచ్చి సమాధి అవుతారు. వారి వితంతువులు వారి విషయం రోదనం చెయ్యరు.
16 Japokuwa waovu hurundika mali kama mavumbi,
౧౬ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినా బంక మట్టి అంత విస్తారంగా వస్త్రాలు సిద్ధం చేసుకున్నా,
17 na kukusanya mavazi kama udongo, atakusanya mavazi, lakini mwenye haki atavaa, na wasio na hatia watagawana mali.
౧౭వారు అలా సిద్ధపరచుకుంటారే గానీ నీతిమంతులు వాటిని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుంటారు.
18 Hujenga nyumba yake kama buibui, kama kibanda cha muda afanyacho mlinzi.
౧౮వారు పురుగుల గూళ్లవంటి ఇళ్ళు కట్టుకుంటారు కావలివాడు కట్టుకునే గుడిసె లాంటి ఇళ్ళు వారు కట్టుకుంటారు.
19 Hulala kitandani akiwa tajiri, lakini hataendelea hivyo; na afumbuapo macho, hana kitu.
౧౯అతడు ధనికుడుగా పడుకుంటాడు గానీ అది కొనసాగదు. అతడు కళ్ళు తెరవగానే మొత్తం పోతుంది.
20 Vitisho humpata kama maji, dhoruba humwondoa usiku.
౨౦భయాలు జలప్రవాహంలాగా వారిని తరిమి పట్టుకుంటాయి. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుపోతుంది.
21 Upepo wa mashariki umwondoa, naye huondoka; humwondoa mahali pake.
౨౧తూర్పు గాలి అతణ్ణి ఎగరగొడుతుంది. వాడు ఇక ఉండడు. అది అతని స్థలంలో నుండి అతణ్ణి ఊడ్చివేస్తుంది.
22 Humpiga bila kukoma; hujaribu kumnasua katika uwezo wake.
౨౨ఆగకుండా తూర్పు గాలి అతని మీద విసిరి కొడుతుంది. వాడు దాని చేతిలోనుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాడు.
23 Unampigia makofi kwa kejeli; humwondoa mahali pake.
౨౩అది వాణ్ణి చూసి హేళనగా చప్పట్లు కొడుతుంది. వాడున్న చోటు నుండి వాణ్ణి ఈసడింపుగా తోలివేస్తుంది.