< Ezequiel 17 >
1 Y fue palabra de Jehová a mí, diciendo:
౧యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
2 Hijo del hombre, propón una figura, y compón una parábola a la casa de Israel;
౨“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక పొడుపు కథ వెయ్యి. ఒక ఉదాహరణ వారికి చెప్పు.
3 Y dirás: Así dijo el Señor Jehová: Una grande águila, de grandes alas, y de luengos miembros, llena de pluma de diversos colores vino al Líbano, y tomó el cogollo del cedro.
౩ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది.
4 Arrancó el principal de sus renuevos, y trájolo a la tierra de mercaderes, y púsolo en la ciudad de los negociantes.
౪అది ఆ చెట్టు లేత కొమ్మల చిగుళ్ళు తుంచి, వాటిని కనాను దేశానికి తీసుకు వెళ్ళింది. అక్కడ వర్తకులుండే పట్టణంలో వాటిని నాటింది.
5 Y tomó de la simiente de la tierra, y púsola en un campo bueno para sembrar, plantóla junto a grandes aguas, púsola como un sauce.
౫అది ఆ దేశంలో నుండి కొన్ని విత్తనాలు కూడా తీసుకు వెళ్ళింది. విత్తనాలు నాటడానికి సిద్ధపరిచిన ఒక పొలంలో వాటిని నాటింది. వాటిని నాటిన చోటికి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది.
6 Y reverdeció, e hízose una vid de mucha rama, baja de estatura, que sus ramas la miraban, y sus raíces estaban debajo de ella: así que se hizo una vid, e hizo sarmientos, y echó mugrones.
౬అది మొలకలు వేసింది. పైకి పెరగకుండా భూమిపై ఎత్తు పెరగకుండానే విశాలమైన కొమ్మలతో నేలపై వ్యాపించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు ఆ డేగ వరకూ వ్యాపించాయి. దాని వేళ్ళు డేగ కింద వైపుకు వ్యాపించాయి. ఆ విధంగా ఆ ద్రాక్ష చెట్టు అనేక శాఖలతో వర్ధిల్లి కొత్తగా రెమ్మలు వేసింది.
7 Y fue otra grande águila, de grandes alas, y de muchas plumas; y he aquí que esta vid juntó cerca de ella sus raíces, y extendió hacia ella sus ramos, para ser regada de ella por los surcos de su plantación.
౭పెద్ద రెక్కలూ, విస్తారమైన ఈకలూ ఉన్న ఇంకో గొప్ప డేగ ఉంది. చూడండి! ఈ ద్రాక్ష చెట్టు తన వేళ్ళను ఈ డేగ వైపుకి మళ్ళించింది. అది నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమి నుండి తన కొమ్మలను డేగ వైపుకి మళ్ళించింది.
8 En un buen campo junto a muchas aguas fue plantada, para que hiciese ramos, y llevase fruto, y para que fuese vid fuerte.
౮దాన్ని ఒక పెద్ద నీటి చెరువు పక్కనే మంచి నేల్లో అనేక కొమ్మలు వేసి, ఫలించి, చక్కని ద్రాక్ష తీగె కావాలని నాటడం జరిగింది.”
9 Dí: Así dijo el Señor Jehová: ¿Será prosperada? ¿No arrancará sus raíces, y destruirá su fruto, y secarse ha? Todas las hojas de su verdura secará, y, no con gran brazo, ni con mucha gente, arrancándola de sus raíces.
౯ప్రజలను ఇలా అడుగు. “అది అభివృద్ధి చెందుతుందా? ప్రజలు దాని వేళ్ళను పీకివేసి దాని పళ్ళు కోసుకోరా? అప్పుడది ఎండి పోవాల్సిందే గదా! దాని చిగుళ్ళు ఎండి పోయాక ఎంతమంది దాని కోసం శ్రమించినా దాని వేళ్ళు ఇక చిగురించవు.
10 Y he aquí que ella está plantada: ¿será prosperada? ¿Cuándo el viento solano la tocare, no se secará del todo? En los surcos de su verdura se secará.
౧౦ఒకవేళ దాన్ని తిరిగి నాటినా అది పెరుగుతుందా? తూర్పునుండి గాలి దాన్ని తాకినప్పుడు అది ఎండిపోతుంది కదా! అది నాటి ఉన్న భూమిలోనే మొత్తం ఎండిపోతుంది.”
11 Y fue palabra de Jehová a mí, diciendo:
౧౧తరువాత యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
12 Di ahora a la casa rebelde: ¿No habéis entendido que significan estas cosas? Dí: He aquí que el rey de Babilonia vino a Jerusalem, y tomó tu rey y sus príncipes, y trájolos consigo en Babilonia.
౧౨“తిరగబడే జాతికి ఇలా చెప్పు. ఈ మాటల భావం మీకు తెలియదా? చూడండి! బబులోనురాజు యెరూషలేముకు వచ్చి ఆమె రాజునూ ఆమె యువరాజులనూ పట్టుకుని వాళ్ళని బబులోనులో తన దగ్గరకి తీసుకు పోయాడు.
13 Y tomó de la simiente del reino, e hizo con él alianza, y trájole el juramento; y tomó los fuertes de la tierra,
౧౩అతడు రాజు వంశస్థుల్లో ఒకణ్ణి తీసుకుపోయి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. అతనితో ఒట్టు పెట్టించాడు. రాజ్యం బలహీనం కావడం కోసం, అది మళ్ళీ కోలుకోకుండా ఉండటానికి దేశంలో ఉన్న బలవంతులను అతడు తీసుకు వెళ్లి పోయాడు.,
14 Para que el reino fuese abajado, y no se levantase: mas que guardase su alianza, y estuviese en ella.
౧౪ఇప్పుడు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటే దేశం నిలిచి ఉంటుంది.
15 Y rebeló contra él enviando sus embajadores en Egipto, para que le diese caballos, y mucha gente. ¿El que estas cosas hizo, será prosperado? ¿escapará? ¿Y él que rompió la alianza, podrá huir?
౧౫కాని యెరూషలేము రాజు గుర్రాల కోసమూ, సైన్యం కోసమూ ఐగుప్తు రాజు దగ్గరికి రాయబారులను పంపడం ద్వారా తిరుగుబాటు చేశాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అలాంటి పనులు చేసి అతడు తప్పించుకుంటాడా? నిబంధనను మీరినవాడు తప్పించుకుంటాడా?
16 Vivo yo, dijo el Señor Jehová, que en medio de Babilonia morirá: en el lugar del rey, que le hizo reinar, cuyo juramento menospreció, y cuya alianza con él hecha rompió.
౧౬నా ప్రాణం పైన ఒట్టు, ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. ఎవరితో చేసిన నిబంధనను అతడు భంగ పరిచాడో, ఏ రాజు దగ్గర ఒట్టు పెట్టాడో, ఏ రాజు తనని రాజుగా చేశాడో ఆ రాజు రాజ్యంలోనే అతడు చనిపోతాడు. అతడు బబులోను లోనే చనిపోతాడు!
17 Y no con grande ejército, ni con mucha compañía hará con él Faraón en la batalla, fundando baluarte, y edificando bastiones, para cortar muchas vidas.
౧౭బబులోను సైన్యాలు యుద్ధంలో ముట్టడికై ఉన్నత స్థలాలను కట్టినప్పుడు, ప్రజలను చంపడానికి ప్రాకారాలను ముట్టడి వేసినప్పుడు ఫరో, అతని బలమైన సైన్యం, అతడు యుద్ధానికి సమకూర్చిన మనుషులు యుద్ధంలో యెరూషలేము రాజును కాపాడలేవు.
18 Y menospreció el juramento para invalidar el concierto, y he aquí que dio su mano, e hizo todas estas cosas: no escapará.
౧౮ఎందుకంటే రాజు తన చేతులు కలిపి ప్రమాణం చేశాడు. నిబంధనను భంగపరచడం ద్వారా తాను చేసిన ప్రమాణాన్ని తృణీకరించాడు. అతడు తప్పించుకోలేడు.”
19 Por tanto así dijo el Señor Jehová: Vivo yo, que el juramento mío que menospreció, y mi concierto que invalidó, tornaré sobre su cabeza.
౧౯కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “అతడు తృణీకరించిన ప్రమాణం నాకు చేసింది కాదా! నా నిబంధనను అతడు భంగం చేశాడు కదా! కాబట్టి అతడి పైకి శిక్ష రప్పిస్తున్నాను.
20 Y extenderé sobre él mi red, y será preso en mi red; y hacerle he venir en Babilonia, y allí estaré a juicio con él, por su rebelión, con que rebeló contra mí.
౨౦నా వల అతనిపై విసురుతున్నాను. అతడు నా ఉచ్చులో చిక్కుకుంటాడు. రాజద్రోహం చేసినందుకూ, నాకు నమ్మకద్రోహం చేసినందుకూ అతనిపై శిక్ష అమలు పరచడానికి అతణ్ణి బబులోనుకి తీసుకు వెళ్తాను.
21 Y todos sus fugitivos, con todos sus ejércitos, caerán a cuchillo; y los que quedaren, serán esparcidos a todo viento; y sabréis que yo Jehová he hablado.
౨౧అతనితో ఉన్న సైన్యంలో తప్పించుకుని పారిపోయిన వాళ్ళందరూ ఖడ్గం చేత నిర్మూలం అవుతారు. మిగిలిన వాళ్ళు అన్ని వైపులకీ చెదిరిపోతారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందని ప్రకటిస్తున్నాను.”
22 Así dijo el Señor Jehová: Y tomaré yo del cogollo de aquel cedro alto, y ponerlo he: del principal de sus renuevos cortaré un tallo, y plantarlo he yo sobre el monte alto y sublime.
౨౨ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.
23 En el monte alto de Israel lo plantaré, y alzará ramos, y hará fruto; y hacerse ha cedro magnífico, y habitaran debajo de él todas las aves, toda cosa que vuela habitará a la sombra de sus ramos.
౨౩అది శాఖలుగా విస్తరించి ఫలాన్ని ఇచ్చేలా నేను దాన్ని ఇశ్రాయేలు పర్వతాల పైన నాటుతాను. అది ఎంతో ఘనమైన దేవదారు వృక్షం అవుతుంది. దాని కింద రెక్కలున్న పక్షులన్నీ నివసిస్తాయి. దాని కొమ్మల నీడలో అవి తమ గూళ్ళు కట్టుకుని పిల్లలను పెడతాయి.
24 Y sabrán todos los árboles del campo, que yo Jehová abajé el árbol sublime, levanté el árbol bajo, hice secar el árbol verde, e hice reverdecer el árbol seco. Yo Jehová hablé, e hice.
౨౪అప్పుడు భూమిపైన చెట్లన్నీ నేనే యెహోవాను అని తెలుసుకుంటాయి. గొప్ప చెట్లను నేను కిందకు లాగుతాను. హీనమైన చెట్లను పైకి లేపుతాను. పచ్చని చెట్టు ఎండిపోయేలా చేస్తాను. ఎండిన చెట్టు వికసించేలా చేస్తాను. నేనే యెహోవాను. ఇది జరుగుతుందని నేను చెప్పాను. దీన్ని తప్పక నెరవేరుస్తాను.”