< Proverbios 19 >
1 MEJOR es el pobre que camina en su sencillez, que el de perversos labios y fatuo.
౧బుద్ధిహీనుడై కుటిలంగా మాట్లాడే వాడి కంటే యథార్థంగా ప్రవర్తించే పేదవాడే గొప్ప.
2 El alma sin ciencia no es buena; y el presuroso de pies peca.
౨ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు.
3 La insensatez del hombre tuerce su camino; y contra Jehová se aira su corazón.
౩ఒకడి మూర్ఖత్వం వాడి బ్రతుకును ధ్వంసం చేస్తుంది. అలాటి వాడు యెహోవా మీద మండిపడతాడు.
4 Las riquezas allegan muchos amigos: mas el pobre, de su amigo es apartado.
౪సంపద స్నేహితులను సమకూరుస్తుంది. దరిద్రుడికి స్నేహితులు దూరమౌతారు.
5 El testigo falso no quedará sin castigo; y el que habla mentiras no escapará.
౫అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.
6 Muchos rogarán al príncipe: mas cada uno es amigo del hombre que da.
౬ఉదార గుణం గలవారిని చాలామంది సహాయం కోసం అడుగుతారు. ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే.
7 Todos los hermanos del pobre le aborrecen: ¡cuánto más sus amigos se alejarán de él! buscará la palabra y no la hallará.
౭పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు.
8 El que posee entendimiento, ama su alma: el que guarda la inteligencia, hallará el bien.
౮బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు.
9 El testigo falso no quedará sin castigo; y el que habla mentiras, perecerá.
౯అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.
10 No conviene al necio el deleite: ¡cuánto menos al siervo ser señor de los príncipes!
౧౦బుద్ధిహీనుడు సుఖ భోగాలనుభవించడం తగదు. ఒక బానిస రాజులపై ఏలుబడి చేయడం అంతకన్నా తగదు.
11 La cordura del hombre detiene su furor; y su honra es disimular la ofensa.
౧౧విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత.
12 Como el bramido del cachorro de león es la ira del rey; y su favor como el rocío sobre la hierba.
౧౨రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది.
13 Dolor es para su padre el hijo necio; y gotera continua las contiendas de la mujer.
౧౩మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం.
14 La casa y las riquezas herencia son de los padres: mas de Jehová la mujer prudente.
౧౪ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే.
15 La pereza hace caer en sueño; y el alma negligente hambreará.
౧౫సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.
16 El que guarda el mandamiento, guarda su alma: mas el que menospreciare sus caminos, morirá.
౧౬ఆజ్ఞ పాటించేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనివాడు చచ్చిపోతాడు.
17 A Jehová empresta el que da al pobre, y él le dará su paga.
౧౭పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.
18 Castiga á tu hijo en tanto que hay esperanza; mas no se excite tu alma para destruirlo.
౧౮అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు.
19 El de grande ira llevará la pena: y si usa de violencias, añadirá [nuevos males].
౧౯పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది.
20 Escucha el consejo, y recibe la corrección, para que seas sabio en tu vejez.
౨౦సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు.
21 Muchos pensamientos hay en el corazón del hombre; mas el consejo de Jehová permanecerá.
౨౧మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి.
22 Contentamiento es á los hombres hacer misericordia: pero mejor es el pobre que el mentiroso.
౨౨మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు.
23 El temor de Jehová [es] para vida; y [con él] vivirá el [hombre], lleno de reposo; no será visitado de mal.
౨౩యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.
24 El perezoso esconde su mano en el seno: aun á su boca no la llevará.
౨౪సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు.
25 Hiere al escarnecedor, y el simple se hará avisado; y corrigiendo al entendido, entenderá ciencia.
౨౫హేళన చేసే వారిని దండించు, అది చూసి ఆజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారు జ్ఞానంలో ఎదుగుతారు.
26 El que roba á su padre y ahuyenta á su madre, hijo es avergonzador y deshonrador.
౨౬తండ్రిని బాధిస్తూ తల్లిని తరిమేసేవాడు సిగ్గు, అపకీర్తి తెచ్చే కొడుకు.
27 Cesa, hijo mío, de oir la enseñanza [que induce] á divagar de las razones de sabiduría.
౨౭కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు.
28 El testigo perverso se burlará del juicio; y la boca de los impíos encubrirá la iniquidad.
౨౮చెడిపోయిన సాక్షి న్యాయాన్ని గేలి చేస్తాడు. దుర్మార్గుల నోరు దోషాన్ని జుర్రుకుంటుంది.
29 Aparejados están juicios para los escarnecedores, y azotes para los cuerpos de los insensatos.
౨౯అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు.