< Salmos 33 >
1 Cantád justos en Jehová: a los rectos es hermosa la alabanza.
౧నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది.
2 Celebrád a Jehová con arpa: con salterio y decacordio cantád a él.
౨వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి.
3 Cantád a él canción nueva: hacéd bien tañendo con júbilo.
౩ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి.
4 Porque derecha es la palabra de Jehová: y toda su obra con verdad.
౪ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే.
5 Él ama justicia y juicio: de la misericordia de Jehová está llena la tierra.
౫ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.
6 Con la palabra de Jehová fueron hechos los cielos: y con el espíritu de su boca todo el ejército de ellos.
౬యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.
7 El junta, como en un montón, las aguas de la mar: él pone por tesoros los abismos.
౭ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు.
8 Teman a Jehová toda la tierra: teman de él todos los habitadores del mundo.
౮భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.
9 Porque él dijo, y fue; él mandó y estuvo.
౯ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.
10 Jehová hace anular el consejo de las gentes, y él hace anular las maquinaciones de los pueblos.
౧౦దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.
11 El consejo de Jehová permanecerá para siempre; los pensamientos de su corazón, por generación y generación.
౧౧యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.
12 Bienaventurada la gente a quien Jehová es su Dios: el pueblo a quien escogió por heredad para sí.
౧౨యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.
13 Desde los cielos miró Jehová; vio a todos los hijos de Adam.
౧౩ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు.
14 Desde la morada de su asiento miró sobre todos los moradores de la tierra.
౧౪తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు.
15 El formó el corazón de todos ellos; él entiende todas sus obras.
౧౫అందరి హృదయాలనూ మలచిన వాడు వాళ్ళు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు.
16 El rey no es salvo con la multitud del ejército; el valiente no escapa con la mucha fuerza.
౧౬ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.
17 Vanidad es el caballo para la salud; con la multitud de su fuerza no escapa.
౧౭గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు.
18 He aquí, el ojo de Jehová sobre los que le temen; sobre los que esperan su misericordia;
౧౮చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ,
19 Para librar de la muerte a sus almas; y para darles vida en la hambre.
౧౯యెహోవా పట్ల భయభక్తులుగల వాళ్ళ పైనా నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ల పైనా ఆయన కనుచూపు నిలిచి ఉంది.
20 Nuestra alma esperó a Jehová; nuestro ayudador y nuestro escudo es él.
౨౦మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే.
21 Por tanto en él se alegrará nuestro corazón, porque en su santo nombre hemos confiado.
౨౧మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి. ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది.
22 Sea tu misericordia, o! Jehová, sobre nosotros, como te hemos esperado.
౨౨యెహోవా, ఆశగా నీవైపు చూస్తున్నాం. నీ నిబంధన నిబద్ధత మాపై ఉండనియ్యి.