< Maombolezo 5 >

1 Kumbuka, Ee Bwana, yaliyotupata, tazama, nawe uione aibu yetu.
యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.
2 Urithi wetu umegeuziwa kwa wageni, na nyumba zetu kwa wageni.
మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది. మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి.
3 Tumekuwa yatima wasio na baba, mama zetu wamekuwa kama wajane.
మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు.
4 Ni lazima tununue maji tunayokunywa, kuni zetu zapatikana tu kwa kununua.
మా నీళ్లు మేము డబ్బుతో కొనుక్కుని తాగాం. మా కట్టెలు మాకే అమ్మారు.
5 Wanaotufuatilia wapo kwenye visigino vyetu, tumechoka na hakuna pumziko.
వాళ్ళు మమ్మల్ని తరిమారు. మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు.
6 Tumejitolea kwa Misri na Ashuru tupate chakula cha kutosha.
అన్నం కోసం ఐగుప్తీయులకూ అష్షూరీయులకూ చెయ్యి చాపాం.
7 Baba zetu walitenda dhambi na hawapo tena, na sisi tunachukua adhabu yao.
మా పితరులు పాపం చేసి చనిపోయారు. మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం.
8 Watumwa wanatutawala na hakuna wa kutuokoa mikononi yao.
దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు.
9 Tunapata chakula chetu kwa kuhatarisha maisha yetu kwa sababu ya upanga jangwani.
ఎడారి ప్రజల కత్తి భయంతో ప్రాణానికి తెగించి మా ఆహారం తెచ్చుకుంటున్నాం.
10 Ngozi yetu ina joto kama tanuru, kwa sababu ya fadhaa itokanayo na njaa.
౧౦కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది.
11 Wanawake wametendwa jeuri katika Sayuni, na mabikira katika miji ya Yuda.
౧౧శత్రువులు సీయోనులో స్త్రీలను, యూదా పట్టణాల్లో కన్యకలను మానభంగం చేశారు.
12 Wakuu wametungikwa juu kwa mikono yao, wazee hawapewi heshima.
౧౨అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.
13 Vijana wanataabika kwenye mawe ya kusagia, wavulana wanayumbayumba chini ya mizigo ya kuni.
౧౩బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.
14 Wazee wameondoka langoni la mji, vijana wameacha kuimba nyimbo zao.
౧౪పెద్దలను గుమ్మాల దగ్గర కూర్చోకుండా తొలగించారు. యువకులను సంగీతం నుంచి దూరం చేశారు.
15 Furaha imeondoka mioyoni mwetu, kucheza kwetu kumegeuka maombolezo.
౧౫మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.
16 Taji imeanguka kutoka kichwani petu. Ole wetu, kwa maana tumetenda dhambi!
౧౬మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!
17 Kwa sababu hiyo, mioyo yetu inazimia, kwa sababu ya hayo, macho yetu yamefifia,
౧౭మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి.
18 kwa ajili ya Mlima Sayuni, ambao unakaa ukiwa, nao mbweha wanatembea juu yake.
౧౮సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి.
19 Wewe, Ee Bwana unatawala milele, kiti chako cha enzi chadumu kizazi hadi kizazi.
౧౯యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.
20 Kwa nini watusahau siku zote? Kwa nini umetuacha kwa muda mrefu?
౨౦నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?
21 Turudishe kwako mwenyewe, Ee Bwana, ili tupate kurudi. Zifanye mpya siku zetu kama siku za kale,
౨౧యెహోవా, నువ్వు మమ్మల్ని నీ వైపుకు మళ్ళీ తిప్పు. మేము తిరుగుతాం.
22 isipokuwa uwe umetukataa kabisa na umetukasirikia pasipo kipimo.
౨౨నువ్వు మమ్మల్ని పూర్తిగా విడిచి పెట్టకపోతే, మా మీద నీకు విపరీతమైన కోపం లేకపోతే మా పూర్వస్థితి మళ్ళీ మాకు కలిగించు.

< Maombolezo 5 >