< Salmos 121 >
1 Cántico gradual. ALZARÉ mis ojos á los montes, de donde vendrá mi socorro.
౧యాత్రల కీర్తన కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 Mi socorro [viene] de Jehová, que hizo los cielos y la tierra.
౨యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.
3 No dará tu pie al resbaladero; ni se dormirá el que te guarda.
౩ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.
4 He aquí, no se adormecerá ni dormirá el que guarda á Israel.
౪ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.
5 Jehová es tu guardador: Jehová es tu sombra á tu mano derecha.
౫నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా.
6 El sol no te fatigará de día, ni la luna de noche.
౬పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.
7 Jehová te guardará de todo mal: él guardará tu alma.
౭ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.
8 Jehová guardará tu salida y tu entrada, desde ahora y para siempre.
౮ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.